وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی تلگۆیی بۆ پوختەی تەفسیری قورئانی پیرۆز

ژمارەی پەڕە: 338:332 close

external-link copy
56 : 22

اَلْمُلْكُ یَوْمَىِٕذٍ لِّلّٰهِ ؕ— یَحْكُمُ بَیْنَهُمْ ؕ— فَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فِیْ جَنّٰتِ النَّعِیْمِ ۟

ఏ రోజైతే శిక్ష గురించి వాగ్దానం చేయబడ్డ వీరందరు వస్తారో ప్రళయ దినం రోజు అధికారము అల్లాహ్ ఒక్కడి కొరకే. అందులో ఆయనతో తగాదాపడేవాడు ఎవడూ ఉండడు. పరిశుధ్ధుడైన ఆయన విశ్వాసపరులకీ,అవిశ్వాసపరులకి మధ్య తీర్పునిస్తాడు. అప్పుడు ఆయన వారిలో నుండి ప్రతి ఒక్కరి కొరకు వారు దేనికి హక్కుదారులో దాని తీర్పునిస్తాడు. అయితే ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యాలు చేశారో వారి కొరకు గొప్ప పుణ్యము కలదు. అది అంతముకాని శాస్వతమైన అనుగ్రహాలు కల స్వర్గ వనాలు. info
التفاسير:

external-link copy
57 : 22

وَالَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰیٰتِنَا فَاُولٰٓىِٕكَ لَهُمْ عَذَابٌ مُّهِیْنٌ ۟۠

మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,మా ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరిస్తారో వారి కొరకు పరాభవమునకు గురి చేసే శిక్ష కలదు. అల్లాహ్ దాని ద్వారా వారిని నరకములో అవమానమునకు గురి చేస్తాడు. info
التفاسير:

external-link copy
58 : 22

وَالَّذِیْنَ هَاجَرُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ ثُمَّ قُتِلُوْۤا اَوْ مَاتُوْا لَیَرْزُقَنَّهُمُ اللّٰهُ رِزْقًا حَسَنًا ؕ— وَاِنَّ اللّٰهَ لَهُوَ خَیْرُ الرّٰزِقِیْنَ ۟

మరియు ఎవరైతే అల్లాహ్ మన్నతను ఆశిస్తూ,ఆయన ధర్మమునకు ఆధిక్యతను కలిగించటానికి తమ ఇండ్లను,తమ భూములను వదిలి వేశారో, ఆ తరువాత ఆయన మార్గములో యుధ్ధములో అమరగతి పొందబడ్డారో లేదా మరణించారో వారికి అల్లాహ్ తప్పకుండా స్వర్గములో అంతము కాని శాస్వతమైన మంచి ఆహారమును ప్రసాదిస్తాడు. మరియు నిశ్ఛయంగా పరిశుధ్ధుడైన అల్లాహ్ ఆయనే మంచి ఆహారమును ప్రసాదించే వాడు. info
التفاسير:

external-link copy
59 : 22

لَیُدْخِلَنَّهُمْ مُّدْخَلًا یَّرْضَوْنَهٗ ؕ— وَاِنَّ اللّٰهَ لَعَلِیْمٌ حَلِیْمٌ ۟

అల్లాహ్ వారిని తప్పకుండా వారు సంతుష్టపడే ప్రదేశము అయిన స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ వారి కార్యాలను,వారి సంకల్పాలను బాగా తెలిసినవాడు. సహనశీలుడు అందుకనే వారు చేసిన దానికి వారిని శిక్షించటంలో తొందరచేయడు. info
التفاسير:

external-link copy
60 : 22

ذٰلِكَ ۚ— وَمَنْ عَاقَبَ بِمِثْلِ مَا عُوْقِبَ بِهٖ ثُمَّ بُغِیَ عَلَیْهِ لَیَنْصُرَنَّهُ اللّٰهُ ؕ— اِنَّ اللّٰهَ لَعَفُوٌّ غَفُوْرٌ ۟

ఈ ప్రస్తావించబడినది అల్లాహ్ మార్గములో హిజ్రత్ చేసిన వారిని స్వర్గంలో ప్రవేశింపజేయటం, బాధించిన వాడితో అతడు బాధించినంత ప్రతీకారం తీసుకునే అనుమతి ఆ విషయంలో అతనిపై ఎటువంటి పాపం లేదు. ఒక వేళ బాధించేవాడు తన బాధ పెట్టటంను మరల చేస్తే నిశ్ఛయంగా అల్లాహ్ బాధింపబడిన వాడికి సహాయం చేస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ విశ్వాసపరుల పాపములను మన్నించేవాడును,వారిని క్షమించేవాడును. info
التفاسير:

external-link copy
61 : 22

ذٰلِكَ بِاَنَّ اللّٰهَ یُوْلِجُ الَّیْلَ فِی النَّهَارِ وَیُوْلِجُ النَّهَارَ فِی الَّیْلِ وَاَنَّ اللّٰهَ سَمِیْعٌ بَصِیْرٌ ۟

బాధితునికి ఆ సహాయముంటుంది ఎందుకంటే అల్లాహ్ తాను కోరిన దానిపై సామర్ధ్యం కలవాడు. రాత్రిని పగలులో మరియు పగలును రాత్రిలో ఒక దానిని ఇంకొక దానిపై అధికం చేయటం ద్వారా ప్రవేశింపజేయటం ఆయన సామర్ధ్యంలో నుంచే. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల మాటలను వినేవాడును,వారి కర్యాల గురించి బాగా తెలిసిన వాడును. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. తొందరలోనే ఆయన వారికి వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. info
التفاسير:

external-link copy
62 : 22

ذٰلِكَ بِاَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ وَاَنَّ مَا یَدْعُوْنَ مِنْ دُوْنِهٖ هُوَ الْبَاطِلُ وَاَنَّ اللّٰهَ هُوَ الْعَلِیُّ الْكَبِیْرُ ۟

ఈ ప్రస్తావించబడిన అల్లాహ్ రాత్రిని పగలులో,పగలును రాత్రిలో ప్రవేశింపజేయటం అన్నది ఎందుకంటే అల్లాహ్ ఆయనే సత్యము,ఆయన ధర్మము సత్యము, ఆయన వాగ్దానము సత్యము,విశ్వాసపరులకు ఆయన సహాయము సత్యము. మరియు ముష్రికులు అల్లాహ్ ను వదిలి వేటినైతే పూజిస్తున్నారో ఆ విగ్రహాలు ఎటువంటి పునాది లేని అసత్యము. మరియు అల్లాహ్ తన సృష్టితాలపై ఉనికిని బట్టి,స్థానమును బట్టి,ఆధిక్యతను బట్టి ఆయనే ఉన్నతుడు. తన కొరకు పెద్దరికము,గొప్పతనము,మహత్యము కల గొప్పవాడు. info
التفاسير:

external-link copy
63 : 22

اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً ؗ— فَتُصْبِحُ الْاَرْضُ مُخْضَرَّةً ؕ— اِنَّ اللّٰهَ لَطِیْفٌ خَبِیْرٌ ۟ۚ

ఓ ప్రవక్తా మీరు చూడలేదా అల్లాహ్ ఆకాశము నుండి వర్షాన్ని కురిపించాడు. అప్పుడు భూమి దానిపై వర్షం కురిసిన తరువాత అది తనపై మొక్కలను మొలకెత్తించటం ద్వారా పచ్చగా అయిపోయింది. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల పట్ల సూక్ష్మగ్రాహి అప్పుడే ఆయన వారి కొరకు వర్షమును కురిపించాడు. మరియు భూమి వారి కొరకు మొలకెత్తింది. వారి ప్రయోజనాల గురించి తెలిసినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. info
التفاسير:

external-link copy
64 : 22

لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَاِنَّ اللّٰهَ لَهُوَ الْغَنِیُّ الْحَمِیْدُ ۟۠

ఆకాశముల్లో ఉన్నసమస్తము యొక్క అధికారము,భూమిలో ఉన్న సమస్తము యొక్క అధికారము ఆయన ఒక్కడి కొరకే. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ ఆయనే తన సృష్టితాల్లోంచి ఏ సృష్టి అవసరం లేని స్వయం సమృద్ధుడు,అన్ని పరిస్థితుల్లో ప్రశంసనీయుడు. info
التفاسير:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• مكانة الهجرة في الإسلام وبيان فضلها.
ఇస్లాంలో హిజ్రత్ (వలసపోటం) యొక్క స్థానము,దాని ఘనత యొక్క ప్రకటన. info

• جواز العقاب بالمثل.
సమానంగా శిక్షను విధించటం సమ్మతము. info

• نصر الله للمُعْتَدَى عليه يكون في الدنيا أو الآخرة.
అల్లాహ్ యొక్క సహాయం బాధితుడికి ఇహలోకములోను,పరలోకములోను ఉంటుంది. info

• إثبات الصفات العُلَا لله بما يليق بجلاله؛ كالعلم والسمع والبصر والعلو.
జ్ఞానము,వినటం,చూడటం,గొప్పతనం లాంటి ఉన్నతమైన గుణాలు అల్లాహ్ కొరకు నిరూపణ అవి ఆయన మహత్యమునకు యోగ్యమైనవి. info