Traduction des sens du Noble Coran - La traduction en télougou - 'Abd Ar-Rahîm ibn Muhammad

యూనుస్

external-link copy
1 : 10

الٓرٰ ۫— تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ الْحَكِیْمِ ۟

అలిఫ్ - లామ్ - రా[1]. ఇవి వివేకంతో నిండి వున్న దివ్యగ్రంథం యొక్క ఆయతులు. info

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

التفاسير:

external-link copy
2 : 10

اَكَانَ لِلنَّاسِ عَجَبًا اَنْ اَوْحَیْنَاۤ اِلٰی رَجُلٍ مِّنْهُمْ اَنْ اَنْذِرِ النَّاسَ وَبَشِّرِ الَّذِیْنَ اٰمَنُوْۤا اَنَّ لَهُمْ قَدَمَ صِدْقٍ عِنْدَ رَبِّهِمْ ؔؕ— قَالَ الْكٰفِرُوْنَ اِنَّ هٰذَا لَسٰحِرٌ مُّبِیْنٌ ۟

"ఏమీ? మానవులను హెచ్చరించటానికి మరియు విశ్వసించిన వారికి నిశ్చయంగా, తమ ప్రభువు వద్ద, వారు చేసి పంపిన మంచిపనులకు తగిన స్థానం ఉంది." అనే శుభవార్త వినిపించటానికి, మేము వారిలోని ఒక మనిషి (ముహమ్మద్) పై మా సందేశాన్ని అవతరింప జేయటం ప్రజలకు ఆశ్చర్యకమైన విషయంగా ఉందా?[1] (ఎందుకంటే) సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "నిశ్చయంగా ఇతను పచ్చి మాంత్రికుడు!" info

[1] చూడండి, 9:128.

التفاسير:

external-link copy
3 : 10

اِنَّ رَبَّكُمُ اللّٰهُ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ فِیْ سِتَّةِ اَیَّامٍ ثُمَّ اسْتَوٰی عَلَی الْعَرْشِ یُدَبِّرُ الْاَمْرَ ؕ— مَا مِنْ شَفِیْعٍ اِلَّا مِنْ بَعْدِ اِذْنِهٖ ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ فَاعْبُدُوْهُ ؕ— اَفَلَا تَذَكَّرُوْنَ ۟

నిశ్చయంగా మీ పోషకుడూ, ప్రభువూ అయిన అల్లాహ్, ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించి, తర్వాత తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు.[1] ఆయనే (సర్వసృష్టి) వ్యవహారాలను నడుపుతున్నాడు. ఆయన అనుమతి లేకుండా సిఫారసు చేయగలవాడు ఎవ్వడూ లేడు.[2] ఆయనే అల్లాహ్! మీ పోషకుడు (ప్రభువు), కావున మీరు ఆయననే ఆరాధించండి. ఏమీ? మీరు హితోపదేశం స్వీకరించరా? info

[1] చూడండి, 7:54. [2] అల్లాహ్ (సు.తా.) అనుమతి లేకుండా సిఫారసు చేయగలవారు ఎవ్వడూ లేడు. అల్లాహ్ (సు.తా.) వారి కొరకే సిఫారసు చేయటానికి అనుమతిస్తాడు. ఎవరికొరకైతే ఆయన (సు.తా.) ఇష్టపడతాడో; అంటే షిర్క్ చేయకుండా, విశ్వాసులై అల్లాహ్ విధులను పాటిస్తూ అనుకోకుండా పాపాలు చేసిన వారి కొరకు మాత్రమే. ముష్రికీన్ లు భావిచినట్లు: 'వారు ఆరాధించేవి, తమను అల్లాహ్ (సు.తా.) శిక్ష నుండి తప్పించటానికి, అల్లాహ్ (సు.తా.) వద్ద సిఫారసు చేస్తాయి.' అనే తప్పుడు ఊహలను ఈ ఆయత్ మరియు ఇలాంటి ఎన్నో ఆయతులు ఖండిస్తున్నాయి. షిర్క్ (అల్లాహుతా'ఆలాకు సాటి కల్పించడం) ఎన్నటికీ క్షమించబడని మహా పాపం. ముష్రికీన్ ల గమ్యస్థానం - వారెన్ని పుణ్యకార్యాలు చేసినా - నరకం మాత్రమే. చూడండి, 2:255, 19:87, 20:109, 21:28, 34:23, మరియు 53:26.

التفاسير:

external-link copy
4 : 10

اِلَیْهِ مَرْجِعُكُمْ جَمِیْعًا ؕ— وَعْدَ اللّٰهِ حَقًّا ؕ— اِنَّهٗ یَبْدَؤُا الْخَلْقَ ثُمَّ یُعِیْدُهٗ لِیَجْزِیَ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ بِالْقِسْطِ ؕ— وَالَّذِیْنَ كَفَرُوْا لَهُمْ شَرَابٌ مِّنْ حَمِیْمٍ وَّعَذَابٌ اَلِیْمٌ بِمَا كَانُوْا یَكْفُرُوْنَ ۟

ఆయన వైపునకే మీరందరూ మరలి పోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం నిజమైనది. నిశ్చయంగా, ఆయనే సృష్టిని మొదట సరిక్రొత్తగా ప్రారంభించాడు, మరల ఆయనే దానిని ఉనికిలోకి తెస్తాడు. ఇది విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి న్యాయమైన ప్రతిఫల మివ్వటానికి. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారికి - వారు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండినందుకు - త్రాగటానికి సలసల కాగే నీళ్ళు మరియు బాధాకరమైన శిక్ష ఉంటాయి. info
التفاسير:

external-link copy
5 : 10

هُوَ الَّذِیْ جَعَلَ الشَّمْسَ ضِیَآءً وَّالْقَمَرَ نُوْرًا وَّقَدَّرَهٗ مَنَازِلَ لِتَعْلَمُوْا عَدَدَ السِّنِیْنَ وَالْحِسَابَ ؕ— مَا خَلَقَ اللّٰهُ ذٰلِكَ اِلَّا بِالْحَقِّ ۚ— یُفَصِّلُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟

ఆయనే, సూర్యుణ్ణి (ప్రకాశించే) దీపంగానూ మరియు చంద్రుణ్ణి వెలుగును (ప్రతిబింబింపజేసే) దాని గానూ చేసి, దానికి (పెరిగే - తరిగే) దశలు నియమించాడు,[1] దాని ద్వారా మీరు సంవత్సరాల మరియు (కాలపు) గణనను తెలుసుకోవాలని.[2] అల్లాహ్ ఇదంతా సత్యాధారంగా తప్ప సృష్టించలేదు. జ్ఞానం గల వారికి ఆయన తన సూచనలను (ఈ విధంగా) విశదీకరిస్తున్నాడు. info

[1] సూర్యుని ప్రకాశం స్వంతమైనది, విధంగానైతే ద్వీపపు వెలుగో. చంద్రుని వెలుగు ప్రతిబింబింపజేయబడిన సూర్యుని వెలుగు. చంద్రునిలో తన స్వంత వెలుగు లేదు. [2] చంద్రునికి 28 దశలున్నాయి. వాటిలో చంద్రుడు చిన్న రేఖ నుండి పూర్ణిమ రోజు పూర్తి చంద్రునిగా 14 రోజులలో మారుతాడు. ఆ తరువాత తిరిగి తగ్గుతూ 14 పోజులలో చిన్న రేఖగా మారుతాడు. తరువాత ఒకటి రెండు రోజులు కానరాకుండా పోతాడు. మళ్ళీ చిన్న రేఖగా మొదలవుతాడు. ఈ విధంగా చంద్రుని దిశల వల్ల దినాల, నెలల మరియు సంవత్సరాల గణనలు తెలుస్తాయి.

التفاسير:

external-link copy
6 : 10

اِنَّ فِی اخْتِلَافِ الَّیْلِ وَالنَّهَارِ وَمَا خَلَقَ اللّٰهُ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّتَّقُوْنَ ۟

నిశ్చయంగా, రేయింబవళ్ళ నిరంతర మార్పులలోనూ మరియు భూమ్యాకాశాలలో అల్లాహ్ సృష్టించిన ప్రతిదానిలోనూ, దైవభీతి గల ప్రజలకు సూచనలున్నాయి. info
التفاسير: