Traduction des sens du Noble Coran - La traduction en télougou - 'Abd Ar-Rahîm ibn Muhammad

external-link copy
36 : 9

اِنَّ عِدَّةَ الشُّهُوْرِ عِنْدَ اللّٰهِ اثْنَا عَشَرَ شَهْرًا فِیْ كِتٰبِ اللّٰهِ یَوْمَ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ مِنْهَاۤ اَرْبَعَةٌ حُرُمٌ ؕ— ذٰلِكَ الدِّیْنُ الْقَیِّمُ ۙ۬— فَلَا تَظْلِمُوْا فِیْهِنَّ اَنْفُسَكُمْ ۫— وَقَاتِلُوا الْمُشْرِكِیْنَ كَآفَّةً كَمَا یُقَاتِلُوْنَكُمْ كَآفَّةً ؕ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ ۟

నిశ్చయంగా, నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో నాలుగు నిషిద్ధ (మాసాలు).[1] ఇదే సరైన ధర్మం. కావున వాటిలో (ఆ నాలుగ హిజ్రీ మాసాలలో) మీకు మీరు అన్యాయం చేసుకోకండి.[2] బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) అందరూ కలిసి పోరాడండి. ఏ విధంగా అయితే వారందరూ కలిసి మీతో పోరాడుతున్నారో! మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితోనే ఉంటాడని తెలుసుకోండి.[3] info

[1] నిషిద్ధమాసాలు హిజ్రీ శకపు రజబ్, జు'ల్-ఖాయిదహ్, జు'ల్-'హిజ్జహ్ మరియు ము'హర్రమ్ (7, 11, 12 మరియు 1వ నెలలు). [2] హిజ్రీ నెలల లెక్క చంద్రుని నెలప్రకారం ఉంది.అంటే హిజ్రీ సంవత్సరం చాంద్రమాన సంవత్సరం. ఇది ప్రకృతి సిద్ధమైన నెలలు మరియు సంవత్సరాలు. వీటిని అనుసరించటానికి లెక్కలు పెట్టే అవసరం లేదు. దీని వల్ల రమ'దాన్ ఉపవాసాలు మరియు 'హజ్ వేరువేరు ఋతువులలో వస్తాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ప్రజలు ప్రతి ఋతువులో ఉపవాసాలు, పండుగలు చేసుకుంటారు. చాంద్రనెల 29.5 రోజులది మరియు చాంద్ర సంవత్సరం 354 రోజులది. సూర్యమాన సంవత్సరంలో ఇది 11.25 రోజులు తక్కువ. దీని వల్ల ప్రతి 34 చాంద్రమాన సంవత్సరాలకు అంటే 12,036 దినాలకు ఒకసారి 'హజ్ అదే దినమున మళ్ళీ వస్తుంది. ముష్రిక్ అరబ్బులు, చాంద్రమాన సంవత్సరాన్ని సూర్యమాన సంవత్సరంతో సరిపెట్టటానికి అధికమాసాన్ని చేర్చేవారు. ఈ ఆయత్ తరువాత ఇస్లాం షరీయత్ లో సూర్యమాన సంవత్సరం మరియు అలా సరిపెట్టటం రద్దు చేయబడ్డాయి. [3] చూడండి, 2:193, 8:73.

التفاسير: