Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran.

external-link copy
4 : 42

لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَهُوَ الْعَلِیُّ الْعَظِیْمُ ۟

ఆకాశముల్లో ఉన్నది మరియు భూమిలో ఉన్నది సృష్టి పరంగా,అధికారము పరంగా,పర్యాలోచన పరంగా అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. మరియు ఆయన తన అస్తిత్వములో,తన సామర్ధ్యములో,తన ఆధిఖ్యతలో మహోన్నతుడు. తన ఉనికిలో గొప్పవాడు. info
التفاسير:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• عظمة الله ظاهرة في كل شيء.
అల్లాహ్ యొక్క గొప్పతనం ప్రతీ వస్తువులో బహిర్గతమవుతుంది. info

• دعاء الملائكة لأهل الإيمان بالخير.
విశ్వాసపరుల కొరకు మేలు గురించి దైవదూతల ప్రార్ధన. info

• القرآن والسُنَّة مرجعان للمؤمنين في شؤونهم كلها، وبخاصة عند الاختلاف.
ఖుర్ఆన్ మరియు హదీసు విశ్వాసపరుల కొరకు తమ పూర్తి వ్యవహారములలో రెండూ మరలే చోట్లు. ముఖ్యంగా విభేదాల సమయములో. info

• الاقتصار على إنذار أهل مكة ومن حولها؛ لأنهم مقصودون بالرد عليهم لإنكارهم رسالته صلى الله عليه وسلم وهو رسول للناس كافة كما قال تعالى: ﴿وَمَآ أَرسَلنُّكَ إلَّا كافةً لِّلنَّاس...﴾، (سبأ: 28).
మక్కా వాసులకు మరియు దాని చుట్టుపక్కల వారికి హెచ్చరించటం ప్రత్యేకించబడినది ఎందుకంటే ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యమును వారు తిరస్కరించటం వలన వారినే ఖండించే ఉద్దేశముతో. వాస్తవానికి ఆయనే ప్రజలందరి కొరకు ప్రవక్త. ఎలాగైతే మహోన్నతుడైన ఆయన పలికాడో : {وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا كَآفَّةً لِّلنَّاسِ} మేము నిన్ను సమస్త జనుల కొరకు ప్రవక్తగా పంపించాము. (సూర సబా :28) info