വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തെലുങ്ക് വിവർത്തനം - അബ്ദുൽ റഹീം ബ്നു മുഹമ്മദ്

പേജ് നമ്പർ:close

external-link copy
43 : 16

وَمَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ اِلَّا رِجَالًا نُّوْحِیْۤ اِلَیْهِمْ فَسْـَٔلُوْۤا اَهْلَ الذِّكْرِ اِنْ كُنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟ۙ

మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం కూడా మేము పంపిన ప్రవక్తలందరూ పురుషులే (మానవులే)![1] మేము వారిపై దివ్యజ్ఞానాన్ని (వహీని) అవతరింపజేశాము. కావున ఇది మీకు తెలియకపోతే పూర్వ గ్రంథ ప్రజలను అడగండి. info

[1] ఇక్కడ విశదమయ్యేదేమిటంటే ప్రతి సమాజంలో దైవప్రవక్త ('అ.స.)లు పంపబడ్డారు. వారందరూ మానవులే. అయితే ము'హమ్మద్ ('స'అస) మానవుడైతే ఇందులో ఆశ్చర్యమేముంది. ఏ ప్రవక్తకు కూడా అగోచర జ్ఞానం లేదు. మీకు తెలియనిచో పూర్వగ్రంథ ప్రజలను అడగండి. వారి ప్రవక్తలు కూడా మానవులే. ఇంకా చూడండి, 6:50, 7:188, 11:31.

التفاسير:

external-link copy
44 : 16

بِالْبَیِّنٰتِ وَالزُّبُرِ ؕ— وَاَنْزَلْنَاۤ اِلَیْكَ الذِّكْرَ لِتُبَیِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ اِلَیْهِمْ وَلَعَلَّهُمْ یَتَفَكَّرُوْنَ ۟

(పూర్వపు ప్రవక్తలను) మేము స్పష్టమైన నిదర్శనాలతో మరియు గ్రంథాలతో (జుబూర్ లతో) పంపాము. మరియు (ఓ ప్రవక్తా!) ఇప్పుడు ఈ జ్ఞాపికను (గ్రంథాన్ని) నీపై అవతరింపజేసింది, వారి వద్దకు అవతరింపజేయబడిన దానిని వారికి నీవు స్పష్టంగా వివరించటానికి మరియు బహుశా వారు ఆలోచిస్తారేమోనని! info
التفاسير:

external-link copy
45 : 16

اَفَاَمِنَ الَّذِیْنَ مَكَرُوا السَّیِّاٰتِ اَنْ یَّخْسِفَ اللّٰهُ بِهِمُ الْاَرْضَ اَوْ یَاْتِیَهُمُ الْعَذَابُ مِنْ حَیْثُ لَا یَشْعُرُوْنَ ۟ۙ

దుష్టపన్నాగాలు చేస్తున్నవారు - అల్లాహ్ తమను భూమిలోనికి దిగి పోయినట్లు చేయకుండా, లేదా తాము ఊహించని వైపు నుండి తమపై శిక్ష అవతరింపజేయకుండా - తాము సురక్షితంగా ఉన్నారనుకొంటున్నారా ఏమిటి? info
التفاسير:

external-link copy
46 : 16

اَوْ یَاْخُذَهُمْ فِیْ تَقَلُّبِهِمْ فَمَا هُمْ بِمُعْجِزِیْنَ ۟ۙ

లేదా వారు తిరుగాడుతున్నపుడు, అకస్మాత్తుగా ఆయన వారిని పట్టుకుంటే, వారు ఆయన (పట్టు) నుండి తప్పించుకోగలరా? info
التفاسير:

external-link copy
47 : 16

اَوْ یَاْخُذَهُمْ عَلٰی تَخَوُّفٍ ؕ— فَاِنَّ رَبَّكُمْ لَرَءُوْفٌ رَّحِیْمٌ ۟

లేదా, వారిని భయకంపితులు జేసి పట్టుకోవచ్చు కదా! కాని నిశ్చయంగా, నీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత. info
التفاسير:

external-link copy
48 : 16

اَوَلَمْ یَرَوْا اِلٰی مَا خَلَقَ اللّٰهُ مِنْ شَیْءٍ یَّتَفَیَّؤُا ظِلٰلُهٗ عَنِ الْیَمِیْنِ وَالشَّمَآىِٕلِ سُجَّدًا لِّلّٰهِ وَهُمْ دٰخِرُوْنَ ۟

ఏమీ? వారు అల్లాహ్ సృష్టించిన ప్రతి వస్తువునూ గమనించటం (చూడటం) లేదా? వాటి నీడలు కుడివైపుకూ, ఎడమ వైపుకూ వంగుతూ ఉండి, అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ, ఎలా వినమ్రత చూపుతున్నాయో?[1] info

[1] చూడండి, 13:15.

التفاسير:

external-link copy
49 : 16

وَلِلّٰهِ یَسْجُدُ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ مِنْ دَآبَّةٍ وَّالْمَلٰٓىِٕكَةُ وَهُمْ لَا یَسْتَكْبِرُوْنَ ۟

మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న సమస్త ప్రాణులు మరియు దేవదూతలు అందరూ అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు. వారెన్నడూ (తమ ప్రభువు సన్నిధిలో) గర్వపడరు. info
التفاسير:

external-link copy
50 : 16

یَخَافُوْنَ رَبَّهُمْ مِّنْ فَوْقِهِمْ وَیَفْعَلُوْنَ مَا یُؤْمَرُوْنَ ۟

వారు తమపై నున్న ప్రభువునకు భయపడుతూ తమకు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకుంటారు. info
التفاسير:

external-link copy
51 : 16

وَقَالَ اللّٰهُ لَا تَتَّخِذُوْۤا اِلٰهَیْنِ اثْنَیْنِ ۚ— اِنَّمَا هُوَ اِلٰهٌ وَّاحِدٌ ۚ— فَاِیَّایَ فَارْهَبُوْنِ ۟

మరియు అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు: "(ఓ మానవులారా!) ఇద్దరినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోకండి. నిశ్చయంగా ఆరాధ్య దైవం ఆయన (అల్లాహ్) ఒక్కడే! కావున నాకే భీతిపరులై ఉండండి."[1] info

[1] ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. అలా ఉంటే విశ్వవ్యవస్థ ఈ విధంగా శాంతియుతంగా నడిచేది కాదు. అప్పుడు విశ్వంలో అల్లకల్లోలం రేకెత్తి ఉండేది. చూడండి, 21:22.

التفاسير:

external-link copy
52 : 16

وَلَهٗ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ وَلَهُ الدِّیْنُ وَاصِبًا ؕ— اَفَغَیْرَ اللّٰهِ تَتَّقُوْنَ ۟

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయకు చెందినదే! మరియు నిరంతర విధేయతకు కేవలం ఆయనే అర్హుడు.[1] ఏమీ? మీరు అల్లాహ్ ను కాదని ఇతరులకు భయభక్తులు చూపుతారా? info

[1] చూడండి, 39:2-3.

التفاسير:

external-link copy
53 : 16

وَمَا بِكُمْ مِّنْ نِّعْمَةٍ فَمِنَ اللّٰهِ ثُمَّ اِذَا مَسَّكُمُ الضُّرُّ فَاِلَیْهِ تَجْـَٔرُوْنَ ۟ۚ

మరియు మీకు లభించిన అనుగ్రహాలన్నీ కేవలం అల్లాహ్ నుండి వచ్చినవే. అంతేగాక మీకు ఆపదలు వచ్చినపుడు కూడా మీరు సహాయం కొరకు ఆయననే మొరపెట్టుకుంటారు కదా![1] info

[1] అలాంటప్పుడు మీరు ఇతరులను అల్లాహ్ (సు.తా.)కు సాటిగా నిలబెట్టి, వారిని ఎందుకు ఆరాధిస్తున్నారు? చూడండి, 6:40-44.

التفاسير:

external-link copy
54 : 16

ثُمَّ اِذَا كَشَفَ الضُّرَّ عَنْكُمْ اِذَا فَرِیْقٌ مِّنْكُمْ بِرَبِّهِمْ یُشْرِكُوْنَ ۟ۙ

తరువాత ఆయన మీ ఆపదలు తొలగించినపుడు; మీలో కొందరు మీ ప్రభువుకు సాటి (షరీక్ లను) కల్పించ సాగుతారు - info
التفاسير: