Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão.

Número de página:close

external-link copy
62 : 3

اِنَّ هٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ— وَمَا مِنْ اِلٰهٍ اِلَّا اللّٰهُ ؕ— وَاِنَّ اللّٰهَ لَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

నిశ్చయంగా ఈసా అలైహిస్సలాం గురించి మీకు తెలుపబడినది ఎలాంటి అబద్ధమూ లేదా సందేహమూ లేని ఒక నిజమైన వృత్తాంతము. ఏకైకుడైన అల్లాహ్ తప్ప నిజంగా ఆరాధనలకు అర్హులు ఎవ్వరూ లేరు. అల్లాహ్ తన అధికారంలో శక్తివంతమైనవాడు. ఇంకా ఆయన తన ప్రణాళికలలో మరియు ఆదేశాలలో అత్యంత తెలివైనవాడు. info
التفاسير:

external-link copy
63 : 3

فَاِنْ تَوَلَّوْا فَاِنَّ اللّٰهَ عَلِیْمٌۢ بِالْمُفْسِدِیْنَ ۟۠

ఒకవేళ మీరు తీసుకువచ్చిన దాని నుండి (సత్యసందేశం నుండి) వారు మరలిపోతే మరియు మిమ్మల్ని అనుసరించకపోతే, నిశ్చయంగా దానికి కారణం వారు అవినీతిపరులు కావడమే. భూమిపై అవినీతిని వ్యాపింపజేసే వారిని అల్లాహ్ బాగా ఎరుగును. ఆయన వారికి తప్పకుండా బదులు ఇస్తాడు. info
التفاسير:

external-link copy
64 : 3

قُلْ یٰۤاَهْلَ الْكِتٰبِ تَعَالَوْا اِلٰی كَلِمَةٍ سَوَآءٍ بَیْنَنَا وَبَیْنَكُمْ اَلَّا نَعْبُدَ اِلَّا اللّٰهَ وَلَا نُشْرِكَ بِهٖ شَیْـًٔا وَّلَا یَتَّخِذَ بَعْضُنَا بَعْضًا اَرْبَابًا مِّنْ دُوْنِ اللّٰهِ ؕ— فَاِنْ تَوَلَّوْا فَقُوْلُوا اشْهَدُوْا بِاَنَّا مُسْلِمُوْنَ ۟

ఓ ప్రవక్తా! ఇలా ప్రకటించండి : “గ్రంథ ప్రజలలోని యూదులు మరియు క్రైస్తవులారా! రండి, న్యాయమైన మరియు మనందరి కొరకు సమానమైన ఒక స్వచ్ఛమైన పదంపై మనమందరం ఏకీభవిద్దాము. అదేమిటంటే, మనం కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుదాము. మరియు ఆయనతో పాటు ఎవ్వరినీ ఆరాధించకుండా ఉందాము. అలాంటి వారి స్థితి, అంతస్తు, హోదా ఎంత గొప్పగా ఉన్నా సరే; మరియు అల్లాహ్ తో పాటు లేదా అల్లాహ్ కు సాటిగా వేరొకరిని మనం ఆరాధించే మరియు అనుసరించే ప్రభువులుగా చేసుకోకుండా ఉందాము”. ఒకవేళ మీరు వారిని పిలుస్తున్న సత్యం మరియు న్యాయం నుండి మరలిపోతే, ఓ విశ్వాసులారా! వారితో ఇలా చెప్పండి - మేము అల్లాహ్ కు సమర్పించుకున్నామని మరియు ఆయనకు విధేయులుగా ఉన్నామని మీరు సాక్ష్యులుగా ఉండండి. info
التفاسير:

external-link copy
65 : 3

یٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تُحَآجُّوْنَ فِیْۤ اِبْرٰهِیْمَ وَمَاۤ اُنْزِلَتِ التَّوْرٰىةُ وَالْاِنْجِیْلُ اِلَّا مِنْ بَعْدِهٖ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟

ఓ గ్రంథ ప్రజలారా!ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క విశ్వాసం గురించి మీరు ఎందుకు వాదించు కుంటున్నారు ?. యూదులు అతను యూదుడని మరియు క్రైస్తవులు అతను క్రైస్తవుడని వాదిస్తున్నారు. యూదమతం మరియు క్రైస్తవమతం అతను గతించిన చాలా కాలం తరువాత ఆవిర్భవించాయనేది మీకు బాగా తెలుసు. మీ వాదనలోని అబద్ధం మరియు లోపం మీకు కనబడటం లేదా ?. info
التفاسير:

external-link copy
66 : 3

هٰۤاَنْتُمْ هٰۤؤُلَآءِ حَاجَجْتُمْ فِیْمَا لَكُمْ بِهٖ عِلْمٌ فَلِمَ تُحَآجُّوْنَ فِیْمَا لَیْسَ لَكُمْ بِهٖ عِلْمٌ ؕ— وَاللّٰهُ یَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟

ఓ గ్రంథ ప్రజలారా! మీ మతం గురించి మరియు మీ గ్రంథాలలోని దాని గురించి మీకు జ్ఞానం లేకుండానే మీరు ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం తో వాదించారు. మీ గ్రంథంలో లేకపోవటం వలన మరియు మీ ప్రవక్తలు దాని గురించి చర్చించక పోవటం వలన మీకు తెలియని ఇబ్రాహీమ్ అలైహిస్సలాం మరియు అతని మతం గురించి మీరు ఎందుకు వాదిస్తున్నారు? అల్లాహ్ కు వాస్తవాల గురించి బాగా తెలుసు మరియు మీకు తెలియదు. info
التفاسير:

external-link copy
67 : 3

مَا كَانَ اِبْرٰهِیْمُ یَهُوْدِیًّا وَّلَا نَصْرَانِیًّا وَّلٰكِنْ كَانَ حَنِیْفًا مُّسْلِمًا ؕ— وَمَا كَانَ مِنَ الْمُشْرِكِیْنَ ۟

ఇబ్రాహీమ్ అలైహిస్సలాం విశ్వాసంలో యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. కానీ అతను అన్ని అసత్య మతాలను వ్యతిరేకించాడు మరియు కేవలం అల్లాహ్ కు మాత్రమే విధేయుడయ్యాడు. అతను అల్లాహ్ కు భాగస్వాములను ఆపాదించే వారిలోని వాడు కాదు - అతని విశ్వాసాన్నే అనుసరిస్తున్నామని దావా చేస్తున్న అరబ్బు విగ్రహారాధకులకు భిన్నంగా. info
التفاسير:

external-link copy
68 : 3

اِنَّ اَوْلَی النَّاسِ بِاِبْرٰهِیْمَ لَلَّذِیْنَ اتَّبَعُوْهُ وَهٰذَا النَّبِیُّ وَالَّذِیْنَ اٰمَنُوْا ؕ— وَاللّٰهُ وَلِیُّ الْمُؤْمِنِیْنَ ۟

ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కాలంలో అతనిని అనుసరించిన ప్రజలు, అతనిని విశ్వసించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం మరియు ఆయన సమాజం మాత్రమే ఇబ్రాహీముతో సంబంధం ఉందని వాదించేందుకు ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నారు. అల్లాహ్ విశ్వాసులకు సహాయపడతాడు మరియు కాపాడుతాడు. info
التفاسير:

external-link copy
69 : 3

وَدَّتْ طَّآىِٕفَةٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ لَوْ یُضِلُّوْنَكُمْ ؕ— وَمَا یُضِلُّوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا یَشْعُرُوْنَ ۟

ఓ విశ్వాసులారా! యూదుల మరియు క్రైస్తవుల పండితులు మిమ్మల్ని, అల్లాహ్ నిర్దేశించిన సత్యమార్గానికి దూరంగా తప్పుదోవ పట్టించాలని కోరుకుంటారు. కానీ, వారు స్వయంగా తమకు తామే తప్పుదోవ పట్టిస్తారు. ఎందుకంటే విశ్వాసులను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న వారి ప్రయత్నం వారి మార్గభ్రష్టత్వాన్ని పెంచుతుంది మరియు వారి చర్యల పర్యవసానం గురించి వారు ఎరుగరు. info
التفاسير:

external-link copy
70 : 3

یٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَكْفُرُوْنَ بِاٰیٰتِ اللّٰهِ وَاَنْتُمْ تَشْهَدُوْنَ ۟

ఓ గ్రంథ ప్రజలలోని యూదులారా మరియు క్రైస్తవులారా! వాస్తవానికి, మీ గ్రంథాలలో ప్రస్తావించబడిన సత్యమైన వచనాలకు మీరు సాక్షులై ఉండీ, మీ కొరకు పంపబడిన మీ గ్రంథాలలోని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహినసల్లం ఆవిర్భావానికి సంబంధించిన అల్లాహ్ యొక్క స్పష్టమైన సూచనలను మీరు ఎందుకు నమ్మటం లేదు? info
التفاسير:
Das notas do versículo nesta página:
• أن الرسالات الإلهية كلها اتفقت على كلمة عدل واحدة، وهي: توحيد الله تعالى والنهي عن الشرك.
దైవ సందేశాలన్నీ ఒకే ఒక ముఖ్యాంశాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నాయి – అది అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని ప్రకటించడం మరియు అల్లాహ్ తో భాగస్వాములు కల్పించడాన్ని నిషేధించడం. info

• أهمية العلم بالتاريخ؛ لأنه قد يكون من الحجج القوية التي تُرَدُّ بها دعوى المبطلين.
చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే కొన్నిసార్లు అది తప్పుడు వాదనలు తిరస్కరించడానికి ఋజువుగా ఉపయోగించబడుతుంది. info

• أحق الناس بإبراهيم عليه السلام من كان على ملته وعقيدته، وأما مجرد دعوى الانتساب إليه مع مخالفته فلا تنفع.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క విశ్వాసాలు మరియు ధార్మిక సిద్ధాంతాలను నమ్మేవారే అతనికి చెందిన వారని ప్రకటించు కోవడానికి అత్యంత అర్హులు. కేవలం అతనికి చెందిన వారమని వాదిస్తూ, అతనికి వ్యతిరేకంగా విశ్వసించడం, ఆచరించడం వలన ఎలాంటి ఉపయోగమూ ఉండదు. info

• دَلَّتِ الآيات على حرص كفرة أهل الكتاب على إضلال المؤمنين من هذه الأمة حسدًا من عند أنفسهم.
గ్రంథప్రజలలోని అవిశ్వాసులు తమ ఈర్ష్యాసూయాల కారణంగా ఈ సమాజంలోని విశ్వాసులను తప్పుదోవ పట్టించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారని ఈ ఆయతులు సూచిస్తున్నాయి. info