[1] నిర్ణీతగడువుతో అంటే గడువు ప్రారంభం కాగల సమయంలో, నిర్ణీతగడువు లోపల ఆమెతో రాజీపడే అవకాశం ఉండేరీతిలో విడాకులివ్వాలి. ఇబ్నె ఉమర్ ('ర'ది.'అ) తన భార్యకు ఋతుస్రావంకాలం (బహిష్టు సమయం)లో విడాకులిస్తే, దైవప్రవక్త ('స'అస) క్రోధితులయ్యారు. స్త్రీలు పరిశుద్ధులుగా ఉన్నకాలంలో వారితో లైంగిక సంబంధం చేయక ముందు విడాకులివ్వాలి అని బోధించారు. ('స. బు'ఖారీ). ఇక్కడ పేర్కొన్న 'హదీస్' ఈ ఆయత్ వెలుగులో ఉంది. ఆ గడువును ఖచ్ఛితంగా లెక్కపెట్టాలి.
[2] ఇద్దత్ కాలం పూర్తి అయ్యే వరకు స్త్రీలు తమ భర్త ఇంటిలోనే ఉండాలి. భర్త ఆమె అన్న వస్త్రాల ఖర్చులు భరించాలి.
[3] చూఅంటే అల్లాహ్ (సు.తా.) వారి మధ్య మళ్ళీ ప్రేమ కలగించవచ్చు మరియు వారు తిరిగి తమ వివాహబంధాన్ని స్థిరపరచుకోవచ్చు! అందుకే ఒకసారి విడాకులివ్వడం ప్రోత్సహించబడింది. మరియు చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం - ఈ ఆయత్ వెలుగులో - మూడు విడాకులు ఒకేసారి ఇవ్వడం నిషేధింపబడింది. ఎందుకంటే మొదటి మరియు రెండవ విడాకు తరువాత వివాహాన్ని తిరిగి స్థిరపరచుకోవచ్చు! (ఫ'త్హ్ అల్ ఖదీర్). ఒక స్త్రీకి అంతకు ముందు రెండువిడాకులివ్వబడి ఆ తరువాత మూడవవిడాకు ఇస్తే! అప్పుడు ఆమె తన భర్త ఇంట్లో ఉండజాలదు. మరియు అలాంటి పరిస్థితిలో, ఆమె మరొక పురుషుణ్ణి వివాహమాడకముందు తిరిగి తన మొదటి భర్తతో వివాహం కూడా చేసుకోజాలదు. ఇది ఫాతిమబిన్తెఖైస్ (ర.'అన్హా) కు జరిగిన విషయంతో స్పష్టమవుతుంది. ఆమె భర్త ఆమెకు మూడవసారి విడాకులిచ్చిన తరువాత ఆమె తన భర్త ఇంటి నుండి వెళ్ళిపోవటానికి నిరాకరించింది. అప్పుడావిషయం దైవప్రవక్త ('స'అస) దగ్గరికి వస్తే అతనామెను, తన భర్త ఇల్లు విడవమని ఆజ్ఞాపించారు, (అ'హ్మద్, నసాయీ').
[1] ఋతుస్రావం ప్రారంభం కాని స్త్రీలకు మరియు ఋతుస్రావం ఆగిపోయిన స్త్రీలకు వేచి ఉండే గడువు మూడు నెలలు.
[2] గర్భవతులైన స్త్రీల గడువు - విడాకులివ్వబడినా లేక భర్త మరణించినా - ప్రసవించే వరకు! అలాంటి ప్రసవం విడాకుల తరువాత లేక భర్త మరణించిన రెండవరోజే అయినా సరే! ఈ విషయం 'హదీస్'లలో కూడా ఉంది. (బు.'ఖారీ, ముస్లిం). ఇతర స్త్రీలు భర్త మరణించిన తరువాత నాలుగు మాసాల పది రోజులు వేచి ఉండాలి. 2:234.
[1] చూడండి, 2:233.
[1] ఇక్కడ ప్రవక్త అంటే ముహమ్మద్ ('స'అస).