Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano

Numero di pagina:close

external-link copy
50 : 40

قَالُوْۤا اَوَلَمْ تَكُ تَاْتِیْكُمْ رُسُلُكُمْ بِالْبَیِّنٰتِ ؕ— قَالُوْا بَلٰی ؕ— قَالُوْا فَادْعُوْا ۚ— وَمَا دُعٰٓؤُا الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ ۟۠

నరకము యొక్క సంరక్షకులు అవిశ్వాసపరులను ఖండిస్తూ ఇలా పలుకుతారు : ఏమీ మీ వద్దకు మీ ప్రవక్తలు స్పష్టమైన ఆధారములను మరియు సూచనలను తీసుకుని రాలేదా ?!. అప్పుడు అవిశ్వాసపరులు ఎందుకు కాదు వారు మా వద్దకు స్పష్టమైన ఆధారములను మరియు వాదనలను తీసుకుని వచ్చారు. పరిరక్షకులు వారిపై వ్యంగ్యంగా ఇలా పలికారు : అయితే మీరే వేడుకోండి. మేము మాత్రం అవిశ్వాసపరుల కొరకు సిఫారసు చేయము. మరియు అవిశ్వాసపరుల దుఆ మాత్రం వారి అవిశ్వాసం కారణం చేత స్వీకరించకపోవటం వలన నిర్వీర్యం మరియు వృధా అయింది. info
التفاسير:

external-link copy
51 : 40

اِنَّا لَنَنْصُرُ رُسُلَنَا وَالَّذِیْنَ اٰمَنُوْا فِی الْحَیٰوةِ الدُّنْیَا وَیَوْمَ یَقُوْمُ الْاَشْهَادُ ۟ۙ

నిశ్చయంగా మేము మా ప్రవక్తలను మరియు అల్లాహ్ ను ఆయన ప్రవక్తలను విశ్వసించినవారిని ఇహలోకంలో వారి వాదనలకు ఆధిక్యతను కలిగించి మరియు వారి శతృవులకు వ్యతిరేకంగా వారికి తోడ్పాటును కలిగించి సహాయపడుతాము. మరియు మేము వారికి ప్రళయదినమున వారిని స్వర్గంలో ప్రవేశింపజేసి ఇహలోకములో వారి ప్రత్యర్దులైన వారిని ఇహలోకంలో శిక్షించి మరియు దైవప్రవక్తలు, దైవదూతలు మరియు విశ్వాసపరులు సందేశప్రచారము,జాతులవారి తిరస్కారముపై సాక్ష్యం పలికిన తరువాత నరకములో ప్రవేశింపజేసి సహాయపడుతాము. info
التفاسير:

external-link copy
52 : 40

یَوْمَ لَا یَنْفَعُ الظّٰلِمِیْنَ مَعْذِرَتُهُمْ وَلَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوْٓءُ الدَّارِ ۟

ఆ రోజు అవిశ్వాసము మరియు పాపకార్యముల ద్వారా తమ స్వయం పై హింసకు పాల్పడిన వారికి వారి హింస నుండి వారి క్షమాపణ ప్రయోజనం కలిగించదు. ఆ రోజున వారికి అల్లాహ్ కారుణ్యము నుండి గెంటివేయటం జరుగుతుంది. మరియు వారి కొరకు వారు పొందే బాధాకరమైన శిక్ష ద్వారా పరలోకములో చెడ్డ నివాసము కలదు. info
التفاسير:

external-link copy
53 : 40

وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْهُدٰی وَاَوْرَثْنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ الْكِتٰبَ ۟ۙ

మరియు నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాంకు జ్ఞానమును ప్రసాదించాము దాని ద్వారా ఇస్రాయీల్ సంతతి వారు సత్యము వైపునకు మార్గమును పొందుతారు. మరియు మేము తౌరాత్ ను ఇస్రాయీల్ సంతతి వారిలో వాస్తవ పుస్తకంగా చేశాము ఒక తరం తరువాత ఒక తరం వారు దానికి వారసులవుతారు. info
التفاسير:

external-link copy
54 : 40

هُدًی وَّذِكْرٰی لِاُولِی الْاَلْبَابِ ۟

సరైన బుద్ధులు కల వారి కొరకు సత్య మార్గము వైపునకు మార్గదర్శకత్వంగా మరియు హితోపదేశంగా. info
التفاسير:

external-link copy
55 : 40

فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّاسْتَغْفِرْ لِذَنْۢبِكَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِیِّ وَالْاِبْكَارِ ۟

ఓ ప్రవక్త మీరు మీ జాతి వారి తిరస్కారము మరియు వారి బాధ పెట్టటం నుండి మీరు పొందిన దానిపై సహనం చూపండి. నిశ్చయంగా మీ కొరకు సహాయము మరియు తోడ్పాటు ద్వారా అల్లాహ్ వాగ్దానము సత్యము,అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మీరు మీ పాపముల కొరకు మన్నింపును వేడుకోండి. మరియు మీరు దినము మొదటి వేళలో,దాని చివరి వేళలో మీ ప్రభువు యొక్క స్థుతులతో పరిశుద్ధతను కొనియాడండి. info
التفاسير:

external-link copy
56 : 40

اِنَّ الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ بِغَیْرِ سُلْطٰنٍ اَتٰىهُمْ ۙ— اِنْ فِیْ صُدُوْرِهِمْ اِلَّا كِبْرٌ مَّا هُمْ بِبَالِغِیْهِ ۚ— فَاسْتَعِذْ بِاللّٰهِ ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟

నిశ్ఛయంగా ఎవరైతే అల్లాహ్ ఆయతుల విషయంలో వాటిని నిర్వీర్యం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఎటువంటి వాదన మరియు ఆధారం లేకుండా వాదులాడుతున్నారో వారికి దానిపై ప్రేరేపిస్తున్నది మాత్రం సత్యంపై గర్వము అహంకారము. వారు కోరుకుంటున్న దాని పై గర్వమునకు వారు చేరుకోరంటే చేరుకోరు. ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ ను (మార్గంను) గట్టిగా పట్టుకోండి. నిశ్చయంగా ఆయన తన దాసుల మాటలను వినేవాడు మరియు వారి కర్మలను వీక్షించేవాడు. వాటిలో నుండి ఏదీ ఆయన నుండి తప్పిపోదు. మరియు ఆయన వారికి వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. info
التفاسير:

external-link copy
57 : 40

لَخَلْقُ السَّمٰوٰتِ وَالْاَرْضِ اَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟

ఆకాశములను మరియు భూమిని వాటి పరిమాణం వలన మరియు వాటి వెడల్పు వలన సృష్టించటం ప్రజలను సృష్టించటం కన్న ఎంతో గొప్ప విషయం. మరియు ఎవరైతే అవి పెద్దవిగా ఉండినా కూడా సృష్టించాడో మృతులను వారి సమాదుల నుండి వారి లెక్క తీసుకుని వారికి ప్రతిఫలమును ప్రసాదించటానికి జీవింపజేసి మరల లేపటంపై సామర్ధ్యమును కలవాడు. కానీ చాలా మంది ప్రజలకి తెలియదు. దాని నుండి వారు గుణపాఠం నేర్చుకోవటం లేదు. మరియు అది స్పష్టమైనా కూడా దాన్ని వారు మరణాంతరం లేపబడటంపై ఆధారంగా చేసుకోవటంలేదు. info
التفاسير:

external-link copy
58 : 40

وَمَا یَسْتَوِی الْاَعْمٰی وَالْبَصِیْرُ ۙ۬— وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَلَا الْمُسِیْٓءُ ؕ— قَلِیْلًا مَّا تَتَذَكَّرُوْنَ ۟

మరియు ఎవరైతే చూడలేడో, ఎవరైతే చూడగలడో ఇద్దరు సమానులు కారు. మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కలిగి ఉండి, ఆయన ప్రవక్తను నిజమని నమ్మి, తమ కర్మలను మంచిగా చేస్తారో వారు మరియు వారితో పాటు ఎవరి ఆచరణ అయితే దురవిశ్వాసము,పాపకార్యముల వలన చెడుగా ఉంటుందో సమానులు కారు. మీరు మాత్రం చాలా తక్కువ హితోపదేశం గ్రహిస్తారు. ఒక వేళ మీరు హితోపదేశం గ్రహిస్తే మీరు రెండు వర్గముల మధ్య వ్యత్త్యాసమును తెలుసుకుని మీరు ఎవరైతే విశ్వసించి అల్లాహ్ మన్నతను ఆశిస్తూ సత్కర్మలు చేస్తారో వారిలో నుండి అయిపోవటానికి ప్రయత్నిస్తారు. info
التفاسير:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• نصر الله لرسله وللمؤمنين سُنَّة إلهية ثابتة.
అల్లాహ్ యొక్క సహాయము తన ప్రవక్త కొరకు మరియు విశ్వాసపరుల కొరకు దైవ సంప్రదాయము నిరూపితమైనది. info

• اعتذار الظالم يوم القيامة لا ينفعه.
ప్రళయదినమున దుర్మార్గుడు క్షమాపణ కోరటం అతనికి ప్రయోజనం కలిగంచదు. info

• أهمية الصبر في مواجهة الباطل.
అసత్యమును ఎదుర్కోవటంలో సహనం చూపటం యొక్క ప్రాముఖ్యత. info

• دلالة خلق السماوات والأرض على البعث؛ لأن من خلق ما هو عظيم قادر على إعادة الحياة إلى ما دونه.
ఆకాశములను మరియు భూమిని సృష్టించటం మరణాంతరం లేపబడటం పై ఒక సూచన. ఎందుకంటే ఎవరైతే గొప్పదైన దాన్ని సృష్టిస్తాడో వేరే వాటికి జీవనమును మరలించటం పై సామర్ధ్యం కలవాడు. info