Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano

Numero di pagina:close

external-link copy
32 : 9

یُرِیْدُوْنَ اَنْ یُّطْفِـُٔوْا نُوْرَ اللّٰهِ بِاَفْوَاهِهِمْ وَیَاْبَی اللّٰهُ اِلَّاۤ اَنْ یُّتِمَّ نُوْرَهٗ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ ۟

ఈ అవిశ్వాసపరులందరు,అవిశ్వాస ధర్మాల్లోంచి ఒక ధర్మం పై ఉన్న ఇతరులు తమ ఈ కట్టుకధల ద్వారా,ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని వచ్చిన దాన్ని వారి తిరస్కారము ద్వారా ఇస్లాం ను అంతమొందించాలని,దాన్ని అసత్యముగా చేయాలని,అల్లాహ్ యొక్క తౌహీదును నిరూపించటానికి అందులో వచ్చిన స్పష్టమైన వాదనలను,ఆధారాలను నసింపజేయాలని నిర్ణయించుకున్నారు.మరియు ఆయన ప్రవక్త తీసుకుని వచ్చినది సత్యము.మరియు పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ తన ధర్మమును పూర్తి చేయటమును,దాన్ని ఇతర వాటిపై ఆధిక్యతను,ఉన్నతను కలిగించటమును తప్ప మిగతా వాటిని కానివ్వడు.ఒక వేళ అవిశ్వాసపరులు ఆయన ధర్మమును పరిపూర్ణము చేయటమును,దానిని ఆధిక్యతనివ్వటమును,ఉన్నత స్థానమునకు చేర వేయటమును ఇష్టపడకపోయినా ఆల్లాహ్ దాన్ని పరిపూర్ణం చేసేవాడును,ఆధిక్యతను ఇచ్చేవాడును,ఉన్నత స్థానమును కలిగించే వాడును.అల్లాహ్ ఏ విషయమునైనా నిర్ణయించుకుంటే ఇతరవారి నిర్ణయం వృధా అయిపోతుంది. info
التفاسير:

external-link copy
33 : 9

هُوَ الَّذِیْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰی وَدِیْنِ الْحَقِّ لِیُظْهِرَهٗ عَلَی الدِّیْنِ كُلِّهٖ ۙ— وَلَوْ كَرِهَ الْمُشْرِكُوْنَ ۟

పరిశుద్ధుడైన అల్లాహ్ ఆయనే తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మానవులందరికి సన్మార్గమును చూపే ఖుర్ఆన్ ను,సత్య ధర్మమైన ఇస్లామును ఇచ్చి అందులో ఉన్న వాదనలు,ఆధారాలు,ఆదేశాల ద్వారా ఇతర ధర్మాలపై దానికి ఔన్నత్యాన్ని కలిగించటం కొరకు పంపించాడు.ఒక వేళ దాన్ని ముష్రికులు ఇష్టపడకపోయిన. info
التفاسير:

external-link copy
34 : 9

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنَّ كَثِیْرًا مِّنَ الْاَحْبَارِ وَالرُّهْبَانِ لَیَاْكُلُوْنَ اَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَیَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ— وَالَّذِیْنَ یَكْنِزُوْنَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا یُنْفِقُوْنَهَا فِیْ سَبِیْلِ اللّٰهِ ۙ— فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَلِیْمٍ ۟ۙ

ఓ విశ్వాసమును కనబరచి అల్లాహ్ తమ కొరకు ధర్మపరంగా చేసిన వాటిని పాటించేవారా, చాలా మంది యూదుల మతాచారులు,చాలా మంది క్రైస్తవుల సన్యాసులు ప్రజల సంపదలను ధర్మ హక్కు ప్రకారం కాకుండా తీసుకునేవారు.వారు వాటిని లంచముగా,ఇతరవిధముగా తీసుకునేవారు.మరియు వారు ప్రజలను అల్లాహ్ యొక్క ధర్మంలో ప్రవేశించటం నుండి ఆపేవారు.మరియు ఎవరైతే బంగారమును,వెండిని కూడబెట్టి తమపై విధి అయిన వాటి జకాతును చెల్లించలేదో ఓ ప్రవక్తా వారిని ప్రళయదినాన బాధ కలిగించే బాధాకరమైన శిక్ష గురించి సమాచారమివ్వండి. info
التفاسير:

external-link copy
35 : 9

یَّوْمَ یُحْمٰی عَلَیْهَا فِیْ نَارِ جَهَنَّمَ فَتُكْوٰی بِهَا جِبَاهُهُمْ وَجُنُوْبُهُمْ وَظُهُوْرُهُمْ ؕ— هٰذَا مَا كَنَزْتُمْ لِاَنْفُسِكُمْ فَذُوْقُوْا مَا كُنْتُمْ تَكْنِزُوْنَ ۟

ప్రళయదినాన వారు కూడబెట్టి దాని హక్కును ఆపిన సొమ్ము నరకాగ్నిలో కాల్చబడుతుంది.వాటి వేడి తీవ్రమైనప్పుడు అవి వారి నుదురులపై,వారి ప్రక్కలపై,వారి వీపులపై పెట్టబడుతాయి.మరియు వారిని మందలిస్తూ వారితో ఇలా పలకబడుతుంది : ఇవి మీ ఆ సంపదలు వేటినైతే మీరు కూడబెట్టి వాటి విషయంలో విధి అయిన హక్కులను నిర్వర్తించలేదో.అయితే మీరు ఏదైతే కూడబెట్టి దాని హక్కును నిర్వర్తించలేదో దాని దుష్ఫలితాన్ని,దాని పరిణామాన్ని చవిచూడండి. info
التفاسير:

external-link copy
36 : 9

اِنَّ عِدَّةَ الشُّهُوْرِ عِنْدَ اللّٰهِ اثْنَا عَشَرَ شَهْرًا فِیْ كِتٰبِ اللّٰهِ یَوْمَ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ مِنْهَاۤ اَرْبَعَةٌ حُرُمٌ ؕ— ذٰلِكَ الدِّیْنُ الْقَیِّمُ ۙ۬— فَلَا تَظْلِمُوْا فِیْهِنَّ اَنْفُسَكُمْ ۫— وَقَاتِلُوا الْمُشْرِكِیْنَ كَآفَّةً كَمَا یُقَاتِلُوْنَكُمْ كَآفَّةً ؕ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ ۟

నిశ్చయంగా సంవత్సరపు నెలల లెక్క అల్లాహ్ ఆదేశములో,ఆయన నిర్ణయంలో ఆయన మొదట భూమ్యాకాశాలను సృష్టించినప్పటి నుంచి లౌహె మహ్ఫూజ్ లో అల్లాహ్ పొందుపరచిన వాటిలో పన్నెండు కలదు.ఈ పన్నెండు నెలల్లోంచి నాలుగు నెలల్లో అల్లాహ్ వాటిలో యుద్ధం చేయటమును నిషేధించాడు.అవి మూడు వివరణగా (జులా ఖాదతి,జుల్ హిజ్జతి మరియు ముహర్రమ్) మరియు ఒకటి వేరుగా అది (రజబ్).ఈ ప్రస్తావించబడిన సంవత్సర నెలల లెక్క,వాటిలోంచి నాలుగింటి నిషేధము అదే సక్రమమైన ధర్మము.అయితే మీరు వాటిలో యుద్ధాలు చేసి,వాటిని అగౌరవపాలు చేసి ఈ నిషిద్ధమాసముల్లో మీపై హింసకు పాల్పడకండి.మరియు ఏ విధంగా నైతే ముష్రికులందరు కలిసి మీతో యుద్ధం చేస్తున్నారో ఆ విధంగా మీరందరు కలిసి ముష్రికులతో యుద్ధం చేయండి.మరియు అల్లాహ్ ఎవరైతే ఆయన ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయన భీతిని కలిగి ఉంటారో వారికి విజయమును కలిగించి,స్థిరత్వమును ప్రసాధించి తోడుగా ఉంటాడని మీరు తెలుసుకోండి.అల్లాహ్ ఎవరికి తోడుగా ఉంటాడో వారిపై ఎవరూ గెలవలేరు. info
التفاسير:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• دين الله ظاهر ومنصور مهما سعى أعداؤه للنيل منه حسدًا من عند أنفسهم.
అల్లాహ్ శతృవులు తమ తరుపునుండి అసూయతో ధర్మమును అపనిందపాలు చేయటానికి ప్రయత్నము చేసినప్పుడల్లా అల్లాహ్ ధర్మము ఆధిక్యతను చూపుతుంది,సహాయం చేయబడుతుంది. info

• تحريم أكل أموال الناس بالباطل، والصد عن سبيل الله تعالى.
ప్రజల సొమ్మును దుర్మార్గంతో తినటం,మహోన్నతుడైన అల్లాహ్ మార్గము నుండి ఆపటం నిషేధము. info

• تحريم اكتناز المال دون إنفاقه في سبيل الله.
ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టకుండా కూడబెట్టటం నిషేధము. info

• الحرص على تقوى الله في السر والعلن، خصوصًا عند قتال الكفار؛ لأن المؤمن يتقي الله في كل أحواله.
రహస్యంగా,బహిర్గంగా అల్లాహ్ కు భయపడటం పై ప్రోత్సహించటం,ప్రత్యేకించి అవిశ్వాసపరులతో యుద్ధం చేసే సమయంలో.ఎందుకంటే విశ్వాసపరుడు తన పరిస్థితులన్నింటిలో అల్లాహ్ కు భయపడుతూ ఉంటాడు. info