Traducción de los significados del Sagrado Corán - Traducción Telugu- Abder-Rahim ibn Muhammad

external-link copy
27 : 57

ثُمَّ قَفَّیْنَا عَلٰۤی اٰثَارِهِمْ بِرُسُلِنَا وَقَفَّیْنَا بِعِیْسَی ابْنِ مَرْیَمَ وَاٰتَیْنٰهُ الْاِنْجِیْلَ ۙ۬— وَجَعَلْنَا فِیْ قُلُوْبِ الَّذِیْنَ اتَّبَعُوْهُ رَاْفَةً وَّرَحْمَةً ؕ— وَرَهْبَانِیَّةَ ١بْتَدَعُوْهَا مَا كَتَبْنٰهَا عَلَیْهِمْ اِلَّا ابْتِغَآءَ رِضْوَانِ اللّٰهِ فَمَا رَعَوْهَا حَقَّ رِعَایَتِهَا ۚ— فَاٰتَیْنَا الَّذِیْنَ اٰمَنُوْا مِنْهُمْ اَجْرَهُمْ ۚ— وَكَثِیْرٌ مِّنْهُمْ فٰسِقُوْنَ ۟

ఆ తరువాత చాలా మంది ప్రవక్తలను మేము వారి తరువాత పంపాము. మరియు మర్యమ్ కుమారుడు ఈసాను కూడా పంపాము మరియు అతనికి ఇంజీల్ ను ప్రసాదించాము. మరియు అతనిని అనుసరించేవారి హృదయాలలో మేము జాలిని, కరుణను కలిగించాము, కాని సన్యాసాన్ని[1] వారే స్వయంగా కల్పించుకున్నారు. మేము దానిని వారిపై విధించలేదు, కాని అల్లాహ్ ప్రసన్నతను పొందగోరి వారే దానిని విధించుకున్నారు, కాని వారు దానిని పాటించవలసిన విధంగా నిజాయితీతో పాటించలేదు. కావున వారిలో విశ్వసించిన వారికి వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు. info

[1] కఠోరమైన సన్యాసాన్ని వారే (క్రైస్తవులే) తమపై తాము విధించుకున్నారు. వారు ప్రాపంచిక జీవితానికి విలువ ఇవ్వలేదు. దీనిని ఖుర్ఆన్ ఖండిస్తుంది. చూడండి, 2:143. రఅ'ఫతన్ - అంటే జాలి, కనికరం, దయ. రుహ్ బానియ్యహ్ - అంటే త్యాగం, విడిచిపెట్టడం. అంటే ప్రాపంచిక విషయాలను త్యజించటం. అంటే సన్యాసత్వం స్వీకరించటం. ఇది వారే స్వయంగా కల్పించుకున్నారు. అల్లాహ్ (సు.తా.) దీనిని విధించలేదు. వారు అల్లాహ్ (సు.తా.) ను సంతోషపరచాలని దీనిని అవలంబించారు. కాని అల్లాహ్ (సు.తా.) తాను చూపిన మార్గం పై నడిచే వారితోనే సంతోషపడతాడు. దానిలో క్రొత్త విషయాలను పుట్టించి వాటిని అవలంబించే వారితో కాదు.

التفاسير: