Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an mu rurimi rw'igitelugu-Maulana Abder-Rahim Ibun Muhammad.

numero y'urupapuro:close

external-link copy
35 : 13

مَثَلُ الْجَنَّةِ الَّتِیْ وُعِدَ الْمُتَّقُوْنَ ؕ— تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ— اُكُلُهَا دَآىِٕمٌ وَّظِلُّهَا ؕ— تِلْكَ عُقْبَی الَّذِیْنَ اتَّقَوْا ۖۗ— وَّعُقْبَی الْكٰفِرِیْنَ النَّارُ ۟

దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గపు ఉదాహరణ ఇదే! దాని క్రింద సెలయేళ్ళు పారుతూ ఉంటాయి.[1] దాని ఫలాలు మరియు నీడ సదా ఉంటాయి.[2] దైవభీతి గలవారి అంతిమ ఫలితం ఇదే. మరియు సత్యతిరస్కారుల అంతిమ ఫలితం నరకాగ్నియే! info

[1] స్వర్గనరకాలు మానవుల జ్ఞానపరిధికి అగోచర విషయాలు. కావున వాటిని మానవులకు తెలిసిన ఉద్యానవనాలు మరియు అగ్నితో పోల్చి చెప్పబడుతోంది. చూడండి, 47:15. [2] "జిల్లున్: అర్థం కొరకు చూడండి, 4:57 చివరి భాగం.

التفاسير:

external-link copy
36 : 13

وَالَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ یَفْرَحُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَمِنَ الْاَحْزَابِ مَنْ یُّنْكِرُ بَعْضَهٗ ؕ— قُلْ اِنَّمَاۤ اُمِرْتُ اَنْ اَعْبُدَ اللّٰهَ وَلَاۤ اُشْرِكَ بِهٖ ؕ— اِلَیْهِ اَدْعُوْا وَاِلَیْهِ مَاٰبِ ۟

మరియు (ఓ ప్రవక్తా!) ఎవరికైతే మేము (ముందు) గ్రంథాన్ని ఇచ్చామో! వారు నీపై అవతరింప జేయబడిన దాని (ఈ గ్రంథం) వలన సంతోషపడుతున్నారు.[1] మరియు వారిలోని కొన్ని వర్గాల వారు దానిలోని కొన్ని విషయాలను తిరస్కరించేవారు కూడా ఉన్నారు.[2] వారితో ఇలా అను: "నిశ్చయంగా, నేను అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని మరియు ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించరాదని ఆజ్ఞాపించబడ్డాను. నేను మిమ్మల్ని ఆయన వైపునకే ఆహ్వానిస్తున్నాను మరియు గమ్యస్థానం కూడా ఆయన వద్దనే ఉంది! info

[1] వీరు ముస్లింలు. [2] వీరు క్రైస్తవులు, యూదులు మరియు ముష్రికులు.

التفاسير:

external-link copy
37 : 13

وَكَذٰلِكَ اَنْزَلْنٰهُ حُكْمًا عَرَبِیًّا ؕ— وَلَىِٕنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ بَعْدَ مَا جَآءَكَ مِنَ الْعِلْمِ ۙ— مَا لَكَ مِنَ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا وَاقٍ ۟۠

మరియు ఈ విధంగా మేము అరబ్బీ భాషలో మా శాసనాన్ని అవతరింప జేశాము.[1] ఇక నీవు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా వారి కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ నుండి నిన్ను రక్షించేవాడు గానీ, కాపాడేవాడు గానీ ఎవ్వడూ ఉండడు. info

[1] చూడండి, 14:4 మరియు12:2. ప్రతి ప్రవక్తపై అతన ప్రజల కొరకు ఆ ప్రాంతపు భాషలోనే దివ్యగ్రంథం అవతరింపజేయబడింది. వారు దానిని సులభంగా అర్థం చేసుకోవాలని. ఈ ఖుర్ఆన్ దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) పై సర్వలోకాల వారి కొరకు, అవతరింపజేయబడిన అంతిమ దివ్యగ్రంథం. చూడండి, 7:158.

التفاسير:

external-link copy
38 : 13

وَلَقَدْ اَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ وَجَعَلْنَا لَهُمْ اَزْوَاجًا وَّذُرِّیَّةً ؕ— وَمَا كَانَ لِرَسُوْلٍ اَنْ یَّاْتِیَ بِاٰیَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ— لِكُلِّ اَجَلٍ كِتَابٌ ۟

మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము మరియు వారికి భార్యాపిల్లలను ప్రసాదించాము.[1] అల్లాహ్ అనుమతి లేకుండా, ఏ అద్భుత సంకేతాన్ని (స్వయంగా) తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకూ లేదు.[2] ప్రతి వాగ్దానానికి (విషయానికి) వ్రాయబడిన ఒక ఆదేశం (శాసనం) ఉంది.[3] info

[1] చూడండి, 25:7 దైవప్రవక్తలు అందరూ మానవులే. వారికి కుటుంబం ఉండేది. వారికి భార్యాబిడ్డలుండిరి. వారు సాధారణ మానవుల వలే తినేవారు, త్రాగేవారు, ప్రజలతో కలిసి మెలిసి తిరిగే వారు. కాని వారిపై దివ్యజ్ఞాన (వ'హీ) వస్తూ ఉండేది. దానిని వారు ఉన్నది ఉన్నట్టుగా పూర్తిగా ప్రజలకు వినిపించి సత్యధర్మం వైపునకు ఆహ్వానించేవారు. ఒకవేళ వారు దైవదూతలైతే వారికెలా సంతానం మరియు కుటుంబం ఉంటాయి? [2] అద్భుత సంకేతాల శక్తి కేవలం అల్లాహ్ (సు.తా.)కే ఉంది. ఆయన అనుమతి లేనిదే ఏ ప్రవక్త కూడా వాటిని చూపలేడు. అల్లాహ్ (సు.తా.) తన ఇష్టప్రకారం తాను అవసరం అనుకున్నప్పుడు వాటిని చూపుతాడు. చూడండి, 6:109 [3] అల్లాహ్ (సు.తా.) యొక్క ప్రతి వాగ్దానికి ఒక సమయం నియమింపబడి ఉంది.అల్లాహుతా'ఆలా ఆ సమయం వచ్చే వరకు ప్రజలకు వ్యవధినిస్తాడు. అది వచ్చిన తరువాత దానిని ఎవ్వరూ ఆపలేరు. అల్లాహ్ (సు.తా.) తన వాగ్దానం పూర్తి చేసి తీరుతాడు. దీని మరొక తాత్పర్యం: 'ప్రతి యుగానికి ఒక గ్రంథం ఉంది.'

التفاسير:

external-link copy
39 : 13

یَمْحُوا اللّٰهُ مَا یَشَآءُ وَیُثْبِتُ ۖۚ— وَعِنْدَهٗۤ اُمُّ الْكِتٰبِ ۟

అల్లాహ్ తాను కోరిన దానిని రద్దు చేస్తాడు మరియు (తాను కోరిన దానిని) స్థిరపరుస్తాడు.[1] మరియు మాతృగ్రంథం (ఉమ్ముల్ కితాబ్)[2] ఆయన దగ్గరే ఉంది. info

[1] చూడండి, 2:106 [2] చూడండి, 43:4 మరియు 85:22. ఉమ్ముల్ కితాబ్, అంటే లౌ'హె మ'హ్ ఫూ"జ్. సురక్షితమైన ఫలకం, మూలగ్రంథం. అంటే యథాస్థితిలో, భద్రంగా ఉంచబడిన గ్రంథం.

التفاسير:

external-link copy
40 : 13

وَاِنْ مَّا نُرِیَنَّكَ بَعْضَ الَّذِیْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّیَنَّكَ فَاِنَّمَا عَلَیْكَ الْبَلٰغُ وَعَلَیْنَا الْحِسَابُ ۟

మరియు (ఓ ప్రవక్తా!) మేము వారికి చేసిన వాగ్దానాలలో కొన్నింటిని నీకు చూపినా, లేదా (వాటిని చూపక ముందు) నిన్ను మరణింపజేసినా, నీ బాధ్యత కేవలం (మా సందేశాన్ని) అందజేయటమే! మరియు లెక్క తీసుకోవటం కేవలం మా పని. info
التفاسير:

external-link copy
41 : 13

اَوَلَمْ یَرَوْا اَنَّا نَاْتِی الْاَرْضَ نَنْقُصُهَا مِنْ اَطْرَافِهَا ؕ— وَاللّٰهُ یَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهٖ ؕ— وَهُوَ سَرِیْعُ الْحِسَابِ ۟

ఏమీ? వాస్తవానికి మేము భూమిని అన్ని వైపుల నుండి తగ్గిస్తూ వస్తున్నామనేది వారు చూడటం లేదా?[1] మరియు అల్లాహ్ యే ఆజ్ఞ ఇస్తాడు! ఆయన ఆజ్ఞను మార్చే వాడు ఎవ్వడు లేడు. మరియు ఆయన లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు. info

[1] అంటే, 'అరేబియా భూభాగం, రోజు రోజుకు ముష్రికుల కొరకు తగ్గుతూ పోవడం మరియు ముస్లింలు దానిని ఆక్రమించుకోవడం వారు (ముష్రికులు) చూడటం లేదా?

التفاسير:

external-link copy
42 : 13

وَقَدْ مَكَرَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ فَلِلّٰهِ الْمَكْرُ جَمِیْعًا ؕ— یَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍ ؕ— وَسَیَعْلَمُ الْكُفّٰرُ لِمَنْ عُقْبَی الدَّارِ ۟

మరియు వాస్తవానికి వారికి పూర్వం ఉన్నవారు కూడా కుట్రలు పన్నారు. కాని, కుట్రలన్నీ అల్లాహ్ కే చెందినవి. ప్రతి ప్రాణి సంపాందించేది ఆయనకు తెలుసు. మరియు (మేలైన) అంతమ (పరలోక) నివాసం ఎవరిదో సత్యతిరస్కారులు తెలుసుకుంటారు. info
التفاسير: