Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano

Numero di pagina:close

external-link copy
166 : 3

وَمَاۤ اَصَابَكُمْ یَوْمَ الْتَقَی الْجَمْعٰنِ فَبِاِذْنِ اللّٰهِ وَلِیَعْلَمَ الْمُؤْمِنِیْنَ ۟ۙ

ఉహద్ యుద్దంలో మీకు మరియు ముష్రికులైన శత్రువులకు మధ్య. యుద్దం జరిగినప్పుడు మీకు కలిగిన మరణాలు,గాయాలు,ఓటమి’అల్లాహ్ అనుమతితో మరియు ఆయన వ్రాసిన విధి ప్రకారం జరిగింది,గొప్ప వివేకం అందులో దాగిఉంది తద్వారా సత్యవంతులైన విశ్వాసులు ఎవరు అనేది స్పష్టమవుతుంది. info
التفاسير:

external-link copy
167 : 3

وَلِیَعْلَمَ الَّذِیْنَ نَافَقُوْا ۖۚ— وَقِیْلَ لَهُمْ تَعَالَوْا قَاتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ اَوِ ادْفَعُوْا ؕ— قَالُوْا لَوْ نَعْلَمُ قِتَالًا لَّاتَّبَعْنٰكُمْ ؕ— هُمْ لِلْكُفْرِ یَوْمَىِٕذٍ اَقْرَبُ مِنْهُمْ لِلْاِیْمَانِ ۚ— یَقُوْلُوْنَ بِاَفْوَاهِهِمْ مَّا لَیْسَ فِیْ قُلُوْبِهِمْ ؕ— وَاللّٰهُ اَعْلَمُ بِمَا یَكْتُمُوْنَ ۟ۚ

కపటవాదులు బయటపడ్డారు వారితో ఇలా చెప్పినప్పుడు: ‘అల్లాహ్ కొరకు పోరాడండి,లేదా మీరు ముస్లింలను రక్షించండి. వారు సమాధానమిస్తూ ఇలా అన్నారు : యుద్దం జరుగుతుందని మాకు తెలిస్తే,మేము మిమ్మల్ని ఖచ్చితంగా అనుసరించేవారము. కాని మీకు మరియు శత్రువులకు మధ్య యుద్దం జరుగుతుందని మేము భావించలేదు. వారు ఆ సమయంలో కలిగి ఉన్న స్థితి విశ్వాసం కంటే అవిశ్వాసాన్ని అధికంగా సూచిస్తుంది. వారి మనసులో లేనిదాన్నివారు తమ నోటితో చెప్పసాగారు. తమ మదిలో వారు దాస్తున్న విషయాల గురించి అల్లాహ్’కు చాలా బాగా తెలుసు. త్వరలోనే దానికి బదులుగా వారిని శిక్షిస్తాడు. info
التفاسير:

external-link copy
168 : 3

اَلَّذِیْنَ قَالُوْا لِاِخْوَانِهِمْ وَقَعَدُوْا لَوْ اَطَاعُوْنَا مَا قُتِلُوْا ؕ— قُلْ فَادْرَءُوْا عَنْ اَنْفُسِكُمُ الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

ధర్మపోరాటం నుండి వెనుకుండి నిష్క్రమించిన వారు ఉహద్ యుద్దంలో గాయపడిన తమబంధువులతో ఇలా అన్నారు : ఒకవేళ వారు మాకు విధేయత చూపుతూ యుద్దానికి వెళ్ళియుండకపోతే చంపబడేవారు కాదు.-ఓ ప్రవక్త- మీరు వారిని ఖండిస్తూ చెప్పండి :-‘ఒకవేళ మీరు చేసిన వాదనలో సంత్యవంతులైతే,అనగా -ఎవరైతే మీకు విధేయత చూపుతూ మీతో పాటు కూర్చుని ఉంటే చనిపోయేవారు కాదు’అని’మరియు దైవమార్గంలో చేసే జిహాదు నుంచి వెనక కూర్చుండిపోవడమే మీరు బ్రతికిపోవడానికి అసలు కారణమైతే ‘మరణం’ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోండి! info
التفاسير:

external-link copy
169 : 3

وَلَا تَحْسَبَنَّ الَّذِیْنَ قُتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ اَمْوَاتًا ؕ— بَلْ اَحْیَآءٌ عِنْدَ رَبِّهِمْ یُرْزَقُوْنَ ۟ۙ

మరియు -ఓ ప్రవక్త – దైవమార్గంలో పోరాడుతూ జిహాద్లో చంపబడినవారు మృతిచెందారని అనుకోకండి. వారు సజీవులుగా ఉన్నారు, తమప్రభువు వద్ద గౌరవనీయమైన గృహంలో ప్రత్యేకమైన జీవితాన్ని గడుపుతున్నారు. రకరకాల అనుగ్రహాలు వారికి ప్రసాదించబడుతున్నాయి,అవి ఏమిటో అల్లాహ్’కు తప్ప ఎవరికి తెలియదు. info
التفاسير:

external-link copy
170 : 3

فَرِحِیْنَ بِمَاۤ اٰتٰىهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ۙ— وَیَسْتَبْشِرُوْنَ بِالَّذِیْنَ لَمْ یَلْحَقُوْا بِهِمْ مِّنْ خَلْفِهِمْ ۙ— اَلَّا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟ۘ

అల్లాహ్ తన దయతో వారిపై చూపిన అనుగ్రహంతో వారు ఆనందంతో మునిగిపోయారు,సంతోషం వారిని కప్పివేసింది. ఈ ప్రపంచంలో ఉండిపోయిన సోదరులు కూడా తమతో చేరాలని వారు ఆశిస్తు ఎదురు చూస్తున్నారు,జిహాద్’లో వీరుకూడా చంపబడితే వారి మాదిరిగానే దైవానుగ్రహాన్ని పొందుతారు,పరలోకంలో ఎదురయ్యే సమస్యల పట్ల వారికి ఎలాంటి చింతలేదు,మరియు ప్రపంచంలో కోల్పోయిన తమ సంపద పట్ల ఎలాంటి ఆందోళన వారికి ఉండదు. info
التفاسير:

external-link copy
171 : 3

یَسْتَبْشِرُوْنَ بِنِعْمَةٍ مِّنَ اللّٰهِ وَفَضْلٍ ۙ— وَّاَنَّ اللّٰهَ لَا یُضِیْعُ اَجْرَ الْمُؤْمِنِیْنَ ۟

వారు అల్లాహ్ నుండి ఆశించిన ఈ గొప్ప బహుమతి మరియు అదనంగా లభించిన గొప్ప ప్రతిఫలం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ విశ్వాసుల పుణ్యఫలాలను వ్యర్థం కానివ్వడు,బదులుగా ఆయన వారికి సంపూర్ణంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు మరియు దానిలో అభివృద్దిని ఒసగుతాడు. info
التفاسير:

external-link copy
172 : 3

اَلَّذِیْنَ اسْتَجَابُوْا لِلّٰهِ وَالرَّسُوْلِ مِنْ بَعْدِ مَاۤ اَصَابَهُمُ الْقَرْحُ ۛؕ— لِلَّذِیْنَ اَحْسَنُوْا مِنْهُمْ وَاتَّقَوْا اَجْرٌ عَظِیْمٌ ۟ۚ

జిహాదు కొరకు అల్లాహ్ మార్గంలో ఉహద్ యుద్దం తరువాత జరిగిన ‘హమ్రాఉల్ అసద్’యుద్దంలో బహుదైవారాధకుల్లోని శత్రువులతో పోరాటానికి బయల్దేరమని ప్రకటించినప్పుడు,ఉహద్ యుద్దంలో గాయపడినప్పటికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞకు బదులిస్తూ ప్రతిస్పందించారు,వారిగాయాలు అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క ప్రకటన నుండి ఆచరణల పరంగా ఉత్తములైన వారిని నిరోధించలేదు అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,నిషేధాలకు దూరంగా ఉంటూ భయభీతి చెందే వారికి గొప్ప బహుమతి ఉంది,అదియే స్వర్గము. info
التفاسير:

external-link copy
173 : 3

اَلَّذِیْنَ قَالَ لَهُمُ النَّاسُ اِنَّ النَّاسَ قَدْ جَمَعُوْا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ اِیْمَانًا ۖۗ— وَّقَالُوْا حَسْبُنَا اللّٰهُ وَنِعْمَ الْوَكِیْلُ ۟

కొంతమంది బహుదైవారాధకులు వారితో చెప్పారు : నిశ్చయంగా ఖురైష్ తెగవారు ‘అబూసుఫ్యాన్’ నాయకత్వంలో యుద్దం చేయడానికి మీ అందరినీ హతమార్చడానికి ఒక పెద్ద సమూహాన్ని ఏర్పాటుచేసుకున్నారు,వారితో జాగ్రత్తగా ఉండండి,వారితో యుద్దం చేయటం నుండి జాగ్రత్తపడండి,అప్పుడు ఈ మాటలు,బెదిరింపులు అల్లాహ్ పట్ల వారికి గల విశ్వాసాన్ని మరియు ఆయన వాగ్దానం పట్ల నమ్మకాన్ని పెంచాయి,వెంటనే వారితో యుద్దం చేయడానికి బయల్దేరుతూ ఇలా అన్నారు:- మహోన్నతుడైన అల్లాహ్’యే మాకు చాలు,ఆయన మా వ్యవహారాలను ఎంతో ఉత్తమంగా నిర్వహిస్తాడు. info
التفاسير:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• من سنن الله تعالى أن يبتلي عباده؛ ليتميز المؤمن الحق من المنافق، وليعلم الصادق من الكاذب.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన దాసులను విపత్తులకు గురిచేసి పరీక్షించడం”ఆయన సాంప్రదాయంలోనిది, తద్వారా కపటవాదుల నుండి సత్యవంతులైన విశ్వాసులను వేరుచేయబడుతుంది,మరియు అసత్యవంతుల నుండి సత్యవంతులెవరూ అని తెలుసుకోబడుతుంది. info

• عظم منزلة الجهاد والشهادة في سبيل الله وثواب أهله عند الله تعالى حيث ينزلهم الله تعالى بأعلى المنازل.
అల్లాహ్ మార్గంలో జిహాదు మరియు షహాదతు(అమరత్వం) యొక్క గొప్పతనం మరియు మహోన్నతుడైన అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం’ ‘అల్లాహ్ వారికి ఎత్తైనఅంతస్తుల్లో కల్పించే నివాసంద్వారా’స్పష్టమవుతుంది. info

• فضل الصحابة وبيان علو منزلتهم في الدنيا والآخرة؛ لما بذلوه من أنفسهم وأموالهم في سبيل الله تعالى.
సహచరుల(సహబాల)విశిష్టత మరియు ఇహపరలోకాల్లో వారికి గల ఉన్నత స్థాయి గురించి ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో సహచరుల విశిష్టత మరియు వారి ఉన్నత స్థితి తెలియజేయబడింది;ఎందుకంటే వారు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిమిత్తం తమప్రాణాలను మరియు సంపదను ఖర్చు చేశారు. info