Kilniojo Korano reikšmių vertimas - Kilniojo Korano sutrumpinto aiškinimo vertimas į telugų k.

Puslapio numeris:close

external-link copy
104 : 5

وَاِذَا قِیْلَ لَهُمْ تَعَالَوْا اِلٰی مَاۤ اَنْزَلَ اللّٰهُ وَاِلَی الرَّسُوْلِ قَالُوْا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَیْهِ اٰبَآءَنَا ؕ— اَوَلَوْ كَانَ اٰبَآؤُهُمْ لَا یَعْلَمُوْنَ شَیْـًٔا وَّلَا یَهْتَدُوْنَ ۟

జంతువుల్లోంచి కొన్ని జంతువులను నిషేధించుకోవటం వలన అల్లాహ్ పై అబద్దమును అంటగట్టిన వీరందరితో మీరు హలాల్,హరాంను తెలుసుకోవటం కొరకు అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్,ప్రవక్తగారి సున్నత్ వైపునకు తరలి రండి అని అన్నప్పుడు వారు మన పూర్వికులనుండి వారసత్వంగా పొందినవి,విశ్వాసాలు,మాటలు,కార్యాలు మనకు చాలు అని సమాధానమిచ్చారు.అవి వారికి ఎలా తగును.వాస్తవానికి వారి పూర్వికులందరికి ఏమి తెలియదు.వారికి సత్యమేదో తెలియదు.వారిని వారిలోంచి అందరికంటే ఎక్కువ అజ్ఞానులు,మార్గభ్రష్టులు మాత్రమే అనుసరిస్తారు.అయితే వారందరు అజ్ఞానులు,సన్మార్గము నుండి తప్పినవారు. info
التفاسير:

external-link copy
105 : 5

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا عَلَیْكُمْ اَنْفُسَكُمْ ۚ— لَا یَضُرُّكُمْ مَّنْ ضَلَّ اِذَا اهْتَدَیْتُمْ ؕ— اِلَی اللّٰهِ مَرْجِعُكُمْ جَمِیْعًا فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟

ఓ విశ్వాసపరులారా మీరు మీ మనస్సులను అట్టిపెట్టుకుని ఉండండి (జాగ్రత్తగా ఉండండి).వాటిని సరిదిద్దే వాటిని పాటించటం ద్వారా వాటిని అట్టిపెట్టుకుని ఉండండి.మీరు సన్మార్గం పై ఉన్నంత వరకు ప్రజల్లోంచి మార్గభ్రష్టులు మిమ్మల్ని హాని తలపెట్టలేరు.వారు మీ మాట వినరు.మీరు మంచి గురించి ఆదేశించటం చెడు నుండి వారించటం కూడా మీరు సన్మార్గం పై ఉండటంలో నుంచే.ప్రళయదినాన మీరు మరలవలసింది ఒక్కడైన అల్లాహ్ వైపునకే.ఆయన మీరు ఇహలోకంలో చేసిన కార్యాల గురించి మీకు తెలియ పరుస్తాడు,వాటి పరంగానే ఆయన మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. info
التفاسير:

external-link copy
106 : 5

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا شَهَادَةُ بَیْنِكُمْ اِذَا حَضَرَ اَحَدَكُمُ الْمَوْتُ حِیْنَ الْوَصِیَّةِ اثْنٰنِ ذَوَا عَدْلٍ مِّنْكُمْ اَوْ اٰخَرٰنِ مِنْ غَیْرِكُمْ اِنْ اَنْتُمْ ضَرَبْتُمْ فِی الْاَرْضِ فَاَصَابَتْكُمْ مُّصِیْبَةُ الْمَوْتِ ؕ— تَحْبِسُوْنَهُمَا مِنْ بَعْدِ الصَّلٰوةِ فَیُقْسِمٰنِ بِاللّٰهِ اِنِ ارْتَبْتُمْ لَا نَشْتَرِیْ بِهٖ ثَمَنًا وَّلَوْ كَانَ ذَا قُرْبٰی ۙ— وَلَا نَكْتُمُ شَهَادَةَ ۙ— اللّٰهِ اِنَّاۤ اِذًا لَّمِنَ الْاٰثِمِیْنَ ۟

ఓ విశ్వాసపరులారా మరణ సూచనల్లోంచి ఏదైన సూచన బహిర్గతమై మీలో నుంచి ఎవరికైన మరణం ఆసన్నమైనప్పుడు తన వీలునామా వ్రాసేటప్పుడు ముస్లిముల్లోంచి న్యాయశీలులైన ఇద్దరిని సాక్షులగా నియమించుకోవాలి.లేదా ఒక వేళ మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు మరణం ఆసన్నమైతే సాక్షులుగా ముస్లిములు లేని పక్షంలో ఇద్దరు అవిశ్వాసపరులను సాక్షులుగా నియమించుకోవచ్చు.ఒక వేళ వారిద్దరి సాక్షంలో సందేహం కలిగితే వారిద్దరిని మీరు నమాజుల్లోంచి ఏదైన ఒక నమాజు తరువాత నిలబెట్టండి.వారిద్దరు దేనికీ బదులుగా అల్లాహ్ వద్ద ఉన్న తమ వాటాను అమ్ముకోము అని,దానికి బదులుగా ఏ దగ్గరి బందువును ఇష్టపడమని,తమ వద్ద ఉన్న అల్లాహ్ సాక్షాలను వేటినీ దాచి పెట్టమని వారిద్దరు అల్లాహ్ పై ప్రమాణం చేయాలి.ఒక వేళ వారిద్దరు ఇలా చేస్తే వారు అల్లాహ్ కొరకు పాపమును చేసిన వారు,అవిధేయతకు పాల్పడిన వారవుతారు. info
التفاسير:

external-link copy
107 : 5

فَاِنْ عُثِرَ عَلٰۤی اَنَّهُمَا اسْتَحَقَّاۤ اِثْمًا فَاٰخَرٰنِ یَقُوْمٰنِ مَقَامَهُمَا مِنَ الَّذِیْنَ اسْتَحَقَّ عَلَیْهِمُ الْاَوْلَیٰنِ فَیُقْسِمٰنِ بِاللّٰهِ لَشَهَادَتُنَاۤ اَحَقُّ مِنْ شَهَادَتِهِمَا وَمَا اعْتَدَیْنَاۤ ۖؗ— اِنَّاۤ اِذًا لَّمِنَ الظّٰلِمِیْنَ ۟

ఒక వేళ ప్రమాణం చేసిన తరువాత సాక్షంలో లేదా ప్రమాణంలో వారిద్దరి అసత్యం బట్టబయలైతే లేదా వారిద్దరి అవినీతి బహిర్గతమైతే మృతునికి దగ్గరి వారు ఇద్దరు వారిద్దరి స్థానంలో నిలబడి సత్యమేదో తెలిపి ప్రమాణం చేస్తూ సాక్షమివ్వాలి.వారిరువురు మా సాక్షము వారిద్దరి నీతి,నిజాయితి విషయంలో వారి సాక్షముకన్న వారి అసత్యము,అవినీతి విషయంలో ఎక్కువ హక్కు కలదని అల్లాహ్ పై ప్రమాణం చేయాలి.మరియు మేము అసత్యపు ప్రమాణం చేయలేదు.ఒకవేళ మేము అబద్దపు సాక్షం పలికితే మేము దుర్మార్గుల్లోంచి,అల్లాహ్ హద్దులను అతిక్రమించే వారిలో నుంచి అవుతాము. info
التفاسير:

external-link copy
108 : 5

ذٰلِكَ اَدْنٰۤی اَنْ یَّاْتُوْا بِالشَّهَادَةِ عَلٰی وَجْهِهَاۤ اَوْ یَخَافُوْۤا اَنْ تُرَدَّ اَیْمَانٌ بَعْدَ اَیْمَانِهِمْ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاسْمَعُوْا ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْفٰسِقِیْنَ ۟۠

ఈ తెలియజేయబడిన ఆదేశము వారిరువురి సాక్షం విషయంలో సందేహం కలిగినప్పుడు నమాజు తరువాత ఇద్దరి సాక్షుల ప్రమాణంను తీసుకోవటం నుండి,వారిరువురి సాక్షమును రద్దుపరచడం నుండి సాక్షులిరువురు తమ తమ సాక్షమును ధర్మబద్దంగా ప్రవేశ పెట్టటానికి ఎంతో దోహదపడుతుంది.అయితే వారిరువురు సాక్షమును తారుమారు చేయరు,అవినీతికి పాల్పడరు.మరియు తాము ప్రమాణం చేసిన తరువాత వారసులు తమ సాక్షాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేసి తమ ప్రమాణాలను రద్దు పరిస్తే తలదించుకోవలసి వస్తుందని వారిరువురు భయపడటానికి ఎంతో దోహద పడుతుంది.సాక్షం విషయంలో,ప్రమాణం చేసే విషయంలో,అబద్దమును,అవినీతిని విడనాడటం ద్వారా అల్లాహ్ కు భయపడండి.మీకు ఆదేశించబడిన వాటిని స్వీకరించే ఉద్దేశంతో మీరు వినండి.అల్లాహ్ తన విధేయత నుండి దూరం అయ్యేవారిని సన్మార్గమును పొందే సౌభాగ్యమును కలిగించడు. info
التفاسير:
Šiame puslapyje pateiktų ajų nauda:
• إذا ألزم العبد نفسه بطاعة الله، وأمر بالمعروف ونهى عن المنكر بحسب طاقته، فلا يضره بعد ذلك ضلال أحد، ولن يُسْأل عن غيره من الناس، وخاصة أهل الضلال منهم.
దాసుడు తన శక్తి మేరకు అల్లాహ్ పై విధేయత చూపటంను,మంచిని గురించి ఆదేశించటంను,చెడు నుండి వారించటంను తన పై తప్పనిసరి చేసుకున్నప్పుడు ఎవరి మార్గభ్రష్టత కూడా దాని తరువాత అతనిని నష్టం కలిగించలేదు.మరియు ప్రజల్లోంచి ఇతరుల గురించి,వారిలోంచి ప్రత్యేకించి మార్గభ్రష్టుల గురించి అతనిని ప్రశ్నించటం జరగదు. info

• الترغيب في كتابة الوصية، مع صيانتها بإشهاد العدول عليها.
వీలునామాను వ్రాసే విషయంలో దానికి తోడుగా న్యాయపూరితంగా సాక్షాలను ఏర్పరచి దానిని కాపాడటంలో ప్రోత్సహించడం జరిగింది. info

• بيان الصورة الشرعية لسؤال الشهود عن الوصية.
వీలునామా గురించి సాక్షులను అడగే చట్టబద్దమైన రూపమును ప్రకటించబడింది. info