કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અનુવાદ - અબ્દુર રહીમ બિન્ મુહમ્મદ

પેજ નંબર:close

external-link copy
95 : 4

لَا یَسْتَوِی الْقٰعِدُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ غَیْرُ اُولِی الضَّرَرِ وَالْمُجٰهِدُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ ؕ— فَضَّلَ اللّٰهُ الْمُجٰهِدِیْنَ بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ عَلَی الْقٰعِدِیْنَ دَرَجَةً ؕ— وَكُلًّا وَّعَدَ اللّٰهُ الْحُسْنٰی ؕ— وَفَضَّلَ اللّٰهُ الْمُجٰهِدِیْنَ عَلَی الْقٰعِدِیْنَ اَجْرًا عَظِیْمًا ۟ۙ

ఎలాంటి కారణం లేకుండా, ఇంటి వద్ద కూర్చుండిపోయే విశ్వాసులు మరియు అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని మరియు తమ ప్రాణాన్ని వినియోగించి ధర్మయుద్ధం (జిహాద్) చేసే విశ్వాసులతో సరిసమానులు కాజాలరు. తమ ధనాన్ని, ప్రాణాన్ని వినియోగించి ధర్మయుద్ధం (జిహాద్) చేసేవారి స్థానాన్ని అల్లాహ్! ఇంట్లో కూర్చుండి పోయే వారి స్థానం కంటే, ఉన్నతం చేశాడు. మరియు అల్లాహ్ ప్రతి ఒక్కరికి ఉత్తమ ఫలితపు వాగ్దానం చేశాడు. కానీ అల్లాహ్ ధర్మయుద్ధం (జిహాద్) చేసిన వారికి ఇంట్లో కూర్చున్న వారి కంటే ఎంతో గొప్ప ప్రతిఫలమిచ్చి, ఆధిక్యత నిచ్చాడు. info
التفاسير:

external-link copy
96 : 4

دَرَجٰتٍ مِّنْهُ وَمَغْفِرَةً وَّرَحْمَةً ؕ— وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۟۠

వారి కొరకు, ఆయన తరఫు నుండి ఉన్నత స్థానాలు, క్షమాభిక్ష మరియు కారుణ్యాలు కూడా ఉంటాయి. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. info
التفاسير:

external-link copy
97 : 4

اِنَّ الَّذِیْنَ تَوَفّٰىهُمُ الْمَلٰٓىِٕكَةُ ظَالِمِیْۤ اَنْفُسِهِمْ قَالُوْا فِیْمَ كُنْتُمْ ؕ— قَالُوْا كُنَّا مُسْتَضْعَفِیْنَ فِی الْاَرْضِ ؕ— قَالُوْۤا اَلَمْ تَكُنْ اَرْضُ اللّٰهِ وَاسِعَةً فَتُهَاجِرُوْا فِیْهَا ؕ— فَاُولٰٓىِٕكَ مَاْوٰىهُمْ جَهَنَّمُ ؕ— وَسَآءَتْ مَصِیْرًا ۟ۙ

నిశ్చయంగా, తమకు తాము (తమ ఆత్మలకు) అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసే దేవదూతలు వారితో: "మీరు ఏ స్థితిలో ఉండేవారు?" అని అడిగితే, వారు: "మేము భూమిలో బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము!" అని జవాబిస్తారు. దానికి (దేవదూతలు): "ఏమీ? మీరు వలస పోవటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేకుండెనా?" అని అడుగుతారు. ఇలాంటి వారి శరణం నరకమే. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం![1] info

[1] చూడండి, 3:141.

التفاسير:

external-link copy
98 : 4

اِلَّا الْمُسْتَضْعَفِیْنَ مِنَ الرِّجَالِ وَالنِّسَآءِ وَالْوِلْدَانِ لَا یَسْتَطِیْعُوْنَ حِیْلَةً وَّلَا یَهْتَدُوْنَ سَبِیْلًا ۟ۙ

కాని, నిజంగానే నిస్సహాయులై, వలస పోవటానికి ఏ సాధనా సంపత్తీ, ఎలాంటి మార్గం లేని పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు తప్ప! info
التفاسير:

external-link copy
99 : 4

فَاُولٰٓىِٕكَ عَسَی اللّٰهُ اَنْ یَّعْفُوَ عَنْهُمْ ؕ— وَكَانَ اللّٰهُ عَفُوًّا غَفُوْرًا ۟

కావున ఇటు వంటి వారిని, అల్లాహ్ మన్నించవచ్చు! ఎందుకంటే, అల్లాహ్ మన్నించే వాడు, క్షమాశీలుడు. info
التفاسير:

external-link copy
100 : 4

وَمَنْ یُّهَاجِرْ فِیْ سَبِیْلِ اللّٰهِ یَجِدْ فِی الْاَرْضِ مُرٰغَمًا كَثِیْرًا وَّسَعَةً ؕ— وَمَنْ یَّخْرُجْ مِنْ بَیْتِهٖ مُهَاجِرًا اِلَی اللّٰهِ وَرَسُوْلِهٖ ثُمَّ یُدْرِكْهُ الْمَوْتُ فَقَدْ وَقَعَ اَجْرُهٗ عَلَی اللّٰهِ ؕ— وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۟۠

మరియు అల్లాహ్ మార్గంలో వలస పోయేవాడు భూమిలో కావలసినంత స్థలాన్ని, సౌకర్యాలను పొందుతాడు. మరియు ఎవడు తన ఇంటిని వదలి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకు, వలస పోవటానికి బయలుదేరిన తరువాత, అతనికి చావు వస్తే! నిశ్చయంగా, అతని ప్రతిఫలం అల్లాహ్ వద్ద స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. info
التفاسير:

external-link copy
101 : 4

وَاِذَا ضَرَبْتُمْ فِی الْاَرْضِ فَلَیْسَ عَلَیْكُمْ جُنَاحٌ اَنْ تَقْصُرُوْا مِنَ الصَّلٰوةِ ۖۗ— اِنْ خِفْتُمْ اَنْ یَّفْتِنَكُمُ الَّذِیْنَ كَفَرُوْا ؕ— اِنَّ الْكٰفِرِیْنَ كَانُوْا لَكُمْ عَدُوًّا مُّبِیْنًا ۟

మరియు మీరు భూమిలో ప్రయాణం చేసేటపుడు నమాజులను సంక్షిప్తం (ఖస్ర్) చేస్తే, అది పాపం కాదు.[1] (అంతే గాక) సత్యతిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగినపుడు కూడా! ఎందుకంటే సత్యతిరస్కారులు నిశ్చయంగా, మీకు బహిరంగ శత్రువులు. info

[1] ఖ'స్ర్ : సంక్షిప్తం, అంటే "జుహ్ర్ లో రెండు, 'అస్ర్ లో రెండు మరియు 'ఇషాలో రెండు రకాతులు మాత్రమే విధి (ఫ'ర్ద్) నమా'జ్ లు చేయాలి. ఫజ్ర్ మరియు మ'గ్రిబ్ నమా'జ్ లలో సంక్షిప్తం (ఖ'స్ర్) లేదు. ప్రయాణంలో సున్నత్ నమా'జ్ లు విడిచి పెట్టవచ్చు. వి'త్ర్ పూర్తి చేయాలి.

التفاسير: