വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തെലുങ്ക് വിവർത്തനം - അബ്ദുൽ റഹീം ബ്നു മുഹമ്മദ്

പേജ് നമ്പർ:close

external-link copy
35 : 16

وَقَالَ الَّذِیْنَ اَشْرَكُوْا لَوْ شَآءَ اللّٰهُ مَا عَبَدْنَا مِنْ دُوْنِهٖ مِنْ شَیْءٍ نَّحْنُ وَلَاۤ اٰبَآؤُنَا وَلَا حَرَّمْنَا مِنْ دُوْنِهٖ مِنْ شَیْءٍ ؕ— كَذٰلِكَ فَعَلَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ۚ— فَهَلْ عَلَی الرُّسُلِ اِلَّا الْبَلٰغُ الْمُبِیْنُ ۟

మరియు (అల్లాహ్ కు) సాటి కల్పించే వారు అంటారు: "ఒకవేళ అల్లాహ్ కోరి ఉంటే! మేము గానీ మా తండ్రితాతలు గానీ, ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించేవారం కాదు. మరియు ఆయన ఆజ్ఞ లేనిదే మేము దేన్ని కూడా నిషేధించేవారం కాదు."[1] వారికి పూర్వం వారు కూడా ఇలాగే చేశారు. అయితే ప్రవక్తల బాధ్యత (అల్లాహ్) సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప ఇంకేమిటి? info

[1] చూడండి, 6:148 మరియు 6:136-153.

التفاسير:

external-link copy
36 : 16

وَلَقَدْ بَعَثْنَا فِیْ كُلِّ اُمَّةٍ رَّسُوْلًا اَنِ اعْبُدُوا اللّٰهَ وَاجْتَنِبُوا الطَّاغُوْتَ ۚ— فَمِنْهُمْ مَّنْ هَدَی اللّٰهُ وَمِنْهُمْ مَّنْ حَقَّتْ عَلَیْهِ الضَّلٰلَةُ ؕ— فَسِیْرُوْا فِی الْاَرْضِ فَانْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِیْنَ ۟

మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి." వారిలో కొందరికి అల్లాహ్ సన్మార్గం చూపాడు. మరికొందరి కొరకు మార్గభ్రష్టత్వం నిశ్చితమై పోయింది. కావున మీరు భూమిలో సంచారం చేసి చూడండి, ఆ సత్యతిరస్కారుల గతి ఏమయిందో! info
التفاسير:

external-link copy
37 : 16

اِنْ تَحْرِصْ عَلٰی هُدٰىهُمْ فَاِنَّ اللّٰهَ لَا یَهْدِیْ مَنْ یُّضِلُّ وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِیْنَ ۟

ఇక (ఓ ముహమ్మద్!) నీవు వారిని సన్మార్గానికి తేవాలని ఎంత కోరుకున్నా! నిశ్చయంగా, అల్లాహ్ మార్గభ్రష్టతకు గురి చేసిన వానికి సన్మార్గం చూపడు[1]. వారికి సహాయపడే వారు ఎవ్వరూ ఉండరు. info

[1] చూడండి, 8:55.

التفاسير:

external-link copy
38 : 16

وَاَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَیْمَانِهِمْ ۙ— لَا یَبْعَثُ اللّٰهُ مَنْ یَّمُوْتُ ؕ— بَلٰی وَعْدًا عَلَیْهِ حَقًّا وَّلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟ۙ

మరియు వారు అల్లాహ్ పేరుతో దృఢమైన శపథం చేసి ఇలా అంటారు: "మరణించిన వానిని అల్లాహ్ తిరిగి బ్రతికించి లేపడు!" ఎందుకు లేపడు! ఆయన చేసిన వాగ్దానం సత్యం! అయినా చాలా మంది ప్రజలకు ఇది తెలియదు (కాని అది జరిగి తీరుతుంది); info
التفاسير:

external-link copy
39 : 16

لِیُبَیِّنَ لَهُمُ الَّذِیْ یَخْتَلِفُوْنَ فِیْهِ وَلِیَعْلَمَ الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّهُمْ كَانُوْا كٰذِبِیْنَ ۟

వారు వాదిస్తూ ఉండిన దానిని గురించి వారికి తెలుపటానికి మరియు సత్యతిరస్కారులు తాము నిశ్చయంగా, అబద్ధమాడుతున్నారని తెలుసుకోవటానికి. info
التفاسير:

external-link copy
40 : 16

اِنَّمَا قَوْلُنَا لِشَیْءٍ اِذَاۤ اَرَدْنٰهُ اَنْ نَّقُوْلَ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟۠

నిశ్చయంగా, మేము ఏదైనా వస్తువును ఉనికిలోనికి తీసుకురాదలచి నపుడు దానిని మేము: "అయిపో!" అని ఆజ్ఞాపిస్తాము. అంతే! అది అయిపోతుంది.[1] info

[1] ఈ విధమైన వాక్యం 'కున్ ఫ యకూన్' ఖుర్ఆన్ లో 8 సార్లు వచ్చింది. చూడండి, 2:117 వ్యాఖ్యానం 4. పునరుత్థానదినం కొరకు చూడండి, 16:77.

التفاسير:

external-link copy
41 : 16

وَالَّذِیْنَ هَاجَرُوْا فِی اللّٰهِ مِنْ بَعْدِ مَا ظُلِمُوْا لَنُبَوِّئَنَّهُمْ فِی الدُّنْیَا حَسَنَةً ؕ— وَلَاَجْرُ الْاٰخِرَةِ اَكْبَرُ ۘ— لَوْ كَانُوْا یَعْلَمُوْنَ ۟ۙ

మరియు దౌర్జన్యాన్ని సహించిన తరువాత, ఎవరైతే అల్లాహ్ కొరకు వలస పోతారో;[1] అలాంటి వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి స్థానాన్ని నొసంగుతాము. మరియు వారి పరలోక ప్రతిఫలం దాని కంటే గొప్పగా ఉంటుంది. ఇది వారు తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది! info

[1] హిజ్రతున్: Migration, Exodus, వలసపోవటం, ప్రస్థానం, అంటే అల్లాహ్ ధర్మం కొరకు, అల్లాహ్ ప్రీతి కొరకు, తన దేశాన్ని బంధు స్నేహితులను విడిచి - అల్లాహ్ ధర్మం మీద ఉండటానికి ఆటంకాలు లేని - ఇతర దేశాలకు వెళ్ళిపోవటం. ఈ ఆయత్ లో ఇలాంటి ముహాజిర్ ల ప్రస్తావన వచ్చింది. బహుశా ఈ ఆయత్ ఆ ముహాజిర్ లను గరించి అవతరింపజేయబడి ఉండవచ్చు, ఎవరైతే మక్కా ముష్రికుల బాధలను సహించలేక 'హబషా (అబిసీనియా) కు వలస పోయారో! వారిలో 'ఉస్మాన్ (ర' ది. 'అ.) మరియు అతని భార్య దైవప్రవక్త ('స'అస) కూతురు, రుఖయ్య (ర.'అన్హా) కూడా - ఇతర దాదాపు నూరుమంది వలసపోయిన వారితో సహా - ఉన్నారు.

التفاسير:

external-link copy
42 : 16

الَّذِیْنَ صَبَرُوْا وَعَلٰی رَبِّهِمْ یَتَوَكَّلُوْنَ ۟

అలాంటి వారే సహనం వహించిన వారు మరియు తమ ప్రభువును నమ్ముకున్నవారు. info
التفاسير: