[1] నీటి జంతువు మరణించినది కూడా 'హలాలే. చూడండి, ఇబ్నె-కసీ'ర్.
[1] క'అబహ్ ('హరమ్) సరిహద్దులలో - ఇ'హ్రాంలో ఉన్నా, లేకున్నా - వేటాడటం, జంతువులను చంపటం, చెట్లను నరుకటం నిషేధింపబడ్డాయి. చూడండి, 2:125.
[1] 'ఖబీస్': అంటే, అధర్మ, అపవిత్ర, చెడ్డ, నికృష్ట, అపరిశుద్ధ వస్తువులు, చేష్టలు, మాటలు, విషయాలు మొదలైనవి. 'తయ్యిబ్: అంటే ధర్మ, మంచి, పవిత్ర, ఉత్కృష్ట, శ్రేష్ట, పరిశుద్ధ వస్తువులు, చేష్టలు, మాటలు విషయాలు మొదలైనవి.
[1] అబూ హురైరా (ర'ది.'అ.) కథనం: దైవప్రవక్త ('స'అస) తమ ప్రవచనంలో ఇలా అన్నారు:" 'హజ్ మీ కొరకు విధిగా నియమించబడింది." అపుడు ఒకతను (ర'ది.'అ) ప్రశ్నించాడు: "ప్రతి సంవత్సరామా?" దైవప్రవక్త ('స'అస) మౌనం వహించారు. ఆ వ్యక్తి మరీ రెండు సార్లు అదే ప్రశ్న అడిగాడు. దానికతను: "నేను అవును అంటే అది మీకు విధి అయ్యేది మరియు అది మీకు చేతనయ్యేది కాదు." ('స. ముస్లిం కితాబుల్ 'హజ్ 'హదీస్' నం. 412, దీనినే అ'హ్మద్, అబూ-దావూద్, నసాయీ' మరియు ఇబ్నె మాజా ఉల్లేఖించారు). కావున ఖుర్ఆన్ లో ఉన్న ఆజ్ఞలను, ఉన్నవి ఉన్నట్లే పాటించాలి. ఏ విషయమైతే దానిలో పేర్కొనబడలేదో వాటిని గురించి మౌనం వహించటమే మేలు.
[1] ఇవి ముష్రిక్ ఖురైషులు తమ ఆడ ఒంటెలకు ఇచ్చిన పేర్లు. వాటిని వారు తమ దేవతలకు అర్పితం చేసి, వాటిని పనులకు, సవారీలకు ఉపయోగించకుండా, విచ్ఛలవిడిగా మేస్తూ తిరుగటానికి వదిలేవారు. ఇంకా చూడండి, 6:138-139, 143-144.