Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão.

Número de página:close

external-link copy
44 : 28

وَمَا كُنْتَ بِجَانِبِ الْغَرْبِیِّ اِذْ قَضَیْنَاۤ اِلٰی مُوْسَی الْاَمْرَ وَمَا كُنْتَ مِنَ الشّٰهِدِیْنَ ۟ۙ

ఓ ప్రవక్తా మేము మూసాను ఫిర్ఔన్,అతని నాయకుల వద్దకు పంపించిన విషయమును మూసా వద్ద ముగించినప్పుడు మీరు మూసా అలైహిస్సలాం కొరకు కొండ పడమర వైపున లేరు. మరియు మీరు ప్రత్యక్షంగా ఉన్న వారిలో లేరు చివరకు మీరు ఆ సమాచారము తెలుసుకుని దాన్ని ప్రజలకు తెలియపరచారు. మీరు వారికి చెప్పినది అల్లాహ్ మీకు వహీ ద్వారా తెలియపరచాడు. info
التفاسير:

external-link copy
45 : 28

وَلٰكِنَّاۤ اَنْشَاْنَا قُرُوْنًا فَتَطَاوَلَ عَلَیْهِمُ الْعُمُرُ ۚ— وَمَا كُنْتَ ثَاوِیًا فِیْۤ اَهْلِ مَدْیَنَ تَتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِنَا ۙ— وَلٰكِنَّا كُنَّا مُرْسِلِیْنَ ۟

కాని మేము మూసా తరువాత ఎన్నో సమాజాలను,సృష్టితాలను ప్రభవింపజేశాము. వారిపై సుదీర్ఘ కాలం గడిచిపోయింది చివరకు వారు అల్లాహ్ ప్రమాణములను మరచిపోయారు. మరియు మీరు మద్యన్ వాసుల మధ్య నివాసమూ లేరు వారిపై మా ఆయతులను చదివి వినిపించటానికి. కానీ మేము మిమ్మల్ని మా వద్ద నుండి ప్రవక్తగా పంపించి,మూసా వృత్తాంతమును,మద్యన్ లో ఆయన నివాసమును మీకు వహీ ద్వారా మేము తెలియపరచాము. అప్పుడు అందులో నుండి మీకు అల్లాహ్ వహీ ద్వారా మీకు తెలియపరచిన దాన్ని మీరు ప్రజలకు తెలియపరచారు. info
التفاسير:

external-link copy
46 : 28

وَمَا كُنْتَ بِجَانِبِ الطُّوْرِ اِذْ نَادَیْنَا وَلٰكِنْ رَّحْمَةً مِّنْ رَّبِّكَ لِتُنْذِرَ قَوْمًا مَّاۤ اَتٰىهُمْ مِّنْ نَّذِیْرٍ مِّنْ قَبْلِكَ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟

మరియు మేము మూసాను పిలిచి ఆయనకు ఏదైతే మేము దివ్యవాణిని అవతరింపజేశామో అప్పుడు మీరు తూర్ వైపున లేరు. కాని మేము మిమ్మల్ని ప్రజల కొరకు నీ ప్రభువు వద్ద నుండి కారుణ్యంగా పంపించాము. మేము ఆ వృత్తాంతమును మీకు దైవ వాణి ద్వారా తెలియపరచాము మీరు మీ కన్న పూర్వం ఎటువంటి హెచ్చరించే వాడు హెచ్చరించటానికి రాని జాతి వారిని హెచ్చరించటానికి బహుశా వారు హితోపదేశం గ్రహించి,మీరు వారి వద్దకు పరిశుద్ధుడైన అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసిస్తారని. info
التفاسير:

external-link copy
47 : 28

وَلَوْلَاۤ اَنْ تُصِیْبَهُمْ مُّصِیْبَةٌ بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ فَیَقُوْلُوْا رَبَّنَا لَوْلَاۤ اَرْسَلْتَ اِلَیْنَا رَسُوْلًا فَنَتَّبِعَ اٰیٰتِكَ وَنَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟

మరియు ఒక వేళ వారు ఉన్న అవిశ్వాసము,పాప కార్యముల వలన వారిపై దైవ శిక్ష వచ్చి చేరితే వారి వద్దకు ఒక ప్రవక్త పంపించకపోవటంపై వాదిస్తూ ఇలా పలుకుతారు : నీవు ఎందుకని మా వద్దకు ఒక ప్రవక్తను పంపించలేదు అప్పుడు మేము నీ ఆయతులను అనుసరించి,వాటిని ఆచరించి,మేము విశ్వసించి వారి ప్రభువు ఆదేశముపై ఆచరించే వారిలో నుండి అయిపోయేవారము. ఒక వేళ అలా జరిగి ఉంటే మేము వారిని శీఝ్రంగా శిక్షించేవారము. కానీ మేము దాన్ని వారి నుండి ఆలస్యం చేశాము చివరికి వారి వద్దకు ఒక ప్రవక్తను పంపించి వారిని మన్నించటానికి. info
التفاسير:

external-link copy
48 : 28

فَلَمَّا جَآءَهُمُ الْحَقُّ مِنْ عِنْدِنَا قَالُوْا لَوْلَاۤ اُوْتِیَ مِثْلَ مَاۤ اُوْتِیَ مُوْسٰی ؕ— اَوَلَمْ یَكْفُرُوْا بِمَاۤ اُوْتِیَ مُوْسٰی مِنْ قَبْلُ ۚ— قَالُوْا سِحْرٰنِ تَظَاهَرَا ۫— وَقَالُوْۤا اِنَّا بِكُلٍّ كٰفِرُوْنَ ۟

ఎప్పుడైతే ఖురైష్ జాతి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం తీసుకుని వచ్చారో వారు యూదులను ఆయన గురించి అడిగారు. అప్పుడు వారు వారికి ఈ వాదనను నేర్పిస్తే వారు అన్నారు : మూసా తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని సూచించే చేయి,చేతి కర్ర లాంటి మహిమలు ఇవ్వబడినట్లు ఎందుకని ముహమ్మద్ కు ఇవ్వబడలేదు. ఓ ప్రవక్తా మీరు వారిని ఖండిస్తూ ఇలా తెలియపరచండి : ఏమీ మునుపు మూసా ఇవ్వబడిన వాటిని యూదులు తిరస్కరించలేదా ?!. మరియు వారు తౌరాత్,ఖుర్ఆన్ విషయంలో ఇలా పలికారు నిశ్ఛయంగా అవి రెండూ మంత్రజాలములు ఒక దానికొకటి మద్దతిస్తున్నవి. మరియు వారు నిశ్ఛయంగా మేము తౌరాత్,ఖుర్ఆన్ ను పూర్తిగా తిరస్కరిస్తున్నాము అని అన్నారు. info
التفاسير:

external-link copy
49 : 28

قُلْ فَاْتُوْا بِكِتٰبٍ مِّنْ عِنْدِ اللّٰهِ هُوَ اَهْدٰی مِنْهُمَاۤ اَتَّبِعْهُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

ఓ ప్రవక్తా వారందరితో ఇలా పలకండి : మీరు తౌరాత్,ఖుర్ఆన్ కన్న ఎక్కువ మార్గదర్శకం కల అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన ఏదైన గ్రంధమును తీసుకుని రండి. ఒక వేళ మీరు తీసుకుని వస్తే నేను దాన్ని అనుసరిస్తాను,ఒక వేళ మీరు తౌరాత్,ఖుర్ఆన్ మంత్రజాలము అని వాదిస్తున్న విషయంలో మీరు సత్యవంతులే అయితే. info
التفاسير:

external-link copy
50 : 28

فَاِنْ لَّمْ یَسْتَجِیْبُوْا لَكَ فَاعْلَمْ اَنَّمَا یَتَّبِعُوْنَ اَهْوَآءَهُمْ ؕ— وَمَنْ اَضَلُّ مِمَّنِ اتَّبَعَ هَوٰىهُ بِغَیْرِ هُدًی مِّنَ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟۠

ఒక వేళ ఖురైష్ మీరు తౌరాత్,ఖుర్ఆన్ కన్న ఎక్కువ మార్గ దర్శకం గల ఏదైన పుస్తకమును తీసుకుని రమ్మని మీరు వారికి ఇచ్చిన పిలుపును స్వీకరించకపోతే ఆ రెండింటి పట్ల వారి తిరస్కారము ఎటువంటి ఆధారం కాదు అని నమ్మండి. అది కేవలం మనోవాంచలను అనుసరించటం మాత్రమే. పరిశుద్ధుడైన అల్లాహ్ యొక్క ఎటువంటి మార్గ నిర్దేశకం లేకుండా తన మనోవాంచలను అనుసరించే వాడి కన్నపెద్ద మార్గభ్రష్టుడు ఎవడూ ఉండడు. నిశ్ఛంగా అల్లాహ్ ,అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసం వలన తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడే జనులకు సన్మార్గము,మార్గదర్శకత్వం కొరకు భాగ్యమును కలిగించడు. info
التفاسير:
Das notas do versículo nesta página:
• نفي علم الغيب عن رسول الله صلى الله عليه وسلم إلَّا ما أطلعه الله عليه.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు అల్లాహ్ తెలియపరచినది తప్ప ఆయనకు అగోచర విషయాల జ్ఞానము నిరాకరణ. info

• اندراس العلم بتطاول الزمن.
కాలం సుదీర్ఘం అవటం వలన జ్ఞానం తుడుచుకుపోతుంది. info

• تحدّي الكفار بالإتيان بما هو أهدى من وحي الله إلى رسله.
అల్లాహ్ తన ప్రవక్తకు ఇచ్చిన దైవ వాణి కన్న ఎక్కువ సన్మార్గం గల దాన్ని తీసుకుని రమ్మని అవిశ్వాసపరులకు చాలెంజ్. info

• ضلال الكفار بسبب اتباع الهوى، لا بسبب اتباع الدليل.
మనోవాంచలను అనుసరించటం వలన అవిశ్వాసపరుల మర్గభ్రష్టత.ఆధారమును అనుసరించటం వలన కాదు. info