કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અનુવાદ - અબ્દુર રહીમ બિન્ મુહમ્મદ

પેજ નંબર:close

external-link copy
128 : 4

وَاِنِ امْرَاَةٌ خَافَتْ مِنْ بَعْلِهَا نُشُوْزًا اَوْ اِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَیْهِمَاۤ اَنْ یُّصْلِحَا بَیْنَهُمَا صُلْحًا ؕ— وَالصُّلْحُ خَیْرٌ ؕ— وَاُحْضِرَتِ الْاَنْفُسُ الشُّحَّ ؕ— وَاِنْ تُحْسِنُوْا وَتَتَّقُوْا فَاِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرًا ۟

మరియు ఒకవేళ స్త్రీ తన భర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖుడవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ మధ్య రాజీ చేసుకుంటే! వారిపై ఎలాంటి దోషం లేదు. రాజీ పడటం ఎంతో ఉత్తమమైనది. మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడి వున్నది. మీరు సజ్జనులై దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును. info
التفاسير:

external-link copy
129 : 4

وَلَنْ تَسْتَطِیْعُوْۤا اَنْ تَعْدِلُوْا بَیْنَ النِّسَآءِ وَلَوْ حَرَصْتُمْ فَلَا تَمِیْلُوْا كُلَّ الْمَیْلِ فَتَذَرُوْهَا كَالْمُعَلَّقَةِ ؕ— وَاِنْ تُصْلِحُوْا وَتَتَّقُوْا فَاِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِیْمًا ۟

మరియు మీరు ఎంత కోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి, మరొకామెను డోలాయమాన స్థితిలో వదలకండి. మీరు మీ ప్రవర్తనను సరి జేసుకొని దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. info
التفاسير:

external-link copy
130 : 4

وَاِنْ یَّتَفَرَّقَا یُغْنِ اللّٰهُ كُلًّا مِّنْ سَعَتِهٖ ؕ— وَكَانَ اللّٰهُ وَاسِعًا حَكِیْمًا ۟

కాని ఒకవేళ వారు (దంపతులు) విడిపోతే! అల్లాహ్ తన దాతృత్వంతో వారిలో ప్రతి ఒక్కరినీ, స్వయం సమృద్ధులుగా చేయవచ్చు! మరియు అల్లాహ్! సర్వవ్యాప్తి (సర్వోపగతుడు), మహా వివేచనాపరుడు. info
التفاسير:

external-link copy
131 : 4

وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَلَقَدْ وَصَّیْنَا الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ وَاِیَّاكُمْ اَنِ اتَّقُوا اللّٰهَ ؕ— وَاِنْ تَكْفُرُوْا فَاِنَّ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَكَانَ اللّٰهُ غَنِیًّا حَمِیْدًا ۟

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు చెందినదే. మరియు వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము. మరియు ఒకవేళ మీరు తిరస్కరిస్తే భూమ్యాకాశాలలో ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ కే చెందినది. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు. info
التفاسير:

external-link copy
132 : 4

وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَكَفٰی بِاللّٰهِ وَكِیْلًا ۟

మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు! info
التفاسير:

external-link copy
133 : 4

اِنْ یَّشَاْ یُذْهِبْكُمْ اَیُّهَا النَّاسُ وَیَاْتِ بِاٰخَرِیْنَ ؕ— وَكَانَ اللّٰهُ عَلٰی ذٰلِكَ قَدِیْرًا ۟

ఓ మానవులారా! ఆయన కోరితే, మిమ్మల్ని అంతం చేసి ఇతరులను తేగలడు. మరియు వాస్తవానికి, అల్లాహ్ ఇలా చేయగల సమర్ధుడు.[1] info

[1] చూడండి, 47:38.

التفاسير:

external-link copy
134 : 4

مَنْ كَانَ یُرِیْدُ ثَوَابَ الدُّنْیَا فَعِنْدَ اللّٰهِ ثَوَابُ الدُّنْیَا وَالْاٰخِرَةِ ؕ— وَكَانَ اللّٰهُ سَمِیْعًا بَصِیْرًا ۟۠

ఎవడు ఇహలోక ఫలితాన్ని కోరుతాడో, (వానికదే దొరుకుతుంది). కాని (కేవలం) అల్లాహ్ వద్దనే ఇహలోక మరియు పరలోక ఫలితాలున్నాయి. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. info
التفاسير: