[1] ఈ విషయం పుల్ సిరాత్ పై జరుగుతుంది. ఈ జ్యోతి వారి సత్కార్యాల ఫలితం. దానివల్ల వారు సులభంగా స్వర్గపు త్రోవను ముగించుకుంటారు. ఇబ్నె-కసీ'ర్ లో మరియు ఇబ్నె-జరీర్ లో 'వ బి అయ్ మానిహిమ్' ను ఇలా బోధించారు: 'వారి కుడిచేతులలో వారి కర్మ పత్రాలుంటాయి.'
[2] ఈ పలుకులు వారి స్వాగతం కొరకు వేచి ఉండే దైవదూతలు పలుకుతారు.
[1] చూడండి, 29:11.
[2] కపటవిశ్వాసులైన స్త్రీపురుషులు కొంతదూరం విశ్వాసుల వెలుగులో నడిచిన తరువాత, అల్లాహ్ (సు.తా.) వారిపై చీకటిని విధిస్తాడు. అప్పుడు వారు అలా పలుకుతారు.
[3] అంటే స్వర్గం.
[4] అంటే నరకం.
[1] చూడండి, 31:33.
[1] మౌలా: కార్యకర్త, యజమాని, సంరక్షకుడు, కర్తవ్యాన్ని నిర్వహించేవాడు స్నేహితుడు, సహచరుడు, ఎల్లప్పుడు తోడుగా ఉండేవాడు. ఇక్కడ నరకపు కర్తవ్యం శిక్ష విధించటమే కదా!.
[1] చూడండి, 5:13.
[1] ఒకదానికి పదిరెట్లు, ఐదువందల రెట్లు లేక అంతకంటే అధికంగా కూడా ఇస్తాడు. ఈ ఎక్కువరెట్ల పుణ్యం వారి మాలిన్యరహితం, ఆవశ్యకత మరియు ఖర్చు చేసిన చోటు మరియు కాలాన్ని బట్టి ఉంటాయి. ఏ విధంగానైతే ఇంతకు ముందు పేర్కొనబడిందో ఫ'త్హ్ మక్కాకు మొదట ఖర్చు చేసిన వారికి, దాని తరువాత ఖర్చుచేసిన వారికంటే ఎక్కువ పుణ్యముందని.