Traducción de los significados del Sagrado Corán - Traducción Telugu- Abder-Rahim ibn Muhammad

external-link copy
104 : 2

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَقُوْلُوْا رَاعِنَا وَقُوْلُوا انْظُرْنَا وَاسْمَعُوْا ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ اَلِیْمٌ ۟

ఓ విశ్వాసులారా, (మీరు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు) రా'ఇనా! అని అనకండి. ఉన్"జుర్నా! అని (గౌరవంతో) అనండి[1] మరియు (అతని మాటలను) శ్రద్ధతో వినండి. మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష గలదు. info

[1] రా'ఇనా: అంటే, Be careful; Listen to us, we lsiten to you. ఆగండి! మా మాట వినండి, మేము మీ మాట వింటాము, అని అర్థం. కాని యూదులు ఈ పదాన్ని తమ నాలుకలను త్రిప్పి, హీబ్రూ భాషలో, 'రా'ఈనా' - మా పశువుల కాపరి, లేక మూర్ఖుడు అనే అర్థం ఇచ్చే దురుద్దేశంతో పలికి తమ కక్ష తీర్చుకునేవారు. కాబట్టి విశ్వాసులతో: మీరు 'ఉన్ జుర్ నా' అంటే 'మమ్మల్ని అర్థం చేసుకోనివ్వండి.'అని గౌరవంతో, అనమని ఆజ్ఞ ఇవ్వబడుతోంది. ఇదే విధంగా యూదులు 'అస్సలాము అలైకుమ్' (మీకు శాంతి కలుగు గాక!) అనే మాటను నాలుకలు త్రిప్పి 'అస్సాము అలైకుమ్' (మీకు చావు వచ్చు గాక!) అనే అర్థంలో వాడేవారు. ఇంకా చూడండి, ఖు. 4:46.

التفاسير: