[1] 'అఖ్ద్: 'ఉఖూద్ (బ.వ.), అంటే ముడి అని అర్థం. ఇవి ధర్మాచారణలో మూడు రకాలు: 1) అల్లాహ్ - మానవుల మధ్య, 2) మానవుడు - తన ఆత్మతో, 3) మానవుడు - తన తోటివారితో చేసేవి. (రా'గిబ్). [2] బహీమ: అంటే మేసే పశువు. అన్'ఆమున్: అంటే ఒంటెలు, ఆవులు, ఎడ్లు, గొర్రెలు, మేకల వంటి సాధు జంతువులు. చూడండి, 6:124. ఇవే కాక అడవి పశువులు, ఉదా: అడవి ఆవులు, జింకలు మొదలైనవి. ఇవి గడ్డి, చెట్లు తినేవి. వేటాడి ఇతర జంతువులను తననివి. జా'-నాబిన్: అంటే కోరపళ్ళుగల క్రూరమృగాలు మాంసాహారులైనవి. ఉదా: కుక్క, పులి. జూ'-మి'ఖ్లబిన్: అంటే, గోళ్ళు గల వేటాడే పక్షులు. ఏవైతే తమ వేట జంతువును తమ గోళ్ళతో పట్టుకుంటాయో, ఉదా: డేగ. [3] ఇ'హ్రామ్ స్థితిలో వేటాడే నిషిద్ధాలను గురించి చూడండి, 5:94-96.
[1] ష'ఆయి'రల్లాహ్: అల్లాహ్ చిహ్నాలు. అంటే పవిత్రమైనవని సూచించిన నిదర్శనాలు, సంకేతాలు, ప్రత్యేక ధర్మవిధులను నిర్వహించటానికి చూపబడిన స్థానాలు. ఉదా: క'అబహ్, 'సఫా-మర్వాలు, మరియు ధర్మ ఆచారాలు, 'తవాఫ్, స'యీ మొదలైనవి. [2] నిషిద్ధ మాసాలు : రజబ్, జు'ల్ - ఖాయిదహ్, జు'ల్-'హిజ్జహ్ మరియు ము'హర్రమ్ ('అరబ్బీ 7, 11, 12 మరియు 1వ నెలలు) ఈ మాసాలలో యుద్ధం చేయటం నిషిద్ధం. [3] 1) హద్ యున్ : అంటే 'హాజీ, 'హజ్ కొరకు, 'హరంలో బలి (ఖుర్బానీ) చేయటానికి తెచ్చే పశువు. 2) ఖలాయి దతున్': 'హరమ్ కు తీసుకుని పోవుటకు నిశ్చయించి, వాటి మెడలలో పట్టీలు వేసిన పశువు. 3) ఫిద్ యతున్ : ధర్మ ఆచారంలో అయిన తప్పులకు పరిహారంగా ఇచ్చే బలి (ఖుర్బానీ). దీని మాంసం పూర్తిగా పేదవారిలో పంచాలి.