Traduzione dei Significati del Sacro Corano - Traduzione in telugu - Abdul Rahim Bin Muhammed

Numero di pagina:close

external-link copy
6 : 11

وَمَا مِنْ دَآبَّةٍ فِی الْاَرْضِ اِلَّا عَلَی اللّٰهِ رِزْقُهَا وَیَعْلَمُ مُسْتَقَرَّهَا وَمُسْتَوْدَعَهَا ؕ— كُلٌّ فِیْ كِتٰبٍ مُّبِیْنٍ ۟

మరియు భూమిపై సంచరించే ప్రతి ప్రాణి జీవనోపాధి (బాధ్యత) అల్లాహ్ పైననే ఉంది. ఆయనకు దాని నివాసం, నివాసకాలం మరియు దాని అంతిమ నివాసస్థలమూ తెలుసు.[1] అంతా ఒక స్పష్టమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. info

[1] చూడండి, 6:98.

التفاسير:

external-link copy
7 : 11

وَهُوَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ فِیْ سِتَّةِ اَیَّامٍ وَّكَانَ عَرْشُهٗ عَلَی الْمَآءِ لِیَبْلُوَكُمْ اَیُّكُمْ اَحْسَنُ عَمَلًا ؕ— وَلَىِٕنْ قُلْتَ اِنَّكُمْ مَّبْعُوْثُوْنَ مِنْ بَعْدِ الْمَوْتِ لَیَقُوْلَنَّ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِیْنٌ ۟

మరియు ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. మరియు ఆయన సింహాసనం (అర్ష్) నీటి మీద ఉండెను. మీలో మంచిపనులు చేసేవాడు ఎవడో పరీక్షించటానికి (ఆయన ఇదంతా సృష్టించాడు). నీవు వారితో: "నిశ్చయంగా, మీరు మరణించిన తరువాత మరల లేపబడతారు." అని అన్నప్పుడు, సత్యతిరస్కారులు తప్పక అంటారు: "ఇది ఒక స్పష్టమైన మాయాజాలం మాత్రమే." info
التفاسير:

external-link copy
8 : 11

وَلَىِٕنْ اَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ اِلٰۤی اُمَّةٍ مَّعْدُوْدَةٍ لَّیَقُوْلُنَّ مَا یَحْبِسُهٗ ؕ— اَلَا یَوْمَ یَاْتِیْهِمْ لَیْسَ مَصْرُوْفًا عَنْهُمْ وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟۠

మరియు ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత కాలం[1] వరకు ఆపి ఉంచితే, వారు తప్పకుండా అంటారు: "దానిని ఆపుతున్నది ఏమిటీ?" వాస్తవానికి అది వచ్చిన రోజు, దానిని వారి నుండి తొలగించగల వారెవ్వరూ ఉండరు. మరియు వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే, వారిని క్రమ్ముకుంటుంది. info

[1] ఉమ్మతున్: ఇక్కడ కాలం, అనే అర్థంలో వాడబడింది. (ఫ'త్హ అల్ 'ఖదీర్). ఏ విధంగానైతే 12:45లో వాడబడిందో. 16:120లో ఈ పదం ఇమామ్, నాయకుడనే అర్థంలో మరియు 43:23లో ధర్మం అనే అర్థంలో మరియు 28:23, 7:159, 10:47లలో సమాజం, సంఘం, తెగ అనే అర్థాలలో వాడబడింది (ఇబ్నె-కసీ'ర్).

التفاسير:

external-link copy
9 : 11

وَلَىِٕنْ اَذَقْنَا الْاِنْسَانَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْنٰهَا مِنْهُ ۚ— اِنَّهٗ لَیَـُٔوْسٌ كَفُوْرٌ ۟

మరియు ఒకవేళ మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపించి, తరువాత అతని నుండి దానిని లాక్కుంటే! నిశ్చయంగా, అతడు నిరాశ చెంది, కృతఘ్నుడవుతాడు. info
التفاسير:

external-link copy
10 : 11

وَلَىِٕنْ اَذَقْنٰهُ نَعْمَآءَ بَعْدَ ضَرَّآءَ مَسَّتْهُ لَیَقُوْلَنَّ ذَهَبَ السَّیِّاٰتُ عَنِّیْ ؕ— اِنَّهٗ لَفَرِحٌ فَخُوْرٌ ۟ۙ

కాని ఒకవేళ మేము అతనికి ఆపద తరువాత, అనుగ్రహాన్ని రుచి చూపిస్తే: "నా ఆపదలన్నీ నా నుండి తొలగిపోయాయి!" అని అంటాడు. నిశ్చయంగా అతడు ఆనందంతో, విర్రవీగుతాడు. info
التفاسير:

external-link copy
11 : 11

اِلَّا الَّذِیْنَ صَبَرُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ ؕ— اُولٰٓىِٕكَ لَهُمْ مَّغْفِرَةٌ وَّاَجْرٌ كَبِیْرٌ ۟

కాని ఎవరైతే సహనం వహించి, సత్కార్యాలు చేస్తూ ఉంటారో, అలాంటి వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.[1] info

[1] చూడండి, 70:19-22 మరియు ముస్నద్ అ'హ్మద్, పు-3, పే. 4.

التفاسير:

external-link copy
12 : 11

فَلَعَلَّكَ تَارِكٌ بَعْضَ مَا یُوْحٰۤی اِلَیْكَ وَضَآىِٕقٌ بِهٖ صَدْرُكَ اَنْ یَّقُوْلُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَیْهِ كَنْزٌ اَوْ جَآءَ مَعَهٗ مَلَكٌ ؕ— اِنَّمَاۤ اَنْتَ نَذِیْرٌ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ وَّكِیْلٌ ۟ؕ

(ఓ ప్రవక్తా!) బహశా నీవు, నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీ) లోని కొంత భాగాన్ని విడిచి పెట్టనున్నావేమో! మరియు దానితో నీ హృదయానికి ఇబ్బంది కలుగుతుందేమో! ఎందుకంటే, (సత్యతిరస్కారులు): "ఇతనిపై ఒక నిధి ఎందుకు దింప బడలేదు? లేదా ఇతనితో బాటు ఒక దేవదూత ఎందుకు రాలేదు?" అని అంటున్నారని. నిశ్చయంగా, నీవైతే కేవలం హెచ్చరిక చేసే వాడవు మాత్రమే. మరియు అల్లాహ్ యే ప్రతిదాని కార్యసాధకుడు.[1] info

[1] చూడండి, 25:8, 6:8, 17:90-93, 6:50.

التفاسير: