Traducción de los significados del Sagrado Corán - Traducción Telugu- Abder-Rahim ibn Muhammad

అల్-ముజాదిలహ్

external-link copy
1 : 58

قَدْ سَمِعَ اللّٰهُ قَوْلَ الَّتِیْ تُجَادِلُكَ فِیْ زَوْجِهَا وَتَشْتَكِیْۤ اِلَی اللّٰهِ ۖۗ— وَاللّٰهُ یَسْمَعُ تَحَاوُرَكُمَا ؕ— اِنَّ اللّٰهَ سَمِیْعٌ بَصِیْرٌ ۟

వాస్తవానికి, తన భర్తను గురించి నీతో వాదిస్తున్న మరియు అల్లాహ్ తో మొర పెట్టుకుంటున్న ఆ స్త్రీ మాటలు అల్లాహ్ విన్నాడు.[1] అల్లాహ్ మీ ఇద్దరి సంభాషణ వింటున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సమస్తం చూసేవాడు. info

[1] చూఇక్కడ 'ఖౌలహ్ బిన్త్ మాలిక్ బిన్ స' 'అలబహ్ (ర.'అన్హా) ను ఆమె భర్త ఔస్ బిన్ 'సామిత్ (రజి.'అ.) "జిహార్ చేసినందుకు ఆమె మొరపెట్టుకుంటుంది. దానికి అల్లాహ్ (సు.తా.) ఆదేశం వచ్చిన తరువాత, అది నిర్మూలించబడిన విషయం ఈ సూరహ్ యొక్క 1-4వ ఆయతులలో పేర్కొనబడింది. "జిహార్ - అంటే, "నీ వీపు నాకు నా తల్లి వీపు వంటిది" అని తన భార్యను తాకకుండా దూరముండటం. మరియు ఆమెకు విడాకులు కూడా ఇవ్వకుండా ఉండటం. ఆమె దైవప్రవక్త ('స'అస) దగ్గరకు వచ్చి ఈ ఆచారాన్ని గురించి వాదులాడింది. అప్పుడు ఈ ఆయత్ లు అవతరింపజేయబడ్డాయి. (అబూ-దావూద్) ఇంకా చూడండి, 33:4. స్త్రీ తన భర్త నుంచి విడాకులు తీసుకోగోరితే దానికి సంబంధించిన ఆదేశానికి చూడండి, 2:229. దానిని ఖుల్'అ అంటారు.

التفاسير:

external-link copy
2 : 58

اَلَّذِیْنَ یُظٰهِرُوْنَ مِنْكُمْ مِّنْ نِّسَآىِٕهِمْ مَّا هُنَّ اُمَّهٰتِهِمْ ؕ— اِنْ اُمَّهٰتُهُمْ اِلَّا الّٰٓـِٔیْ وَلَدْنَهُمْ ؕ— وَاِنَّهُمْ لَیَقُوْلُوْنَ مُنْكَرًا مِّنَ الْقَوْلِ وَزُوْرًا ؕ— وَاِنَّ اللّٰهَ لَعَفُوٌّ غَفُوْرٌ ۟

మీలో ఎవరైతే తమ భార్యలను జిహార్ ద్వారా దూరంగా ఉంచుతారో! అలాంటి వారి భార్యలు, వారి తల్లులు[1] కాలేరు. వారిని కన్నవారు మాత్రమే వారి తల్లులు. మరియు నిశ్చయంగా, వారు అనుచితమైన మరియు అబద్ధమైన మాట పలుకుతున్నారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మన్నించే వాడు, క్షమాశీలుడు. info

[1] మీరు "జీహార్ అన్నంత మాత్రాన్నే మీ భార్యలు మీ తల్లులు కారు, మిమ్మల్ని కన్నవారే మీ తల్లులు.

التفاسير:

external-link copy
3 : 58

وَالَّذِیْنَ یُظٰهِرُوْنَ مِنْ نِّسَآىِٕهِمْ ثُمَّ یَعُوْدُوْنَ لِمَا قَالُوْا فَتَحْرِیْرُ رَقَبَةٍ مِّنْ قَبْلِ اَنْ یَّتَمَآسَّا ؕ— ذٰلِكُمْ تُوْعَظُوْنَ بِهٖ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟

మరియు ఎవరైతే తమ భార్యలను జిహార్ ద్వారా దూరం చేసి తరువాత తమ మాటను వారు ఉపసంహరించుకోదలిస్తే! వారిద్దరు ఒకరినొకరు తాకక ముందు, ఒక బానిసను విడుదల చేయించాలి.[1] ఈ విధంగా మీకు ఉపదేశమివ్వడుతోంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ఎరుగును. info

[1] ఇక్కడ దాని పరిహారం చెప్పబడుతోంది. ఒక బానిస విడుదల చేయించాలి, లేక రెండు నెలల ఎడతెగకుండా ఉపవాసాలుండాలి, లేక 60 మంది పేదలకు, ప్రతివానికి 2 ముద్ లు అంటే 1.25 కిలోగ్రాముల ధాన్యం ఇవ్వాలి లేక కడుపునిండా అన్నం తినిపించాలి. వారందరినీ ఒకే సారి తినిపించనవసరం లేదు. వేర్వేరు సమయాలలో తినిపించవచ్చు. (ఫ'త్హ్ అల్ ఖదీర్)

التفاسير:

external-link copy
4 : 58

فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ شَهْرَیْنِ مُتَتَابِعَیْنِ مِنْ قَبْلِ اَنْ یَّتَمَآسَّا ۚ— فَمَنْ لَّمْ یَسْتَطِعْ فَاِطْعَامُ سِتِّیْنَ مِسْكِیْنًا ؕ— ذٰلِكَ لِتُؤْمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ ؕ— وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ اَلِیْمٌ ۟

కాని ఎవడైతే ఇలా చేయలేడో, అతడు తన భార్యను తాకక ముందు, రెండు నెలలు వరుసగా ఉపవాసముండాలి. ఇది కూడా చేయలేని వాడు, అరవై మంది నిరుపేదలకు భోజనం పెట్టాలి. ఇదంతా మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించటానికి. మరియు ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష పడుతుంది. info
التفاسير:

external-link copy
5 : 58

اِنَّ الَّذِیْنَ یُحَآدُّوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ كُبِتُوْا كَمَا كُبِتَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ وَقَدْ اَنْزَلْنَاۤ اٰیٰتٍۢ بَیِّنٰتٍ ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ مُّهِیْنٌ ۟ۚ

నిశ్చయంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించేవారు, తమకు పూర్వం గతించినవారు అవమానింపడినట్లు అవమానింపబడతారు. మరియు వాస్తవానికి మేము స్పష్టమైన సూచనలను (ఆయాత్ లను) అవతరింపజేశాము. మరియు సత్యతిరస్కారులకు అవమానకరమైన శిక్ష పడుతుంది. info
التفاسير:

external-link copy
6 : 58

یَوْمَ یَبْعَثُهُمُ اللّٰهُ جَمِیْعًا فَیُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا ؕ— اَحْصٰىهُ اللّٰهُ وَنَسُوْهُ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدٌ ۟۠

అల్లాహ్ వారందరిని మరల బ్రతికించి లేపి, వారు చేసిందంతా వారికి తెలిపే రోజున వారు (తాము చేసిందంతా) మరచిపోయి ఉండవచ్చు, కాని అల్లాహ్ అంతా లెక్కపెట్టి ఉంచుతాడు. మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి. info
التفاسير: