Traduction des sens du Noble Coran - La traduction en télougou - 'Abd Ar-Rahîm ibn Muhammad

అల్-జుమఅహ్

external-link copy
1 : 62

یُسَبِّحُ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ الْمَلِكِ الْقُدُّوْسِ الْعَزِیْزِ الْحَكِیْمِ ۟

ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వసార్వభౌముడు[1], పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. info

[1] చూడండి, 20:114 వ్యాఖ్యానం 3.

التفاسير:

external-link copy
2 : 62

هُوَ الَّذِیْ بَعَثَ فِی الْاُمِّیّٖنَ رَسُوْلًا مِّنْهُمْ یَتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِهٖ وَیُزَكِّیْهِمْ وَیُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَ ۗ— وَاِنْ كَانُوْا مِنْ قَبْلُ لَفِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟ۙ

ఆయనే ఆ నిరక్ష్యరాస్యులైన[1] వారిలో నుండి ఒక సందేశహరుణ్ణి లేపాడు. అతను వారికి ఆయన సూచనలను (ఆయాత్ లను) చదివి వినిపిస్తున్నాడు మరియు వారిని సంస్కరిస్తున్నాడు మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు. మరియు వాస్తవానికి వారు, అంతకు పూర్వం స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉండేవారు. info

[1] అల్-ఉమ్మియ్యూన: నిరక్షరాస్యులు. అంటే ఆ కాలంలో అరబ్బులలో చాలా మందికి చదవటం వ్రాయటం వచ్చేది కాదు. స్వయంగా ప్రవక్త ('స'అస) కూడా నిరక్షరాస్యులే. చూడండి, 7:157-158.

التفاسير:

external-link copy
3 : 62

وَّاٰخَرِیْنَ مِنْهُمْ لَمَّا یَلْحَقُوْا بِهِمْ ؕ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

మరియు ఇంకా వారిలో చేరని ఇతరులకు కూడా (బోధించటానికి). మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. info
التفاسير:

external-link copy
4 : 62

ذٰلِكَ فَضْلُ اللّٰهِ یُؤْتِیْهِ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِیْمِ ۟

ఇది అల్లాహ్ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ అనుగ్రహశాలి, సర్వోత్తముడు. info
التفاسير:

external-link copy
5 : 62

مَثَلُ الَّذِیْنَ حُمِّلُوا التَّوْرٰىةَ ثُمَّ لَمْ یَحْمِلُوْهَا كَمَثَلِ الْحِمَارِ یَحْمِلُ اَسْفَارًا ؕ— بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِ اللّٰهِ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟

తౌరాత్ బాధ్యత (భారం) మోపబడిన తరువాత దానిపై అమలు చేయలేక పోయిన వారి పోలిక, పుస్తకాల భారాన్ని మోసే ఆ గాడిద వలే ఉంది. (వారు ఆ భారాన్ని భరించారే గానీ, దానిని అర్థం చేసుకోలేక పోయారు). అల్లాహ్ సూచన (ఆయాత్) లను తిరస్కరించిన వారి దృష్టాంతము ఎంత చెడ్డది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు. info
التفاسير:

external-link copy
6 : 62

قُلْ یٰۤاَیُّهَا الَّذِیْنَ هَادُوْۤا اِنْ زَعَمْتُمْ اَنَّكُمْ اَوْلِیَآءُ لِلّٰهِ مِنْ دُوْنِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

వారితో ఇలా అను: "ఓ యూదులారా! నిశ్చయంగా, ఇతర ప్రజల కంటే మీరు మాత్రమే అల్లాహ్ కు ప్రియమైన వారు (స్నేహితులు) అనే భావం మీకుంటే, మీ (వాదంలో) మీరు సత్యవంతులే అయితే మీరు చావును కోరండి.[1]" info

[1] చూడండి, 5:18 మరియు 2:111.

التفاسير:

external-link copy
7 : 62

وَلَا یَتَمَنَّوْنَهٗۤ اَبَدًا بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالظّٰلِمِیْنَ ۟

కాని వారు తాము చేసి పంపుకున్న కర్మల (ఫలితాల)కు భయపడి దానిని ఏ మాత్రం కోరుకోరు![1] మరియు అల్లాహ్ కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు. info

[1] చూడండి, 2:94.

التفاسير:

external-link copy
8 : 62

قُلْ اِنَّ الْمَوْتَ الَّذِیْ تَفِرُّوْنَ مِنْهُ فَاِنَّهٗ مُلٰقِیْكُمْ ثُمَّ تُرَدُّوْنَ اِلٰی عٰلِمِ الْغَیْبِ وَالشَّهَادَةِ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟۠

వారితో ఇలా అను: "వాస్తవానికి ఏ చావు నుండి అయితే మీరు పారిపోతున్నారో! నిశ్చయంగా, అదే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ తరువాత మీరు, అగోచర మరియు గోచర విషయాలు తెలిసిన ఆయన (అల్లాహ్) వైపునకు మరలింపబడతారు, అప్పుడు ఆయన మీరు చేస్తూ ఉండిన కర్మలను మీకు తెలుపుతాడు." info
التفاسير: