クルアーンの対訳 - テルグ語対訳 - Abdul-Rahim ibn Muhammad

ページ番号: 250:249 close

external-link copy
14 : 13

لَهٗ دَعْوَةُ الْحَقِّ ؕ— وَالَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا یَسْتَجِیْبُوْنَ لَهُمْ بِشَیْءٍ اِلَّا كَبَاسِطِ كَفَّیْهِ اِلَی الْمَآءِ لِیَبْلُغَ فَاهُ وَمَا هُوَ بِبَالِغِهٖ ؕ— وَمَا دُعَآءُ الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ ۟

ఆయనను ప్రార్థించటమే విద్యుక్త ధర్మం. ఆయనను వదలి వారు ప్రార్థించేవి (ఇతర శక్తులు) వారికి ఏ విధమైన సమాధాన మివ్వలేవు. అది (వాటిని వేడుకోవడం): ఒకడు తన రెండు చేతులు నీటి వైపుకు చాచి, అది (నీరు) నోటి దాకా రావాలని ఆశించటమే! కాని అది అతని (నోటి వరకు) చేరదు కదా! (అలాగే) సత్యతిరస్కారుల ప్రార్థనలన్నీ వ్యర్థమై పోతాయి. info
التفاسير:

external-link copy
15 : 13

وَلِلّٰهِ یَسْجُدُ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ طَوْعًا وَّكَرْهًا وَّظِلٰلُهُمْ بِالْغُدُوِّ وَالْاٰصَالِ ۟

మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానో అయిష్టంగానో అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటుంది. మరియు వాటి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం (సాష్టాంగం చేస్తూ ఉంటాయి).[1] info

[1] చూడండి, 16:48-49 మరియు 22:18. భూమి చుట్టూ తాను తిరగటం వల్ల రాత్రింబవళ్ళు వస్తాయి. సూర్యచంద్రులు కూడా గమనంలో ఉన్నాయి. ఇదంతా అల్లాహ్ (సు.తా.) ఆదేశంతో జరుగుతోంది. కాబట్టి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం పొడుగ్గా ఉండి మధ్యాహ్నం చిన్నదవటం కూడా అల్లాహ్ (సు.తా.) ఆదేశాలను అనుసరిచటమే!

التفاسير:

external-link copy
16 : 13

قُلْ مَنْ رَّبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— قُلِ اللّٰهُ ؕ— قُلْ اَفَاتَّخَذْتُمْ مِّنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ لَا یَمْلِكُوْنَ لِاَنْفُسِهِمْ نَفْعًا وَّلَا ضَرًّا ؕ— قُلْ هَلْ یَسْتَوِی الْاَعْمٰی وَالْبَصِیْرُ ۙ۬— اَمْ هَلْ تَسْتَوِی الظُّلُمٰتُ وَالنُّوْرُ ۚ۬— اَمْ جَعَلُوْا لِلّٰهِ شُرَكَآءَ خَلَقُوْا كَخَلْقِهٖ فَتَشَابَهَ الْخَلْقُ عَلَیْهِمْ ؕ— قُلِ اللّٰهُ خَالِقُ كُلِّ شَیْءٍ وَّهُوَ الْوَاحِدُ الْقَهَّارُ ۟

ఇలా అడుగు: "భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" నీవే ఇలా జవాబివ్వు: "అల్లాహ్!" తరువాత ఇలా అను: "అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలు గానీ, కీడు గానీ చేసుకోలేని వారిని, మీకు సహాయకులుగా (సంరక్షకులుగా) ఎన్నుకుంటారా?" ఇంకా ఇలా అడుగు: "ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడగలిగే వాడూ సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా, అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?" వారితో అను: "అల్లాహ్ యే ప్రతిదానికి సృష్టికర్త.[1] మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు)"[2] info

[1] అల్-ఖాలిఖు: సృష్టికర్త, అల్లాహ్ (సు.తా.) యే ఏ నమూనా లేకుండా క్రొత్తగా సృష్టించేవాడు. ఆయన (సు.తా.) ఏదైనా చేయటానికి పూనుకున్నప్పుడు దానిని : 'అయిపో' అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది. చూడండి, 102 మరియు 2:117. [2] అల్ వాహిద్, అల్ ఖహ్హార్ లకు చూడండి, 12:39.

التفاسير:

external-link copy
17 : 13

اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَسَالَتْ اَوْدِیَةٌ بِقَدَرِهَا فَاحْتَمَلَ السَّیْلُ زَبَدًا رَّابِیًا ؕ— وَمِمَّا یُوْقِدُوْنَ عَلَیْهِ فِی النَّارِ ابْتِغَآءَ حِلْیَةٍ اَوْ مَتَاعٍ زَبَدٌ مِّثْلُهٗ ؕ— كَذٰلِكَ یَضْرِبُ اللّٰهُ الْحَقَّ وَالْبَاطِلَ ؕ۬— فَاَمَّا الزَّبَدُ فَیَذْهَبُ جُفَآءً ۚ— وَاَمَّا مَا یَنْفَعُ النَّاسَ فَیَمْكُثُ فِی الْاَرْضِ ؕ— كَذٰلِكَ یَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَ ۟ؕ

ఆయన (అల్లాహ్) ఆకాసం నుండి నీరు కురిపించగా (ఎండిపోయిన) సెలయేళ్ళు తమ తమ పరిమాణాలకు సరిపడేలా[1] ప్రవహింప సాగుతాయి. అప్పుడు వరద (ఉపరితలం మీద) నురుగులు ఉబ్బి వస్తాయి. మరియు అగ్నిని రగిలించి నగలు, పాత్రలు చేసేటప్పుడు కూడా కరిగించే లోహాల మీద కూడా అదే విధంగా నురుగులు వస్తాయి.[2] ఈ విధంగా అల్లాహ్ సత్యమేదో అసత్యమేదో పోల్చి వివరిస్తున్నాడు. ఎందుకంటే నురుగంతా ఎగిరి పోతుంది, కాని మానవులకు లాభదాయకమైనది భూమిలో మిగులుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణలను వివరిస్తున్నాడు.[3] info

[1] బి ఖద్ రిహా: తమ తమ పరిమాణాన్ని బట్టి పూర్తిగా నిండి. [2] పారే నీటిపై వచ్చే నురుగు గానీ, వెండి, బంగారు కరిగించినపుడు వచ్చే నురుగు గానీ, మాలిన్యాలే. అవి ఎగిరిపోతాయి. మరియు అసలే క్రింద మిగిలిపోతుంది. [3] చూడండి, 24:39-40.

التفاسير:

external-link copy
18 : 13

لِلَّذِیْنَ اسْتَجَابُوْا لِرَبِّهِمُ الْحُسْنٰی ؔؕ— وَالَّذِیْنَ لَمْ یَسْتَجِیْبُوْا لَهٗ لَوْ اَنَّ لَهُمْ مَّا فِی الْاَرْضِ جَمِیْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لَافْتَدَوْا بِهٖ ؕ— اُولٰٓىِٕكَ لَهُمْ سُوْٓءُ الْحِسَابِ ۙ۬— وَمَاْوٰىهُمْ جَهَنَّمُ ؕ— وَبِئْسَ الْمِهَادُ ۟۠

తమ ప్రభువు సందేశాన్ని స్వీకరించిన వారికి మంచి ప్రతిఫలం ఉంటుంది. మరియు ఆయన సందేశాన్ని స్వీకరించని వారి దగ్గర భూమిలో ఉన్నదంతా, మరియు దానితో పాటు దానికి సమానంగా ఉన్నా, వారు అదంతా పరిహారంగా ఇవ్వదలచుకున్నా (అది స్వీకరించబడదు).[1] అలాంటి వారి లెక్క దారుణంగా ఉంటుంది. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది ఎంతో దుర్భరమైన విరామ స్థలము. info

[1] చూడండి, 3:91; 10:54.

التفاسير: