Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano

అల్-ఇన్సాన్

Alcuni scopi di questa Sura comprendono:
تذكير الإنسان بأصل خلقه، ومصيره، وبيان ما أعد الله في الجنة لأوليائه.
మానవుని సృష్టి మూలమును మరియు అతని పరిణామము గురించి అతనికి గుర్తు చేయడం మరియు అల్లాహ్ తన స్నేహితుల కొరకు స్వర్గంలో ఏమి సిద్ధం చేసి ఉంచాడో ప్రకటించడం. info

external-link copy
1 : 76

هَلْ اَتٰی عَلَی الْاِنْسَانِ حِیْنٌ مِّنَ الدَّهْرِ لَمْ یَكُنْ شَیْـًٔا مَّذْكُوْرًا ۟

మానవునిపై ఒక సుదీర్ఝ కాలం గడిచినది అందులో అతడు తనకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్నాడు. info
التفاسير:

external-link copy
2 : 76

اِنَّا خَلَقْنَا الْاِنْسَانَ مِنْ نُّطْفَةٍ اَمْشَاجٍ ۖۗ— نَّبْتَلِیْهِ فَجَعَلْنٰهُ سَمِیْعًا بَصِیْرًا ۟ۚ

నిశ్చయంగా మేము మానవుడిని పురుషుని యొక్క నీరు మరియు స్త్రీ యొక్క నీటి మధ్య ఒక మిశ్రమ బిందువుతో సృష్టించాము. మేము అతన్ని అతనిపై వేసిన బాధ్యతల ద్వారా పరీక్షిస్తాము. మేము అతన్ని వినేవాడిగా చూసేవాడిగా చేశాము అతనిపై మేము వేసిన ధర్మ బాధ్యతలను అతను నెరవేర్చటానికి. info
التفاسير:

external-link copy
3 : 76

اِنَّا هَدَیْنٰهُ السَّبِیْلَ اِمَّا شَاكِرًا وَّاِمَّا كَفُوْرًا ۟

నిశ్చయంగా మేము అతనికి సన్మార్గమును మా ప్రవక్తల నోట స్పష్టపరచాము. దాని ద్వారా అతనికి అపమార్గము స్పష్టమైనది. కావున అతను దీని తరువాత సన్మార్గము కొరకు మార్గదర్శకం పొందాలి. అప్పుడు అతను అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకునే విశ్వాసపర దాసుడవుతాడు. లేదా అతను దాని నుండి మార్గభ్రష్టత పొందాలి అప్పుడు అతను అల్లాహ్ ఆయతులను తిరస్కరించే నిరాకరించే దాసుడవుతాడు. info
التفاسير:

external-link copy
4 : 76

اِنَّاۤ اَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ سَلٰسِلَاۡ وَاَغْلٰلًا وَّسَعِیْرًا ۟

నిశ్చయంగా మేము అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కొరకు గొలుసులను సిద్ధం చేసి ఉంచాము వాటి ద్వారా వారు నరకంలో ఈడ్చబడుతారు. మరియు మెడలో వేసే పట్టాలను సిద్ధం చేశాము వాటి ద్వారా వారు అందులో బంధించబడుతారు. మరియు దహించివేసే అగ్నిని సిద్ధం చేశాము. info
التفاسير:

external-link copy
5 : 76

اِنَّ الْاَبْرَارَ یَشْرَبُوْنَ مِنْ كَاْسٍ كَانَ مِزَاجُهَا كَافُوْرًا ۟ۚ

నిశ్చయంగా అల్లాహ్ కొరకు విధేయత చూపే విశ్వాసపరులు ప్రళయదినమున మంచి వాసన కొరకు కర్పూరముతో కలుపబడిన మధు పానియంతో ఉన్న పాత్రలను సేవిస్తారు. info
التفاسير:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• خطر حب الدنيا والإعراض عن الآخرة.
ప్రాపంచిక వ్యామోహం మరియు పరలోకము నుండి విముఖత యొక్క ప్రమాదం. info

• ثبوت الاختيار للإنسان، وهذا من تكريم الله له.
మానవునికి ఎంపిక చేసుకునే అధికారము నిరూపణ. మరియు ఇది అతనికి అల్లాహ్ మర్యాదలోంచిది. info

• النظر لوجه الله الكريم من أعظم النعيم.
గౌరవోన్నతుడైన అల్లాహ్ ముఖ దర్శనము గొప్ప అనుగ్రహాల్లోంచిది. info