Traduction des sens du Noble Coran - La traduction en télougou - 'Abd Ar-Rahîm ibn Muhammad

Numéro de la page: 245:235 close

external-link copy
87 : 12

یٰبَنِیَّ اذْهَبُوْا فَتَحَسَّسُوْا مِنْ یُّوْسُفَ وَاَخِیْهِ وَلَا تَایْـَٔسُوْا مِنْ رَّوْحِ اللّٰهِ ؕ— اِنَّهٗ لَا یَایْـَٔسُ مِنْ رَّوْحِ اللّٰهِ اِلَّا الْقَوْمُ الْكٰفِرُوْنَ ۟

నా కుమారులారా! మీరు పోయి యూసుఫ్ ను మరియు అతని సోదరుణ్ణి గురించి దర్యాప్తు చేయండి మరియు అల్లాహ్ అనుగ్రహం పట్ల నిరాస చెందకండి. నిశ్చయంగా సత్యతిరస్కార జాతికి చెందినవారు తప్ప, ఇతరులు అల్లాహ్ అనుగ్రహం పట్ల నిరాశ చెందరు."[1] info

[1] చూడండి, 15:56.

التفاسير:

external-link copy
88 : 12

فَلَمَّا دَخَلُوْا عَلَیْهِ قَالُوْا یٰۤاَیُّهَا الْعَزِیْزُ مَسَّنَا وَاَهْلَنَا الضُّرُّ وَجِئْنَا بِبِضَاعَةٍ مُّزْجٰىةٍ فَاَوْفِ لَنَا الْكَیْلَ وَتَصَدَّقْ عَلَیْنَا ؕ— اِنَّ اللّٰهَ یَجْزِی الْمُتَصَدِّقِیْنَ ۟

వారు అతని (యూసుఫ్) దగ్గరకు (మరల) వచ్చి[1] అన్నారు: "ఓ సర్దార్ (అజీజ్)! మేము మా కుటుంబం వారు చాలా ఇబ్బందులకు గురయ్యాము. మరియు మేము చాలా తక్కువ సామగ్రి తెచ్చాము, కాని మాకు పూర్తి సామగ్రి (ధాన్యాన్ని) దాన ధర్మ రూపంలోనైనా సరే ఇవ్వండి. నిశ్చయంగా, అల్లాహ్ దానధర్మాలు చేసే వారికి మంచి ప్రతిఫలం ఇస్తాడు." info

[1] ధాన్యం కొరకు, ఇది వారి మూడవ ఈజిప్టు ప్రయాణం.

التفاسير:

external-link copy
89 : 12

قَالَ هَلْ عَلِمْتُمْ مَّا فَعَلْتُمْ بِیُوْسُفَ وَاَخِیْهِ اِذْ اَنْتُمْ جٰهِلُوْنَ ۟

(యూసుఫ్) అడిగాడు: "అజ్ఞానంలో పడి మీరు యూసుఫ్ మరియు అతని సోదరునితో ఎలా వ్యవహరించారో మీకు గుర్తుందా?" info
التفاسير:

external-link copy
90 : 12

قَالُوْۤا ءَاِنَّكَ لَاَنْتَ یُوْسُفُ ؕ— قَالَ اَنَا یُوْسُفُ وَهٰذَاۤ اَخِیْ ؗ— قَدْ مَنَّ اللّٰهُ عَلَیْنَا ؕ— اِنَّهٗ مَنْ یَّتَّقِ وَیَصْبِرْ فَاِنَّ اللّٰهَ لَا یُضِیْعُ اَجْرَ الْمُحْسِنِیْنَ ۟

వారన్నారు: "ఏమిటి? వాస్తవానికి నీవే యూసుఫ్ వా?" అతను జవాబిచ్చాడు: "నేనే యూసుఫ్ ను మరియు ఇతడు (బెన్యామీన్) నా సోదరుడు. నిశ్చయంగా, అల్లాహ్ మమ్మల్ని అనుగ్రహించాడు. నిశ్చయంగా, ఎవరైతే దైవభీతి కలిగి వుండి, సహనంతో ఉంటారో, అలాంటి సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్ ఎన్నడూ వృథా చేయడు." info
التفاسير:

external-link copy
91 : 12

قَالُوْا تَاللّٰهِ لَقَدْ اٰثَرَكَ اللّٰهُ عَلَیْنَا وَاِنْ كُنَّا لَخٰطِـِٕیْنَ ۟

వారన్నారు: "అల్లాహ్ తోడు! వాస్తవంగా, అల్లాహ్ నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. మరియు నిశ్చయంగా మేము అపరాధులము!" info
التفاسير:

external-link copy
92 : 12

قَالَ لَا تَثْرِیْبَ عَلَیْكُمُ الْیَوْمَ ؕ— یَغْفِرُ اللّٰهُ لَكُمْ ؗ— وَهُوَ اَرْحَمُ الرّٰحِمِیْنَ ۟

(యూసుఫ్) అన్నాడు: "ఈరోజు మీపై ఎలాంటి నిందలేదు.[1] అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక! ఆయన కరుణించే వారిలో అందరి కంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి! info

[1] ఏ విధంగానైతే యూసుఫ్ ('అ.స.) తనను చంపగోరి బావిలో పడవేసిన తన సోదరులను క్షమించారో! అదే విధంగా మక్కా విజయం రోజు దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) తతను చంపగోరిన, తన తెగవారైన, మక్కా ఖురైషులను క్షమించారు.

التفاسير:

external-link copy
93 : 12

اِذْهَبُوْا بِقَمِیْصِیْ هٰذَا فَاَلْقُوْهُ عَلٰی وَجْهِ اَبِیْ یَاْتِ بَصِیْرًا ۚ— وَاْتُوْنِیْ بِاَهْلِكُمْ اَجْمَعِیْنَ ۟۠

మీరు నా ఈ చొక్కా తీసుకొని పోయి దానిని నా తండ్రి ముఖం మీద వేయండి. అతనికి దృష్టి వస్తుంది. మరియు మీరు మీ కుటుంబం వారినందరినీ నా వద్దకు తీసుకొని రండి." info
التفاسير:

external-link copy
94 : 12

وَلَمَّا فَصَلَتِ الْعِیْرُ قَالَ اَبُوْهُمْ اِنِّیْ لَاَجِدُ رِیْحَ یُوْسُفَ لَوْلَاۤ اَنْ تُفَنِّدُوْنِ ۟

ఆ బిడారం (ఈజిప్టు నుండి) బయలు దేరగానే వారి తండ్రి అన్నాడు: "మీరు నన్ను బుద్ధి నశించిన ముసలివాడు అన్నా! నిశ్చయంగా నాకు యూసుఫ్ సువాసన వస్తోంది." info
التفاسير:

external-link copy
95 : 12

قَالُوْا تَاللّٰهِ اِنَّكَ لَفِیْ ضَلٰلِكَ الْقَدِیْمِ ۟

(అతని దగ్గర ఉన్నవారు) అన్నారు: "అల్లాహ్ తోడు! నిశ్చయంగా నీవు నీ పూర్వపు పొరపాటులోనే పడి ఉన్నావు." info
التفاسير: