[1] అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞను ఉల్లంఘించటం, అంటే ఇక్కడ: "సత్యం వైపునకు మరియు ఏకైక ఆరాధ్యుడు, అల్లాహుతా'ఆలా వైపునకు పిలవటాన్ని మానుకోవటం." ఇదే కదా! సత్యతిరస్కారులు కోరుతున్నది. ఇంకా చూడండి, 4:48.
[1] స'మూద్ జాతి ప్రజలు తమ ప్రవక్త 'సాలిహ్' ('అ.స.)తో : "నీవు దైవప్రవక్తవే అయితే మాకొక అద్భుత సూచనగా ఈ బండరాయి నుండి ఒక ఆడ ఒంటెను తీసుకురా?" అని గట్టిగా పట్టుపట్టి అడుగ్గా వచ్చిన ఆడఒంటె అది.
[1] ఇక్కడ అరుపు ('సై'హతున్) అని ఉంది మరియు 7:78లో భూకంపం (రజ్ ఫతున్) అని ఉంది. రెండూ వచ్చాయన్నమాట.
[1] ఇబ్రాహీమ్ ('అస) అతిథులు అతను తెచ్చిన, వేచిన ఆవుదూడ మాంసం తిననందుకు, అతను వారు తనతో శత్రుత్వం వహిస్తారేమోనని భయపడ్డారు. దీనితో విశదమయ్యే మరొక విషయమేమిటంటే ప్రవక్తలకు అకోచర జ్ఞానముండదు. అతనికి అగోచరజ్ఞానముంటే వారు దైవదూతలని అతనికి తెలిసి ఉండేది. అతను వారి కొరకు వేపిన ఆవుదూడ తెచ్చేవారు కాదు. [2] లూ'త్ ('అ.స.) ఇబ్రాహీమ్ ('అ.స.) సోదరుని కుమారులు. అతను జోర్డాన్ కు తూర్పుదిక్కు ఈనాటి లూ'త్ సముద్రం (Dead Sea) అనే ప్రాంతలో నివసించే వారు. ఇబ్రాహీమ్ ('అ.స.) వలే, లూ'త్ ('అ.స.) కూడా, దక్షిణ బాబిలోనియా (Babylonia) లోని 'ఊర్' అనే ప్రాంతవాసులు. తన పిన్నాన్నతో సహా ఇక్కడికి వలస వచ్చారు. కావున లూ'త్ (అ'.స.) ప్రజలు అంటే అతని జాతివారు కాదు, కాని పైన పేర్కొన్న ప్రాంతంలోని సోడోమ్ మరియు గొమొర్రాహ్ అనే నగరాల వాసులు.
[1] ఇబ్రాహీం ('అ.స.) భార్య సారహ్ ('అలైహా స.) నవ్వటానికి వ్యాఖ్యాతలు విభిన్న కారణాలు పేర్కొన్నారు : 1) ఆమెకు లూ'త్ ('అ.స.) జాతివారి దుష్చేష్టలు తెలుసు కావున వారి నాశనాన్ని గురించి విని, సంతోషంతో నవ్విందని. 2) వృద్ధాంప్యంలో తనకు ఇవ్వబడిన సంతానపు వార్తవిని ఆశ్చర్యంతో నవ్విందని.