Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran.

అల్-ఖియామహ్

Parmi les objectifs de la sourate:
إظهار قدرة الله على بعث الخلق وجمعهم يوم القيامة.
సృష్టిని మరణాంతరం లేపడం మరియు వారిని ప్రళయదినం నాడు సమీకరించడంలో అల్లాహ్ సామర్ధ్యంను ప్రదర్శించడం info

external-link copy
1 : 75

لَاۤ اُقْسِمُ بِیَوْمِ الْقِیٰمَةِ ۟ۙ

అల్లాహ్ ప్రళయదినముపై ప్రమాణం ఛేశాడు ఆ రోజు ప్రజలు సర్వలోకాల ప్రభువు ముందు నిలబడుతారు. info
التفاسير:

external-link copy
2 : 75

وَلَاۤ اُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَةِ ۟

మరియు ఆయన ఆ మంచి మనస్సు పై ప్రమాణం చేశాడు ఏదైతే తన యజమానిని సత్కర్మల విషయంలో నిర్లక్ష్యం చేసినందుకు మరియు దుష్కర్మలు చేసినందుకు నిందిస్తుంది. ఆయన ఈ రెండు విషయములపై ప్రమాణం చేసి ప్రజలు లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు తప్పకుండా లేపబడుతారని తెలియపరచాడు. info
التفاسير:

external-link copy
3 : 75

اَیَحْسَبُ الْاِنْسَانُ اَلَّنْ نَّجْمَعَ عِظَامَهٗ ۟ؕ

ఏమి మానవుడు అతని మరణం తరువాత మరల లేపబడటం కొరకు మేము అతని ఎముకలను సమీకరించమని అనుకుంటున్నాడా ?. info
التفاسير:

external-link copy
4 : 75

بَلٰى قٰدِرِیْنَ عَلٰۤی اَنْ نُّسَوِّیَ بَنَانَهٗ ۟

ఎందుకు కాదు, మేము వాటిని సమీకరించటంతో పాటు అతని వ్రేళ్ళ చివర్లను ముందు ఎలా ఉండేవో అలా సరిగా సృష్టించి మరలించటంపై సామర్ధ్యము కలవారము. info
التفاسير:

external-link copy
5 : 75

بَلْ یُرِیْدُ الْاِنْسَانُ لِیَفْجُرَ اَمَامَهٗ ۟ۚ

మరణాంతరం లేపబడటమును తిరస్కరించటం ద్వారా మానవుడు తన పాపములపై భవిష్యత్తులో ఎవరు ఆపేవాడు లేడని కొనసాగిపోవాలని అనుకుంటున్నాడు. info
التفاسير:

external-link copy
6 : 75

یَسْـَٔلُ اَیَّانَ یَوْمُ الْقِیٰمَةِ ۟ؕ

ప్రళయదినమును దూరంగా భావించే విధంగా అతడు అది ఎప్పుడు జరగబోతుంది ? అని అడుగుతున్నాడు. info
التفاسير:

external-link copy
7 : 75

فَاِذَا بَرِقَ الْبَصَرُ ۟ۙ

మరియు తాను తిరస్కరించిన దాన్ని చూడగానే కళ్ళు ఆందోళన చెంది ఆశ్ఛర్యపోయినప్పుడు. info
التفاسير:

external-link copy
8 : 75

وَخَسَفَ الْقَمَرُ ۟ۙ

మరియు చంద్రుని కాంతి వెళ్ళి పోయినప్పుడు. info
التفاسير:

external-link copy
9 : 75

وَجُمِعَ الشَّمْسُ وَالْقَمَرُ ۟ۙ

మరియు సూర్య,చంద్రుల పరిమాణం సమీకరించబడినప్పుడు. info
التفاسير:

external-link copy
10 : 75

یَقُوْلُ الْاِنْسَانُ یَوْمَىِٕذٍ اَیْنَ الْمَفَرُّ ۟ۚ

ఆ రోజు పాపాత్ముడైన మానవుడు ఎటు పారిపోవాలి ? అని అంటాడు. info
التفاسير:

external-link copy
11 : 75

كَلَّا لَا وَزَرَ ۟ؕ

ఆ రోజు పారిపోయి తప్పించుకోవటం ఉండదు మరియు ఆశ్రయం తీసుకోవటానికి ఎటువంటి ఆశ్రయం ఉండదు మరియు రక్షణ పొందటానికి ఎటువంటి రక్షణ ప్రదేశం ఉండదు. info
التفاسير:

external-link copy
12 : 75

اِلٰى رَبِّكَ یَوْمَىِٕذِ ١لْمُسْتَقَرُّ ۟ؕ

ఓ ప్రవక్త లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు ఆ రోజు మరలే చోటు మరియు తరలి వెళ్ళే చోటు మీ ప్రభువు వైపునే. info
التفاسير:

external-link copy
13 : 75

یُنَبَّؤُا الْاِنْسَانُ یَوْمَىِٕذٍ بِمَا قَدَّمَ وَاَخَّرَ ۟ؕ

ఆ రోజున మానవుడికి తాను చేసి పంపిన తన కర్మల గురించి మరియు తాను వాటిలో నుండి వెనుక వదిలి వచ్చిన వాటి గురించి తెలుపబడుతుంది. info
التفاسير:

external-link copy
14 : 75

بَلِ الْاِنْسَانُ عَلٰی نَفْسِهٖ بَصِیْرَةٌ ۟ۙ

అంతే కాదు మానవుడు తాను స్వయంగా తనకు విరుద్దంగా సాక్షి అవుతాడు. ఎందుకంటే అతను చేసిన పాపముల గురించి అతని అవయవములు అతనికి విరుద్ధంగా సాక్ష్యం పలుకుతాయి. info
التفاسير:

external-link copy
15 : 75

وَّلَوْ اَلْقٰى مَعَاذِیْرَهٗ ۟ؕ

మరియు ఒక వేళ అతడు సాకులను తీసుకుని వచ్చి తాను చెడు చేయలేదని వాటితో తన తరపు నుండి వాదిస్తే అవి అతనికి ప్రయోజనం కలిగించవు. info
التفاسير:

external-link copy
16 : 75

لَا تُحَرِّكْ بِهٖ لِسَانَكَ لِتَعْجَلَ بِهٖ ۟ؕ

ఓ ప్రవక్తా మీరు ఖుర్ఆన్ విషయంలో అది మీ నుండి తప్పిపోతుందని త్వరపడుతూ మీ నాలుకను కదల్చకండి. info
التفاسير:

external-link copy
17 : 75

اِنَّ عَلَیْنَا جَمْعَهٗ وَقُرْاٰنَهٗ ۟ۚۖ

నిశ్చయంగా మేము దానిని మీ కొరకు మీ హృదయంలో సేకరించి, దాని పఠనాన్ని మీ నాలుకపై స్థిరపరచటం మా బాధ్యత. info
التفاسير:

external-link copy
18 : 75

فَاِذَا قَرَاْنٰهُ فَاتَّبِعْ قُرْاٰنَهٗ ۟ۚ

మా దూత జిబ్రయీల్ మీకు ఖుర్ఆన్ చదివి వినిపించినప్పుడు మీరు ఆయన ఖిరాఅత్ చేసేటప్పుడు మౌనంగా ఉండి వినండి. info
التفاسير:

external-link copy
19 : 75

ثُمَّ اِنَّ عَلَیْنَا بَیَانَهٗ ۟ؕ

ఆ పిదప నిశ్చయంగా మీ కొరకు దాని వివరణ ఇవ్వటం మా బాధ్యత. info
التفاسير:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• مشيئة العبد مُقَيَّدة بمشيئة الله.
దాసుని ఇచ్ఛ దైవ ఇచ్ఛతో పరిమితం చేయబడింది. info

• حرص رسول الله صلى الله عليه وسلم على حفظ ما يوحى إليه من القرآن، وتكفّل الله له بجمعه في صدره وحفظه كاملًا فلا ينسى منه شيئًا.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన వైపునకు దైవ వాణి చేయబడిన ఖుర్ఆన్ కంఠస్తం చేయటంపై ప్రోత్సహించటం జరిగినది. మరియు అల్లాహ్ దాన్ని ఆయన హృదయంలో సమీకరించి దాన్ని సంపూర్ణంగా కంఠస్తం చేయించటం యొక్క బాధ్యతను ఆయన కొరకు తీసుకున్నాడు ఆయన దాని నుండి ఏది మరచిపోరు. info