Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran.

అల్-బయ్యినహ్

Parmi les objectifs de la sourate:
بيان كمال الرسالة المحمدية ووضوحها.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్య పరిపూర్ణత మరియు దాని స్పష్టత యొక్క ప్రకటన. info

external-link copy
1 : 98

لَمْ یَكُنِ الَّذِیْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَالْمُشْرِكِیْنَ مُنْفَكِّیْنَ حَتّٰی تَاْتِیَهُمُ الْبَیِّنَةُ ۟ۙ

యూదుల్లోంచి,క్రైస్తవుల్లోంచి మరియు ముష్రికుల్లోంచి అవిశ్వాసపరులు వారి వద్దకు స్పష్టమైన ఆధారము మరియు జ్యోతిర్మయమైన వాదన వచ్చేంత వరకు అవిశ్వాసులు తమ సమావేశము,తమ సంయోగము నుండి విడిపోరు. info
التفاسير:

external-link copy
2 : 98

رَسُوْلٌ مِّنَ اللّٰهِ یَتْلُوْا صُحُفًا مُّطَهَّرَةً ۟ۙ

ఈ స్పష్టమైన ఆధారము మరియు జ్యోతిర్మయమైన వాదన ఏమిటంటే అది అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త .ఆయన అతనిని పంపించాడు. పరిశుద్ధులు తప్ప ఎవరు ముట్టని పరిశుద్ధ గ్రంధములను చదివి వినిపిస్తాడు. info
التفاسير:

external-link copy
3 : 98

فِیْهَا كُتُبٌ قَیِّمَةٌ ۟ؕ

ఈ గ్రంధాల్లో సత్య సమాచారాలు మరియు న్యాయపూరితమైన ఆదేశాలు కలవు. అవి ప్రజలను వారి ప్రయోజనం ఉన్న వాటి వైపుకు మరియు వారి సన్మార్గం ఉన్న వాటి వైపుకు మార్గదర్శకం చేస్తాయి. info
التفاسير:

external-link copy
4 : 98

وَمَا تَفَرَّقَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ اِلَّا مِنْ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَیِّنَةُ ۟ؕ

తౌరాత్ ఇవ్వబడిన యూదులు మరియు ఇంజీలు ఇవ్వబడిన క్రైస్తవులు అల్లాహ్ వారి వద్దకు తన ప్రవక్తను పంపించిన తరువాతే విభేదించుకున్నారు. అయితే వారిలో నుండి ఇస్లాం స్వీకరించిన వారు ఉన్నారు మరియు వారిలో నుంచి ఆయన ప్రవక్త నిజాయితీ జ్ఞానము తనకు కలిగిన తరువాత కూడా తన అవిశ్వాసంలో కొనసాగిన వారు ఉన్నారు. info
التفاسير:

external-link copy
5 : 98

وَمَاۤ اُمِرُوْۤا اِلَّا لِیَعْبُدُوا اللّٰهَ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ ۙ۬— حُنَفَآءَ وَیُقِیْمُوا الصَّلٰوةَ وَیُؤْتُوا الزَّكٰوةَ وَذٰلِكَ دِیْنُ الْقَیِّمَةِ ۟ؕ

మరియు యూదుల మరియు క్రైస్తవుల అపరాధము మరియు వ్యతిరేకత బహిర్గతమవుతుంది. వారి గ్రంధంలో వారికి ఆదేశించబడిన అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం,బహుదైవారాధన నుండి దూరంగా ఉండటం,నమాజు పాటించటం,జకాత్ ఇవ్వటం గురించే వారు ఈ ఖుర్ఆన్ లో ఆదేశించబడ్డారు. ఎటువంటి వంకరతనం లేని తిన్నని ధర్మం గురించి వారికి ఆదేశించబడినది. info
التفاسير:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• فضل ليلة القدر على سائر ليالي العام.
సంవత్సరపు రాత్రులన్నింటిపై లైలతుల్ ఖదర్ యొక్క ఘనత info

• الإخلاص في العبادة من شروط قَبولها.
ఆరాధనలో చిత్తశుద్ధి అది స్వీకృతం అవ్వటానికి షరతుల్లోంచిది. info

• اتفاق الشرائع في الأصول مَدعاة لقبول الرسالة.
నియమాల్లో ధర్మశాస్త్రముల ఏకగ్రీవమవటం దైవదౌత్యమును స్వీకరించటానికి కారణం. info