クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳)

ページ番号:close

external-link copy
164 : 7

وَاِذْ قَالَتْ اُمَّةٌ مِّنْهُمْ لِمَ تَعِظُوْنَ قَوْمَا ۙ— ١للّٰهُ مُهْلِكُهُمْ اَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِیْدًا ؕ— قَالُوْا مَعْذِرَةً اِلٰی رَبِّكُمْ وَلَعَلَّهُمْ یَتَّقُوْنَ ۟

ఓ ప్రవక్తా ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోండి వారిలోంచి ఒక వర్గము వారిని ఈ దుష్కార్యము నుండి వారిస్తున్నది,దాని నుండి వారిని హెచ్చరిస్తుంది. అయితే వారిని ఉద్దేశించి ఇంకో వర్గం ఇలా పలికింది : ఆ వర్గాన్ని ఎవరినైతే అల్లాహ్ ఇహలోకంలో వారు చేసుకున్న అవిధేయ కార్యాల వలన (పాప కార్యాల వలన) వినాశనం చేయబోతున్నాడో లేదా వారిని ప్రళయ దినాన కఠిన శిక్షకు గురి చేయబోతున్నాడో వారిని మీరు ఎందుకు హితోపదేశం చేస్తున్నారు ?. హితోపదేశం చేసేవారు ఇలా పలికారు : వారికి మా హితోపదేశం అల్లాహ్ మాకు ఆదేశించిన మంచి గురించి ఆదేశించటం,చెడు నుండి వారించే కార్యం చేయటం ద్వారా అల్లాహ్ వద్ద సంజాయిషీ చెప్పుకోవటానికి కడకు దానిని వదిలి వేయటం ద్వారా అల్లాహ్ మనల్ని శిక్షించకుండా ఉండటానికి,వారు హితోపదేశం ద్వారా ప్రయోజనం చెంది తాము ఉన్న అవిధేయ కార్యల నుండి వైదొలుగుతారని. info
التفاسير:

external-link copy
165 : 7

فَلَمَّا نَسُوْا مَا ذُكِّرُوْا بِهٖۤ اَنْجَیْنَا الَّذِیْنَ یَنْهَوْنَ عَنِ السُّوْٓءِ وَاَخَذْنَا الَّذِیْنَ ظَلَمُوْا بِعَذَابٍۭ بَىِٕیْسٍ بِمَا كَانُوْا یَفْسُقُوْنَ ۟

అయితే ఎప్పుడైతే అవిధేయులు (పాపాత్ములు) హిత బోధకుల హిత బోధన నుండి విముఖత చూపారో,ఆగలేదో చెడు నుంచి వారించిన వారిని మేము శిక్ష నుండి రక్షించినాము,శనివారం రోజు వేటాడి హద్దు మీరి దుర్మార్గమునకు పాల్పడిన వారిని అల్లాహ్ విధేయత నుండి వారు తొలిగి పోవటం వలన,పాప కార్యాల్లో (అవిధేయ కార్యాల్లో) వారి తలబిరుసు తనం వలన మేము కఠినమైన శిక్ష ద్వారా పట్టుకున్నాము. info
التفاسير:

external-link copy
166 : 7

فَلَمَّا عَتَوْا عَنْ مَّا نُهُوْا عَنْهُ قُلْنَا لَهُمْ كُوْنُوْا قِرَدَةً خٰسِىِٕیْنَ ۟

మరియు ఎప్పుడైతే వారు గర్వంగా,మొండిగా అల్లాహ్ కు అవిధేయతలో హద్దుమీరి పోయారో, హితోపదేశమును గ్రహించలేదో వారితో మేము ఇలా అన్నాము : "ఓ అవిధేయులారా మీరు నీచమైన కోతులుగా మారిపోండి". అప్పుడు వారు మేము కోరిన విధంగా అయిపోయారు. మేము ఏదైన వస్తువును తలచుకుంటే మా ఆదేశం ఇలా ఉంటుంది. మేము దానితో అంటాము "నీవు అయిపో" అది అయిపోతుంది. info
التفاسير:

external-link copy
167 : 7

وَاِذْ تَاَذَّنَ رَبُّكَ لَیَبْعَثَنَّ عَلَیْهِمْ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ مَنْ یَّسُوْمُهُمْ سُوْٓءَ الْعَذَابِ ؕ— اِنَّ رَبَّكَ لَسَرِیْعُ الْعِقَابِ ۖۚ— وَاِنَّهٗ لَغَفُوْرٌ رَّحِیْمٌ ۟

ఓ ప్రవక్తా యూదులపై వారి ఇహలోక జీవితంలో ప్రళయదినం వరకు వారిని అవమానానికి గురి చేసే వారిని,పరాభవమునకు గురి చేసే వారిని అంటగడతాడని అల్లాహ్ ఎటువంటి సందేహం లేని స్పష్టంగా చేసిన ప్రకటన చేసినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు తనపై అవిధేయత చూపే వారిని శీఘ్రంగా శిక్షిస్తాడు. చివరికి ఆయన ఇహలోకంలోనే అతనిని శిక్షించటంలో తొందర చేస్తాడు. తన దాసుల్లోంచి అతనితో పాపముల మన్నింపు వేడుకునే వారిని క్షమించే వాడును,వారిపై అపారంగా కరుణించే వాడును. info
التفاسير:

external-link copy
168 : 7

وَقَطَّعْنٰهُمْ فِی الْاَرْضِ اُمَمًا ۚ— مِنْهُمُ الصّٰلِحُوْنَ وَمِنْهُمْ دُوْنَ ذٰلِكَ ؗ— وَبَلَوْنٰهُمْ بِالْحَسَنٰتِ وَالسَّیِّاٰتِ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟

మరియు మేము వారిని భూమండలంలో (తెగలుగా,వర్గాలుగా) విభజించాము,అందులో వారు కలిసి ఉన్నప్పటికీ మేము వారిని అనేక వర్గాలుగా చీల్చి వేశాము. వారిలోంచి కొందరు అల్లాహ్ యొక్క హక్కులను,ఆయన దాసుల యొక్క హక్కులను నిర్వర్తించే సజ్జనులు ఉన్నారు. వారిలోంచి మధ్యే మార్గమును అనుసరించే వారు ఉన్నారు. వారిలోంచి అవిధేయ కార్యాల వలన (పాప కార్యాల వలన) తమపై అన్యాయము చేసుకునే వారు ఉన్నారు. మరియు మేము వారిని సౌలభ్యము ద్వారా కష్టతరము ద్వారా వారు ఉన్న స్థితి నుండి మరలుతారని ఆశిస్తూ పరీక్షించినాము. info
التفاسير:

external-link copy
169 : 7

فَخَلَفَ مِنْ بَعْدِهِمْ خَلْفٌ وَّرِثُوا الْكِتٰبَ یَاْخُذُوْنَ عَرَضَ هٰذَا الْاَدْنٰی وَیَقُوْلُوْنَ سَیُغْفَرُ لَنَا ۚ— وَاِنْ یَّاْتِهِمْ عَرَضٌ مِّثْلُهٗ یَاْخُذُوْهُ ؕ— اَلَمْ یُؤْخَذْ عَلَیْهِمْ مِّیْثَاقُ الْكِتٰبِ اَنْ لَّا یَقُوْلُوْا عَلَی اللّٰهِ اِلَّا الْحَقَّ وَدَرَسُوْا مَا فِیْهِ ؕ— وَالدَّارُ الْاٰخِرَةُ خَیْرٌ لِّلَّذِیْنَ یَتَّقُوْنَ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟

అప్పుడు వారందరి తరువాత వారి ప్రాతినిద్యమును వహిస్తూ చెడ్డవారు వచ్చారు. వారు తమ పూర్వికుల నుండి తౌరాతును పుచ్చుకున్నారు. వారు దానిని చదివే వారు,అందులో ఉన్న వాటిని ఆచరించేవారు కాదు. అల్లాహ్ గ్రంధాన్నివక్రీకరించటానికి,అందులో అవతరింపబడని ఆదేశమును ఇవ్వటానికి ప్రాపంచిక నాసిక రకమైన సామగ్రిని లంచముగా పుచ్చుకునేవారు. వారి పాపాలను అల్లాహ్ మన్నిస్తాడు అని వారు నమ్మేవారు. ఒక వేళ ప్రాపంచిక సాధారణ సామగ్రి వారి వద్దకు వస్తే దాన్ని వారు మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు. ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా అల్లాహ్ పై సత్యమును తప్ప వేరేది మాట్లాడ కూడదని వీరందరితో అల్లాహ్ వాగ్ధానములను,నిభందనలను తీసుకోలేదా ?. గ్రంధంపై ఆచరణ వారు జ్ఞానం లేకుండా కాదు జ్ఞానం ఉండే వదిలేశారు. అందులో ఉన్న వాటిని చదివారు,దానిని తెలుసుకున్నారు. వారి పాపము చాలా తీవ్రమైనది. అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు భయపడే వారి కొరకు పరలోక నిలయము,పరలోకములో ఉండే శాస్వత అనుగ్రహాలు ఈ అశాస్వత సామగ్రి కన్న మేలైనవి. అయితే ఏమిటీ దైవభీతి కల వారి కొరకు అల్లాహ్ పరలోకంలో తయారు చేసి ఉన్నది మేలైనదని,శాస్వతమైనదని ఈ సాధారణమైన (అల్పమైన) సామగ్రిని పుచ్చుకునే వారందరు గ్రహించలేరా ?. info
التفاسير:

external-link copy
170 : 7

وَالَّذِیْنَ یُمَسِّكُوْنَ بِالْكِتٰبِ وَاَقَامُوا الصَّلٰوةَ ؕ— اِنَّا لَا نُضِیْعُ اَجْرَ الْمُصْلِحِیْنَ ۟

మరియు ఎవరైతే గ్రంధంపై పట్టు కలిగి ఉన్నారో,అందులో ఉన్న వాటన్నింటిని ఆచరిస్తారో,నమాజులను వాటి వేళలను,వాటి షరతులను,వాటి అనివార్య కార్యాలను,వాటి సున్నతులను పరిరక్షిస్తూ పాటిస్తారో వారందరిని తొందరలోనే అల్లాహ్ వారి ఆచరణల పరంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అయితే అల్లాహ్ పుణ్యపరంగా ఉండే ఆచరణ కలిగిన వారి ప్రతిఫలాన్ని వృధా చేయడు. info
التفاسير:
本諸節の功徳:
• إذا نزل عذاب الله على قوم بسبب ذنوبهم ينجو منه من كانوا يأمرون بالمعروف وينهون عن المنكر فيهم.
ఏదైన జాతి వారిపై వారి యొక్క పాపముల వలన అల్లాహ్ శిక్ష వచ్చి పడితే వారిలో నుండి ఎవరైతే మంచి గురించి ఆదేశిస్తారో,చెడు నుండి వారిస్తారో వారు దాని నుండి మోక్షం పొందుతారు. info

• يجب الحذر من عذاب الله؛ فإنه قد يكون رهيبًا في الدنيا، كما فعل سبحانه بطائفة من بني إسرائيل حين مَسَخَهم قردة بسبب تمردهم.
అల్లాహ్ శిక్ష విషయంలో జాగ్రత్త పడటం ఎంతో అవసరం. ఎందుకంటే అది ఇహలోకంలో భయంకరంగా ఉంటుంది ఏవిధంగా అంటే ఇస్రాయీలు సంతతివారిలో నుండి ఒక వర్గమును వారి తిరుగుబాటు కారణంగా అల్లాహ్ సుబహానహు వతఆలా వారి రూపాలను మార్చి కోతుల మాదిరిగా చేశాడో ఆవిధంగా (ఉంటుంది). info

• نعيم الدنيا مهما بدا أنه عظيم فإنه قليل تافه بجانب نعيم الآخرة الدائم.
అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారిపై అవమానమును,దారిద్య్రమును రాసేశాడు. మరియు వారి దుర్మార్గం వలన,మరలి పోవటం వలన ప్రతీ కాలంలో వారిని బాధ పెట్టే వారిని వారిపై పంపించాలని ప్రకటించాడు. info

• أفضل أعمال العبد بعد الإيمان إقامة الصلاة؛ لأنها عمود الأمر.
ఇహలోక అనుగ్రహాలు ఒక వేళ అవి పెద్దవిగా కనబడిన పరలోక శాశ్వత అనుగ్రహాల ముందు అవి అల్పమైనవి,తక్కువైనవి. info

• كتب الله على بني إسرائيل الذلة والمسكنة، وتأذن بأن يبعث عليهم كل مدة من يذيقهم العذاب بسبب ظلمهم وانحرافهم.
విశ్వాసము తరువాత దాసుని యొక్క ఆచరణల్లో నమాజును నెలకొల్పటం ఎంతో గొప్పదైనది. ఎందుకంటే అది ఆచరణల మూల స్తంభము. info