Traduction des sens du Noble Coran - La traduction en télougou - 'Abd Ar-Rahîm ibn Muhammad

అర్-రోమ్

external-link copy
1 : 30

الٓمّٓ ۟ۚ

అలిఫ్-లామ్-మీమ్[1] info

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

التفاسير:

external-link copy
2 : 30

غُلِبَتِ الرُّوْمُ ۟ۙ

రోమన్ లు పరాజితులయ్యారు. info
التفاسير:

external-link copy
3 : 30

فِیْۤ اَدْنَی الْاَرْضِ وَهُمْ مِّنْ بَعْدِ غَلَبِهِمْ سَیَغْلِبُوْنَ ۟ۙ

తమ పొరుగు భూభాగంలోనే! మరియు వారు తమ ఈ పరాజయం తరువాత, తిరిగి విజేతలు కాగలరు[1] - info

[1] పొరుగు నేల అంటే షామ్ మరియు ఫలస్తీన్.

التفاسير:

external-link copy
4 : 30

فِیْ بِضْعِ سِنِیْنَ ؕ۬— لِلّٰهِ الْاَمْرُ مِنْ قَبْلُ وَمِنْ بَعْدُ ؕ— وَیَوْمَىِٕذٍ یَّفْرَحُ الْمُؤْمِنُوْنَ ۟ۙ

(రాబోయే) కొన్ని[1] సంవత్సరాలలోనే. మొదట నయినా, తరువాత నయినా నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ దే మరియు ఆ రోజు విశ్వాసులు సంతోష పడతారు; info

[1] బి'ద్ ఇన్ : అంటే, 3 నుండి 10 అని అర్థం.

التفاسير:

external-link copy
5 : 30

بِنَصْرِ اللّٰهِ ؕ— یَنْصُرُ مَنْ یَّشَآءُ ؕ— وَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟ۙ

అల్లాహ్ ప్రసాదించిన సహాయానికి[1]. ఆయన తనకు ఇష్టమైన వారికి సహాయం చేస్తాడు. మరియు ఆయనే సర్వశక్తి మంతుడు, అపార కరుణా ప్రదాత. info

[1] ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత 2 హిజ్రీలో (622 క్రీ.స్తు శకంలో) కాబోయే బద్ర్ యుద్ధం గురించి చెప్పుతోంది.

التفاسير: