[1] అంటే అల్లాహ్ (సు.తా.) తన జ్ఞానంతో వారితో ఉంటాడు.
[1] ఈ ఆయత్ మదీనా యొక్క యూదులను మరియు కపటవిశ్వాసులను గురించి పలుకుతుంది. వారు ఉన్నచోట నుండి ముస్లింలు పోతూ ఉంటే, వారు గుసగుసలాడే వారు, దానికి ముస్లింలు, వారు తమను గురించి ఏదైనా దురాలోచనలు చేస్తున్నారేమో! లేక ముస్లింల సైన్యం మీద ఏదైనా శత్రువుల సైన్యం దాడిచేసి వారికి నష్టం కలిగించేదేమో! అని భయపడేవారు, కావున దైవప్రవక్త ('స'అస) ఇట్టి గుసగుసలను నిషేధించారు. అయినా వారు కొంతకాలం తరువాత మళ్ళీ ప్రారంభించారు. ఆ సందర్భంలోనే ఈ ఆయత్ అవతరింపబడింది. చూడండి, 4:114.
[2] అల్లాహ్ (సు.తా.), మిమ్మల్ని పరస్పరం 'అస్సలాము అలైకుమ్ వ ర'హ్ మతుల్లాహ్', మీకు శాంతి కలుగుగాక! అని చెప్పుకోండి. అని ఆజ్ఞాపించాడు. కాని యూదులు దైవప్రవక్త ('స'అస)ను చూసినప్పుడు: 'అస్సాము అలైకుమ్' అంటే మీకు చావు వచ్చుగాక! అని అనేవారు. కావున దైవప్రవక్త ('స'అస) అలాంటి వారికి: 'వ అలైకుమ్.' అని జవాబు ఇవ్వండి, అని అన్నారు. అంటే మీరన్నదే మీకు! ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం).
[1] ఒకవేళ మీరు ముగ్గురు ఒకేచోట ఉంటే, మీరు మీలో ఒకడిని విడిచి మిగతా ఇద్దరు పరస్పరం గుసగుసలాడుకోరాదు! ఎందుకంటే అది, మూడోవాణ్ణి చింతకు గురిచేస్తుంది. ('స'హీ'హ్ ముస్లిం, 'స'హీ'హ్ బు'ఖారీ) అతడు అనుమతిస్తే, మిగతా ఇద్దరు ఏకాంతంలో మాట్లాడుకోవచ్చు!
[2] చూడండి, 14:22.
[1] ఈ సమావేశాలు ధర్మసమావేశాలు జుమ'అహ్ లేక ఇతర సమావేశాలు కావచ్చు! మొదట వచ్చినవారు విడివిడిగా దూరం దూరంగా కూర్చుంటే తరువాత వచ్చే వారికి చోటు దొరుకుతుంది. దైవప్రవక్త ప్రవచనం: 'ఏ వ్యక్తికి కూడా మరొక వ్యక్తిని అతని చోటు నుండి లేపి కూర్చోవటం సభ్యత కాదు. కావున మీరు సమావేశంలో కూర్చున్నప్పుడు దూరం దూరంగా కూర్చోండి.' ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం)
[2] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: ఒక భక్తిపరుని ('ఆబిద్)పై ఒక జ్ఞానవంతుని ('ఆలిమ్) యొక్క ఆధిక్యత పూర్ణిమ రాత్రిలో, నక్షత్రాలపై చంద్రునికి ఉండే ఆధిక్యత వంటిది. (ఇబ్నె-'హంబల్, అబూ-దావూద్, తిర్మిజీ', నసాయీ', ఇబ్నె-మాజా. మరియు దారిమీ.