[1] మూసా ('అ.స.) పై అవతరింపజేయబడిన తౌరాత్ గ్రంథం తరువాత అల్లాహ్ (సు.తా.) 'ఈసా ('అ.స.) పై ఇంజీల్ ను అవతరింపజేశాడు. అతను తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరిచారు. 'ఈసా ('అ.స.) : "ఇస్రాయీ'ల్ సంతతిలోని దారి తప్పిన గొర్రెల వద్దకే తప్ప ఇతరుల వద్దకు నేను పంపబడలేదు." అని అన్నారు. మత్తయి - (Mathew), 15:24. ఇక ము'హమ్మద్ ('స'అస) వచ్చారు. అతనికపై ఖుర్ఆన్ అవతరింపజేయబడింది. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది. ఈ ఖుర్ఆన్ 1400 సంవత్సరాలలో, దానిలోని ఒక్క అక్షరమైనా మార్చబడకుండా, దాని అసలు రూపంలో భద్రపరచబడి ఉన్న ఏకైక, దివ్యగ్రంథం. ఎందుకంటే పునరుత్థానదినం వరకు నేను ఈ ఖుర్ఆన్ ను దాని అసలు రూపంలో భద్రపరుస్తానని అల్లాహ్ (సు.తా.) వాగ్దానం చేశాడు, చూడండి.15:9. ఇది ర'హ్మతుల్లిల్ 'ఆలమీన్ - అంటే సర్వలోకాల వారికి కారుణ్యం. ఇది సర్వలోకాల వారి కొరకు అవతరింజేయబడింది. ము'హమ్మద్ ('స'అస) చిట్టచివరి ప్రవక్త. అతనిపై అవతరింపజేయబడిన ఈ దివ్యఖుర్ఆన్ చిట్ట చివరి దివ్యగ్రంథం.