Kilniojo Korano reikšmių vertimas - Vertimas į telugų k. - Abdur-Rahim Bin Muchamed

అల్-ఖలమ్

external-link copy
1 : 68

نٓ وَالْقَلَمِ وَمَا یَسْطُرُوْنَ ۟ۙ

నూన్[1][2], కలం సాక్షిగా! మరియు వారు (దేవదూతలు) వ్రాస్తున్న దాని సాక్షిగా[3]! info

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
[2] ఖుర్ఆన్ అవతరణలో, అవతరించిన మొదటి బీజ అక్షరం ఇది 'నూన్,'. ఈ అక్షరం ముఖ'త్త'ఆత్ లోనిది.
[3] అల్-ఖలమ్: చూడండి, 96:3-5. కొందరు: ఇక్కడ ప్రమాణం చేసే కలం, అంటే ఆ మొట్టమొదట సృష్టించబడి, 'విధివ్రాత' వ్రాయమని ఆజ్ఞాపించబడిన కలము, అని చెబుతారు, సునన్ తిర్మి'జీ - అల్బానీ ప్రమాణీకం (త'స్హీ'హ్).

التفاسير:

external-link copy
2 : 68

مَاۤ اَنْتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُوْنٍ ۟ۚ

నీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ముహమ్మద్) పిచ్చివాడవు కావు! info
التفاسير:

external-link copy
3 : 68

وَاِنَّ لَكَ لَاَجْرًا غَیْرَ مَمْنُوْنٍ ۟ۚ

మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది. info
التفاسير:

external-link copy
4 : 68

وَاِنَّكَ لَعَلٰی خُلُقٍ عَظِیْمٍ ۟

మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు[1]! info

[1] అంటే అల్లాహ్ (సు.తా.) నీకు ఆదేశించిన మార్గం (ఇస్లాం)లో నీవు ఉన్నావు. దీని మరొక భావం నీవు మొదటి నుండియే ఉత్తమమైన గుణగణాలు గలవాడవు, సత్యసంధుడవు. 'ఆయి'షహ్ (ర.'అన్హా)తో దైవప్రవక్త ('స'అస) యొక్క గుణగణాలు మరియు ప్రవర్తనను గురించి ప్రశ్నించగా ఆమె (ర.'అన్హా) అన్నారు: " 'ఖులుఖుహూ ఖుర్ఆన్" అంటే అతని గుణగణాలు ఖుర్ఆన్ కు ప్రతిరూపాలు, ('స.ముస్లిం).

التفاسير:

external-link copy
5 : 68

فَسَتُبْصِرُ وَیُبْصِرُوْنَ ۟ۙ

కావున త్వరలోనే నీవు చూడగలవు మరియు వారు కూడా చూడగలరు; info
التفاسير:

external-link copy
6 : 68

بِاَیِّىكُمُ الْمَفْتُوْنُ ۟

మీలో ఎవరికి పిచ్చి ఉందో! info
التفاسير:

external-link copy
7 : 68

اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِیْلِهٖ ۪— وَهُوَ اَعْلَمُ بِالْمُهْتَدِیْنَ ۟

నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు మార్గభ్రష్టుడయ్యాడో తెలుసు మరియు ఎవడు సన్మార్గం మీద ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు! info
التفاسير:

external-link copy
8 : 68

فَلَا تُطِعِ الْمُكَذِّبِیْنَ ۟

కావున నీవు ఈ అసత్యవాదులను అనుసరించకు. info
التفاسير:

external-link copy
9 : 68

وَدُّوْا لَوْ تُدْهِنُ فَیُدْهِنُوْنَ ۟

ఒకవేళ నీవు (ధర్మం విషయంలో) మెత్తపడితే వారు కూడా మెత్తపడ గోరుతున్నారు.[1] info

[1] అంటే నీవు ('స'అస) ధర్మ విషయంలో కొన్ని సవరణలు చేయటానికి ఒప్పుకుంటే, వారు నీతో రాజీపడటానికి సిద్ధంగా ఉన్నారు.

التفاسير:

external-link copy
10 : 68

وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِیْنٍ ۟ۙ

కావున నీవు ప్రమాణాలు చేసే ప్రతి నీచుడిని అనుసరించకు; info
التفاسير:

external-link copy
11 : 68

هَمَّازٍ مَّشَّآءٍ بِنَمِیْمٍ ۟ۙ

చాడీలు చెప్పేవాడిని, ఎత్తి పొడుస్తూ ఉండేవాడిని; info
التفاسير:

external-link copy
12 : 68

مَّنَّاعٍ لِّلْخَیْرِ مُعْتَدٍ اَثِیْمٍ ۟ۙ

మంచిని నిరోధించేవాడిని, హద్దు మీరి ప్రవర్తించే పాపిష్ఠుడిని; info
التفاسير:

external-link copy
13 : 68

عُتُلٍّۢ بَعْدَ ذٰلِكَ زَنِیْمٍ ۟ۙ

నిర్ధయుడిని, ఇంతే గాకుండా అపఖ్యాతి గల (నిందార్హుడైన) వాడిని; info
التفاسير:

external-link copy
14 : 68

اَنْ كَانَ ذَا مَالٍ وَّبَنِیْنَ ۟ؕ

వాడు ధనవంతుడూ మరియు సంతాన భాగ్యంతో తలతూగుతూ ఉన్నవాడు అయినా సరే! info
التفاسير:

external-link copy
15 : 68

اِذَا تُتْلٰی عَلَیْهِ اٰیٰتُنَا قَالَ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ ۟

ఒకవేళ వాడికి మా సూచనలు (ఆయాత్) వినిపిస్తే, అందుకు వాడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు. info
التفاسير:

external-link copy
16 : 68

سَنَسِمُهٗ عَلَی الْخُرْطُوْمِ ۟

మేము త్వరలోనే వాడి ముక్కు మీద వాత పెడ్తాము. info
التفاسير: