Tradução dos significados do Nobre Qur’an. - Tradução Telegráfica - Abdul Rahim bin Muhammad

external-link copy
18 : 5

وَقَالَتِ الْیَهُوْدُ وَالنَّصٰرٰی نَحْنُ اَبْنٰٓؤُا اللّٰهِ وَاَحِبَّآؤُهٗ ؕ— قُلْ فَلِمَ یُعَذِّبُكُمْ بِذُنُوْبِكُمْ ؕ— بَلْ اَنْتُمْ بَشَرٌ مِّمَّنْ خَلَقَ ؕ— یَغْفِرُ لِمَنْ یَّشَآءُ وَیُعَذِّبُ مَنْ یَّشَآءُ ؕ— وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ؗ— وَاِلَیْهِ الْمَصِیْرُ ۟

మరియు యూదులు మరియు క్రైస్తవులు ఇలా అంటారు: "మేము అల్లాహ్ సంతానం మరియు ఆయనకు ప్రియమైన వారము."[1] (వారితో) ఇలా అను: "అయితే, ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? అలా కాదు, మీరు కూడ ఆయన పుట్టించిన మానవులలో ఒకరు మాత్రమే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు ఆకాశాలలో, భూమిలో మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్ దే మరియు ఆయన వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది." info

[1] యూదులు 'ఉజైర్ ('అ.స.)ను మరియు క్రైస్తవులు 'ఈసా ('అ.స.)ను అల్లాహ్; లేక అల్లాహుతా'ఆలా కుమారులు అంటారు. మరియు యూదులు తమను తాము అల్లాహుతా'ఆలా సంతానంగా చెప్పుకుంటారు. ఈ ఆయత్ వారి ఈ వాదాన్ని ఖండిస్తోంది.

التفاسير: