ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

លេខ​ទំព័រ:close

external-link copy
166 : 3

وَمَاۤ اَصَابَكُمْ یَوْمَ الْتَقَی الْجَمْعٰنِ فَبِاِذْنِ اللّٰهِ وَلِیَعْلَمَ الْمُؤْمِنِیْنَ ۟ۙ

మరియు (ఉహుద్ యుద్ధరంగంలో) రెండు సైన్యాలు ఎదుర్కొన్నప్పుడు, మీకు కలిగిన కష్టం, అల్లాహ్ అనుమతితోనే కలిగింది మరియు అది నిజమైన విశ్వాసులెవరో తెలుసుకోవటానికి - info
التفاسير:

external-link copy
167 : 3

وَلِیَعْلَمَ الَّذِیْنَ نَافَقُوْا ۖۚ— وَقِیْلَ لَهُمْ تَعَالَوْا قَاتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ اَوِ ادْفَعُوْا ؕ— قَالُوْا لَوْ نَعْلَمُ قِتَالًا لَّاتَّبَعْنٰكُمْ ؕ— هُمْ لِلْكُفْرِ یَوْمَىِٕذٍ اَقْرَبُ مِنْهُمْ لِلْاِیْمَانِ ۚ— یَقُوْلُوْنَ بِاَفْوَاهِهِمْ مَّا لَیْسَ فِیْ قُلُوْبِهِمْ ؕ— وَاللّٰهُ اَعْلَمُ بِمَا یَكْتُمُوْنَ ۟ۚ

మరియు కపటవిశ్వాసులు ఎవరో తెలుసుకోవటానికి. మరియు వారితో (కపట విశ్వాసులతో): "రండి అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయండి, లేదా కనీసం మిమ్మల్ని మీరు రక్షించుకోండి!"[1] అని అన్నప్పుడు వారు: "ఒకవేళ మాకు యుద్ధం జరుగుతుందని తెలిసివుంటే, మేము తప్పకుండా మీతోపాటు వచ్చి ఉండేవారం." అని జవాబిచ్చారు. ఆ రోజు వారు విశ్వాసానికంటే అవిశ్వాసానికి దగ్గరగా ఉన్నారు[2]. మరియు వారు తమ హృదయాలలో లేని మాటలను తమ నోళ్ళతో పలుకుతూ ఉన్నారు. మరియు వారు దాస్తున్నది అల్లాహ్ కు బాగా తెలుసు. info

[1] చూడండి, 2:190-194. [2] వారు 'అబ్దుల్లాహ్ ఇబ్నె ఉబయ్ తోటివారైన దాదాపు 300 మంది మునాఫిఖులు. వారు ఉ'హుద్ యుద్ధానికి సిద్ధపడిన తరువాత శతృవులు 3000 మంది ఉన్నారని తెలుసుకొని భయపడి వెనుదిరిగి పోతారు.

التفاسير:

external-link copy
168 : 3

اَلَّذِیْنَ قَالُوْا لِاِخْوَانِهِمْ وَقَعَدُوْا لَوْ اَطَاعُوْنَا مَا قُتِلُوْا ؕ— قُلْ فَادْرَءُوْا عَنْ اَنْفُسِكُمُ الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

అలాంటి వారు తమ ఇండ్లలో కూర్చొని ఉండి (చంపబడిన) తమ సోదరులను గురించి ఇలా అన్నారు: "వారు గనక మా మాట విని ఉంటే చంపబడి ఉండేవారు కాదు!" నీవు వారితో: "మీరు సత్యవంతులే అయితే, మీకు మరణం రాకుండా మిమ్మల్ని మీరు తప్పించుకోండి!" అని చెప్పు. info
التفاسير:

external-link copy
169 : 3

وَلَا تَحْسَبَنَّ الَّذِیْنَ قُتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ اَمْوَاتًا ؕ— بَلْ اَحْیَآءٌ عِنْدَ رَبِّهِمْ یُرْزَقُوْنَ ۟ۙ

మరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులై, తమ ప్రభువు వద్ద జీవనోపాధి పొందుతున్నారు[1]. info

[1] చూడండి, 2:154.

التفاسير:

external-link copy
170 : 3

فَرِحِیْنَ بِمَاۤ اٰتٰىهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ۙ— وَیَسْتَبْشِرُوْنَ بِالَّذِیْنَ لَمْ یَلْحَقُوْا بِهِمْ مِّنْ خَلْفِهِمْ ۙ— اَلَّا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟ۘ

అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానితో (ప్రాణత్యాగంతో) వారు సంతోషంతో ఉప్పొంగిపోతారు[1]. మరియు వారిని కలువక, వెనుక (బ్రతికి) ఉన్నవారి కొరకు (ఇవ్వబడిన శుభవార్తతో) వారు సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! info

[1] మరణిచిన ఏ ప్రాణి కూడా అల్లాహ్ (సు.తా.) దగ్గర మంచి చోటు దొరికిన తరువాత భూలోకానికి తిరిగి రావటానికి ఇష్టపడడు. కానీ షహీద్ (అల్లాహుతా'ఆలా మార్గంలో చంపబడినవాడు) భూలోకానికి తిరిగి రావటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అతడు షహాదత్ యొక్క గొప్ప ప్రతిఫలాన్ని చూసి ఉంటాడు. (ముస్నద్ అ'హ్మద్ - 3/126, 'స. ముస్లిం). కాని అది అసంభవం.

التفاسير:

external-link copy
171 : 3

یَسْتَبْشِرُوْنَ بِنِعْمَةٍ مِّنَ اللّٰهِ وَفَضْلٍ ۙ— وَّاَنَّ اللّٰهَ لَا یُضِیْعُ اَجْرَ الْمُؤْمِنِیْنَ ۟

వారు అల్లాహ్ అనుగ్రహానికి, దాతృత్వానికి సంతోషపడుతూ ఉంటారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసుల ప్రతిఫలాన్ని వ్యర్థం కానివ్వడు. info
التفاسير:

external-link copy
172 : 3

اَلَّذِیْنَ اسْتَجَابُوْا لِلّٰهِ وَالرَّسُوْلِ مِنْ بَعْدِ مَاۤ اَصَابَهُمُ الْقَرْحُ ۛؕ— لِلَّذِیْنَ اَحْسَنُوْا مِنْهُمْ وَاتَّقَوْا اَجْرٌ عَظِیْمٌ ۟ۚ

ఎవరైతే గాయపడిన తరువాత కూడా అల్లాహ్ మరియు సందేశహరుని (ఆజ్ఞలను) పాటించారో;[1] వారిలో ఎవరైతే, సత్కార్యాలు చేశారో, మరియు దైవభీతి కలిగి ఉన్నారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంది. info

[1] మక్కా ముష్రికులు ఉ'హుద్ యుద్ధరంగం నుండి వెనుదిరిగి కొంతదూరం పోయిన తరువాత: "మేము భీతిపరులైన ముస్లిములను, పూర్తిగా అణచకుండానే తిరిగి వచ్చి తప్పు చేశాము. 300 మైళ్ళ నుండి వచ్చి కూడా యుద్ధఖైదీలను గానీ, విజయధనం గానీ, పొందకుండా తిరిగి పోతున్నాము. కావున తిరిగి మదీనాపై దాడి చేద్దామని, సమాలోచనలు చేస్తారు. కాని వారికి ధైర్యం చాలదు. దైవప్రవక్త ('స'అస) కూడా పారిపోయే శత్రువును వెంబడించి నశింపజేయాలని, 70 మంది వీరులను తీసుకొని - వారు గాయపడి ఉన్నా తయారయ్యి - వారిని వెంబడిస్తారు. వారు మదీనా నుండి 8 మైళ్ళ దూరంలో ఉన్న'హమ్రా' అల్ అసద్ అనే ప్రాంతం వరకు పోతారు. శత్రువులను పొందక, వారిక మరలిరారని నిశ్చితులైన తరువాత తిరిగి వస్తారు.

التفاسير:

external-link copy
173 : 3

اَلَّذِیْنَ قَالَ لَهُمُ النَّاسُ اِنَّ النَّاسَ قَدْ جَمَعُوْا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ اِیْمَانًا ۖۗ— وَّقَالُوْا حَسْبُنَا اللّٰهُ وَنِعْمَ الْوَكِیْلُ ۟

వారితో (విశ్వాసులతో) ప్రజలు: "వాస్తవానికి, మీకు వ్యతిరేకంగా పెద్ద జన సమూహాలు కూర్చబడి ఉన్నాయి, కావున మీరు వారికి భయపడండి." అని అన్నప్పుడు, వారి విశ్వాసం మరింత అధికమే అయింది. మరియు వారు: "మాకు అల్లాహ్ యే చాలు మరియు ఆయనే సర్వోత్తమమైన కార్యసాధకుడు." [1] అని అన్నారు.[2] info

[1] అల్-వకీలు: అంటే Trustee, Overseer, Guardian, Disposer of affairs, కార్యకర్త, సంరక్షకుడు, కార్యనిర్వాహకుడు, కార్యసాధకుడు, సాక్షి, బాధ్యుడు, ధర్మకర్త, మొదలైన అర్థాలున్నాయి. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 4:109, 6:102, 11:12, 17:2. [2] చూడండి, 'స. బు'ఖారీ, పు. 6, 'హదీస్' నం. 86, 87.

التفاسير: