Traducción de los significados del Sagrado Corán - Traducción Telugu- Abder-Rahim ibn Muhammad

Número de página:close

external-link copy
79 : 12

قَالَ مَعَاذَ اللّٰهِ اَنْ نَّاْخُذَ اِلَّا مَنْ وَّجَدْنَا مَتَاعَنَا عِنْدَهٗۤ ۙ— اِنَّاۤ اِذًا لَّظٰلِمُوْنَ ۟۠

అతను అన్నాడు: "అల్లాహ్ నన్ను రక్షించుగాక! మా సొమ్ము ఎవరి వద్ద దొరికిందో అతనిని విడిచి, మరొకతనిని మేమెలా పట్టుకోగలము. ఒకవేళ అలా చేస్తే నిశ్చయంగా, మేము దుర్మార్గులమవుతాము." info
التفاسير:

external-link copy
80 : 12

فَلَمَّا اسْتَیْـَٔسُوْا مِنْهُ خَلَصُوْا نَجِیًّا ؕ— قَالَ كَبِیْرُهُمْ اَلَمْ تَعْلَمُوْۤا اَنَّ اَبَاكُمْ قَدْ اَخَذَ عَلَیْكُمْ مَّوْثِقًا مِّنَ اللّٰهِ وَمِنْ قَبْلُ مَا فَرَّطْتُّمْ فِیْ یُوْسُفَ ۚ— فَلَنْ اَبْرَحَ الْاَرْضَ حَتّٰی یَاْذَنَ لِیْۤ اَبِیْۤ اَوْ یَحْكُمَ اللّٰهُ لِیْ ۚ— وَهُوَ خَیْرُ الْحٰكِمِیْنَ ۟

తరువాత వారు అతని పట్ల నిరాశులై, ఆలోచించటానికి ఏకాంతంలో చేరారు! వారిలో పెద్దవాడు అన్నాడు: ఏమీ? మీ తండ్రి వాస్తవానికి మీతో అల్లాహ్ పై ప్రమాణం తీసుకున్న విషయం మీకు గుర్తులేదా? మరియు ఇంతకు పూర్వం మీరు యూసుఫ్ విషయంలో కూడా మాట తప్పారు కదా? కావున నేను నా తండ్రి నాకు అనుమతి ఇవ్వనంత వరకు లేదా అల్లాహ్ నా గురించి తీర్పు చేయనంత వరకు, నేను ఈ దేశాన్ని వదలను. మరియు ఆయనే తీర్పు చేసేవారిలో అత్యుత్తముడు." info
التفاسير:

external-link copy
81 : 12

اِرْجِعُوْۤا اِلٰۤی اَبِیْكُمْ فَقُوْلُوْا یٰۤاَبَانَاۤ اِنَّ ابْنَكَ سَرَقَ ۚ— وَمَا شَهِدْنَاۤ اِلَّا بِمَا عَلِمْنَا وَمَا كُنَّا لِلْغَیْبِ حٰفِظِیْنَ ۟

(ఇంకా ఇలా అన్నాడు): "మీరు నాన్న దగ్గరికి పోయి అతనితో ఇలా చెప్పండి: 'నాన్నా! వాస్తవానికి నీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము అతనిని (దొంగతనం చేస్తూ ఉండగా) చూడలేదు! మాకు తెలిసిందే (మేము చెబుతున్నాము). మరియు వాస్తవానికి రహస్యంగా జరిగే దానిని మేము చూడలేము కదా! info
التفاسير:

external-link copy
82 : 12

وَسْـَٔلِ الْقَرْیَةَ الَّتِیْ كُنَّا فِیْهَا وَالْعِیْرَ الَّتِیْۤ اَقْبَلْنَا فِیْهَا ؕ— وَاِنَّا لَصٰدِقُوْنَ ۟

మరియు మేము ఉన్న నగరవాసులను మరియు మేము కలిసి తిరిగి వచ్చిన బిడారు వారిని కూడా అడగిండి. మరియు మేము నిశ్చయంగా సత్యం పలుకుతున్నాము.'" info
التفاسير:

external-link copy
83 : 12

قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ اَنْفُسُكُمْ اَمْرًا ؕ— فَصَبْرٌ جَمِیْلٌ ؕ— عَسَی اللّٰهُ اَنْ یَّاْتِیَنِیْ بِهِمْ جَمِیْعًا ؕ— اِنَّهٗ هُوَ الْعَلِیْمُ الْحَكِیْمُ ۟

(యఅఖూబ్) అన్నాడు: "కానీ, మీ (దుష్ట) మనస్సులు మీచేత మరొక ఘోరకార్యాన్ని తేలికగా చేయించాయి. ఇక నా కొరకు సహనమే మేలైనది. ఇక అల్లాహ్ యే! వారందరినీ నా వద్దకు తీసుకు రావచ్చు! నిశ్చయంగా, ఆయనే సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు." info
التفاسير:

external-link copy
84 : 12

وَتَوَلّٰی عَنْهُمْ وَقَالَ یٰۤاَسَفٰی عَلٰی یُوْسُفَ وَابْیَضَّتْ عَیْنٰهُ مِنَ الْحُزْنِ فَهُوَ كَظِیْمٌ ۟

మరియు అతను వారి నుండి ముఖం త్రిప్పుకొని అన్నాడు: "అయ్యో! యూసుఫ్" అతని కన్నులు, దుఃఖం వలన తెల్లబడ్డాయి (చూపు పోయింది). అయినా అతను దానిని (వెలిబుచ్చకుండా) అణచుకున్నాడు. info
التفاسير:

external-link copy
85 : 12

قَالُوْا تَاللّٰهِ تَفْتَؤُا تَذْكُرُ یُوْسُفَ حَتّٰی تَكُوْنَ حَرَضًا اَوْ تَكُوْنَ مِنَ الْهٰلِكِیْنَ ۟

అతని (కుమారులు) అన్నారు: "అల్లాహ్ తోడు! నీవు వ్యాధితో కృశించిపోయే వరకో లేదా నశించిపోయే వరకో యూసుఫ్ ను జ్ఞాపకం చేసుకోవటం మానవు." info
التفاسير:

external-link copy
86 : 12

قَالَ اِنَّمَاۤ اَشْكُوْا بَثِّیْ وَحُزْنِیْۤ اِلَی اللّٰهِ وَاَعْلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟

(యఅఖూబ్) అన్నాడు: "వాస్తవానికి నా ఆవేదనను మరియు నా దుఃఖాన్ని నేను కేవలం అల్లాహ్ తో మాత్రమే మొర పెట్టుకోగలను మరియు మీకు తెలియనిది నాకు అల్లాహ్ ద్వారా తెలుస్తుంది. info
التفاسير: