Traduzione dei Significati del Sacro Corano - Traduzione in telugu - Abdul Rahim Bin Muhammed

Numero di pagina:close

external-link copy
17 : 40

اَلْیَوْمَ تُجْزٰی كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ ؕ— لَا ظُلْمَ الْیَوْمَ ؕ— اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ ۟

ఆ రోజు ప్రతి ప్రాణికి తాను సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఆ రోజు ఎవ్వరికీ అన్యాయం జరుగదు. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు. info
التفاسير:

external-link copy
18 : 40

وَاَنْذِرْهُمْ یَوْمَ الْاٰزِفَةِ اِذِ الْقُلُوْبُ لَدَی الْحَنَاجِرِ كٰظِمِیْنَ ؕ۬— مَا لِلظّٰلِمِیْنَ مِنْ حَمِیْمٍ وَّلَا شَفِیْعٍ یُّطَاعُ ۟ؕ

మరియు (ఓ ముహమ్మద్!) సమీపంలో రానున్న దినాన్ని గురించి వారిని హెచ్చరించు. అప్పుడు గుండెలు గొంతుల వరకు వచ్చి అడ్డుకొని, ఊపిరి ఆడకుండా చేస్తాయి. (ఆ రోజు) దుర్మార్గులకు, ఆప్తమిత్రుడు గానీ, మాట చెల్లునట్టి సిఫారసు చేసేవాడు గానీ,[1] ఎవ్వడూ ఉండడు. info

[1] సిఫారసుకు చూడండి, 10:3.

التفاسير:

external-link copy
19 : 40

یَعْلَمُ خَآىِٕنَةَ الْاَعْیُنِ وَمَا تُخْفِی الصُّدُوْرُ ۟

ఆయన (అల్లాహ్)కు, చూపులలోని నమ్మకద్రోహం మరియు హృదయాలలో దాగివున్న రహస్యాలు అన్నీ తెలుసు. info
التفاسير:

external-link copy
20 : 40

وَاللّٰهُ یَقْضِیْ بِالْحَقِّ ؕ— وَالَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا یَقْضُوْنَ بِشَیْءٍ ؕ— اِنَّ اللّٰهَ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟۠

మరియు అల్లాహ్, న్యాయంగా తీర్పు చేస్తాడు. మరియు వారు ఆయనను (అల్లాహ్ ను) వదలి ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నారో, వారు ఎలాంటి తీర్పు చేయలేరు. నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. info
التفاسير:

external-link copy
21 : 40

اَوَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ كَانُوْا مِنْ قَبْلِهِمْ ؕ— كَانُوْا هُمْ اَشَدَّ مِنْهُمْ قُوَّةً وَّاٰثَارًا فِی الْاَرْضِ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْ ؕ— وَمَا كَانَ لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ وَّاقٍ ۟

ఏమీ? వారు భూమిలో సంచారం చేసి తమకు ముందు గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో చూడలేదా? వారు, వీరి కంటే ఎక్కువ బలం గలవారు. మరియు వీరి కంటే ఎక్కువ గుర్తులను భూమిలో వదిలి పోయారు; కాని అల్లాహ్ వారి పాపాలకుగానూ వారిని పట్టుకున్నాడు మరియు అప్పుడు వారిని అల్లాహ్ పట్టు నుండి కాపాడేవాడు ఎవ్వడూ లేక పోయాడు. info
التفاسير:

external-link copy
22 : 40

ذٰلِكَ بِاَنَّهُمْ كَانَتْ تَّاْتِیْهِمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ فَكَفَرُوْا فَاَخَذَهُمُ اللّٰهُ ؕ— اِنَّهٗ قَوِیٌّ شَدِیْدُ الْعِقَابِ ۟

ఇలా ఎందుకు జరిగిందంటే! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు! కాని వారు, వారిని తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారిని శిక్షకు గురి చేశాడు. నిశ్చయంగా, ఆయన మహా బలశాలి, శిక్ష విధించటంలో కఠినుడు. info
التفاسير:

external-link copy
23 : 40

وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰی بِاٰیٰتِنَا وَسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ۙ

మరియు వాస్తవంగా, మేము మూసాను మా సూచనలతో (ఆయాత్ లతో) మరియు స్పష్టమైన అధికారంతో పంపి ఉన్నాము; info
التفاسير:

external-link copy
24 : 40

اِلٰی فِرْعَوْنَ وَهَامٰنَ وَقَارُوْنَ فَقَالُوْا سٰحِرٌ كَذَّابٌ ۟

ఫిర్ఔన్, హామాన్ మరియు ఖారూన్ ల [1] వద్దకు! కాని వారు: "ఇతను మాంత్రికుడు, అసత్యవాది!" అని అన్నారు. info

[1] ఖారూన్, మొదట మూసా ('అ.స.) ను అనుసరించాడు. తరువాత అవిశ్వాసుడయ్యాడు. వివరాలకు చూడండి, 28:76. హామాన్, కొరకు చూడండి 28:6, అతడు ఫిర్'ఔన్ సభలో మంత్రిగా ఉండేవాడు.

التفاسير:

external-link copy
25 : 40

فَلَمَّا جَآءَهُمْ بِالْحَقِّ مِنْ عِنْدِنَا قَالُوا اقْتُلُوْۤا اَبْنَآءَ الَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ وَاسْتَحْیُوْا نِسَآءَهُمْ ؕ— وَمَا كَیْدُ الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ ۟

తరువాత అతను మా వద్ద నుండి సత్యాన్ని వారి ముందుకు తీసుకొని రాగా వారన్నారు: "ఇతనిని విశ్వసించే వారందరి పుత్రులను చంపండి మరియు వారి స్త్రీలను బ్రతకనివ్వండి." [1] కాని సత్యతిరస్కారుల పన్నాగాలు వ్యర్థమే అవుతాయి. info

[1] ఫిర్ఔ'న్, మూసా ('అ.స.) జన్మానికి ముందు కూడా తాను బానిసలుగా చేసి ఉంచిన బనీ-ఇస్రాయీ'ల్ సంతతి వారి మగ సంతానాన్ని పుట్టిన పెంటనే చంపిస్తూ ఉండేవాడు. ఎందుకంటే వారి సంతతిలోని బాలుడు అతని నాశనానికి కారకుడవుతాడని, అతనికి జ్యోతిష్యులు చెప్పి ఉంటారు. ఈసారి మూసా ('అ.స.) మరియు అతని సంతతి వారి మధ్య అవిశ్వాసం, కలహాలు రేకెత్తించే ఉద్దేశ్యంతో వారి పుత్రులను చంపమని ఆజ్ఞాపిస్తాడు. వారు పలికిన మాటలకు చూడండి, 7:129.

التفاسير: