Traducción de los significados del Sagrado Corán - Traducción Telugu- Abder-Rahim ibn Muhammad

external-link copy
185 : 2

شَهْرُ رَمَضَانَ الَّذِیْۤ اُنْزِلَ فِیْهِ الْقُرْاٰنُ هُدًی لِّلنَّاسِ وَبَیِّنٰتٍ مِّنَ الْهُدٰی وَالْفُرْقَانِ ۚ— فَمَنْ شَهِدَ مِنْكُمُ الشَّهْرَ فَلْیَصُمْهُ ؕ— وَمَنْ كَانَ مَرِیْضًا اَوْ عَلٰی سَفَرٍ فَعِدَّةٌ مِّنْ اَیَّامٍ اُخَرَ ؕ— یُرِیْدُ اللّٰهُ بِكُمُ الْیُسْرَ وَلَا یُرِیْدُ بِكُمُ الْعُسْرَ ؗ— وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللّٰهَ عَلٰی مَا هَدٰىكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟

రమదాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది[1]! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి. కాని వ్యాధిగ్రస్తుడైన వాడు, లేక ప్రయాణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్టదలచు కోలేదు. ఇది మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగ టానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ మహనీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి! info

[1] ఖుర్ఆన్, లైలతుల్ ఖద్ర్ లో లౌ'హెమ'హ్ ఫూ"జ్ నుండి ఈ ప్రపంచపు ఆకాశం మీద దింపబడింది. అక్కడ బైతుల్ - ఇ'జ్జత్ లో పెట్టబడింది. అక్కడి నుంచి 23 సంవత్సరాలలో క్రమక్రమంగా అవసరాన్ని బట్టి మహాప్రవక్త ము'హమ్మద్ ('స'అస)పై అవతరింపజేయబడింది, (ఇబ్నె-కసీ'ర్). మొట్టమొదటి వ'హీ 'హిరా గుహలో రమ'దాన్ నెలలో అవతరింపజేయబడింది. మరియు దైవప్రవక్త ('స'అస), తమ మరణానికి ముందు రమ'దాన్ నెలలోనే ఖుర్ఆన్ ను జిబ్రీల్ ('అ.స.) సమక్షంలో, రెండు సార్లు పూర్తిగా చదివి వినిపించారు. మరియు దైవప్రవక్త ('స'అస), అదే రమ'దాన్ నెలలో 23, 25, 27 రాత్రులలో, స'హాబీలకు తరావీ'హ్ నమా'జ్ (ఖియామ్ అల్లైల్) కూడా జమా'అతో చేయించారు. ('స.తిర్మిజీ', 'స. ఇబ్నె-మాజా, అల్బానీ ప్రమాణీకం). ఆ తరావీ'హ్ నమా'జ్ ఎనిమిది రకాతులు, వి'తర్ తో పాటు పదకొండు రకాతులు, అవి జాబిర్ (ర'ది.'అ.) మరియు సయ్యిదా 'ఆయిషహ్ (ర.'అన్హా)ల, ఉల్లేఖనా (రివాయతు)లు ఉన్నాయి. ('స.బు'ఖారీ).

التفاسير: