Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán

Número de página:close

external-link copy
123 : 9

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا قَاتِلُوا الَّذِیْنَ یَلُوْنَكُمْ مِّنَ الْكُفَّارِ وَلْیَجِدُوْا فِیْكُمْ غِلْظَةً ؕ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ ۟

అవిశ్వాసులతో దగ్గరగా ఉన్నవారితో వారి సామీప్యత కారణంగా విశ్వాసులకు ప్రమాదం ఉన్నందును పోరాడమని విశ్వాసపరులకు అల్లాహ్ ఆదేశించాడు.మరియు వారిని ఇదేవిధంగా భయపెట్టడానికి మరియు వారి చెడును నెట్టడానికి బలాన్ని మరియు తీవ్రతను చూపించాలని వారిని ఆదేశించాడు.మరియు అల్లాహ్ తన సహాయము ద్వారా,తన మద్దతు ద్వారా దైవభీతి కలిగిన విశ్వాసపరులకు తోడుగా ఉంటాడు. info
التفاسير:

external-link copy
124 : 9

وَاِذَا مَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ فَمِنْهُمْ مَّنْ یَّقُوْلُ اَیُّكُمْ زَادَتْهُ هٰذِهٖۤ اِیْمَانًا ۚ— فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا فَزَادَتْهُمْ اِیْمَانًا وَّهُمْ یَسْتَبْشِرُوْنَ ۟

మరియు అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏదైన సూరా అవతరింప జేసినప్పుడు కపట విశ్వాసుల్లోంచి అవహేళన చేస్తూ,ఎగతాళి చేస్తూ ముహమ్మద్ తీసుకుని వచ్చిన దానిపై మీలో నుంచి ఈ అవతరించిన సూరా ఎవరి విశ్వాసాన్ని అధికం చేసింది ? అని అడిగేవారు ఉన్నారు.అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్తను సత్యమని అంగీకరించిన వారికి సూరా అవతరణ వారి క్రితం విశ్వాసమును అధికం చేసింది.వారందరు అవతరింపబడిన దైవవాణి ద్వారా అందులో ఉన్న వారి ఇహలోక,పరలోక ప్రయోజనాల వలన సంతోషముగా ఉన్నారు. info
التفاسير:

external-link copy
125 : 9

وَاَمَّا الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ فَزَادَتْهُمْ رِجْسًا اِلٰی رِجْسِهِمْ وَمَاتُوْا وَهُمْ كٰفِرُوْنَ ۟

మరియు కపటుల్లో నిశ్చయంగా ఖుర్ఆన్ లో ఉన్న ఆదేశాలు,గాధల అవతరణ అవతరించిన ప్రతీ దాన్ని వారి తిరస్కారము వలన వారిలో రోగమును,మాలిన్యమును అధికం చేసింది.ఖుర్ఆన్ అవతరణ అధికమవటం వలన వారి హృదయముల రోగము అధికమవుతుంది.ఎందుకంటే ఎప్పుడైన ఏదైన విషయం అవతరిస్తే వారు అందులో ఉన్నవాటి గురించి సందేహపడ్డారు.మరియు అవిశ్వాస స్థితిలోనే మరణించారు. info
التفاسير:

external-link copy
126 : 9

اَوَلَا یَرَوْنَ اَنَّهُمْ یُفْتَنُوْنَ فِیْ كُلِّ عَامٍ مَّرَّةً اَوْ مَرَّتَیْنِ ثُمَّ لَا یَتُوْبُوْنَ وَلَا هُمْ یَذَّكَّرُوْنَ ۟

ఏమి కపటవిశ్వాసులు తమ స్థితిని బహిర్గతం చేసి,ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు సార్లు వారి కపటత్వమును బట్టబయలు చేసి వారికి అల్లాహ్ పరీక్షించటం నుండి గుణపాఠమును నేర్చుకుంటూ చూడరా ?.ఆ పిదప వారికి ఇదంతా అల్లాహ్ నే చేశాడని తెలిసి కూడా తమ అవిశ్వాసము నుండి ఆయన వద్ద పశ్చాత్తాప్పడటం లేదు.మరియు తమ కపట విశ్వాసమును విడనాడటం లేదు.మరియు వారికి సంభవించినది అల్లాహ్ వద్ద నుండి అయినా వారు హితబోధన గ్రహించటం లేదు. info
التفاسير:

external-link copy
127 : 9

وَاِذَا مَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ نَّظَرَ بَعْضُهُمْ اِلٰی بَعْضٍ ؕ— هَلْ یَرٰىكُمْ مِّنْ اَحَدٍ ثُمَّ انْصَرَفُوْا ؕ— صَرَفَ اللّٰهُ قُلُوْبَهُمْ بِاَنَّهُمْ قَوْمٌ لَّا یَفْقَهُوْنَ ۟

అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏదైన సూరాను అవతరింపజేసినప్పుడు అందులో కపటవిశ్వాసుల పరిస్థితుల ప్రస్తావన ఉంటే కపటవిశ్వాసులు మిమ్మల్ని ఎవరైన చూశారా ? అని పలుకుతూ ఒకరినొకరు చూసుకుంటారు ఒక వేళ వారిని ఎవరూ చూడకపోతే వారు సభ నుండి మరలిపోతారు (నెమ్మదిగా జారుకుంటారు).వినండి అల్లాహ్ వారి హృదయాలను సన్మార్గము నుండి,మంచి నుండి మరల్చేశాడు.మరియు వారికి పరాభవమునకు లోను చేశాడు.ఎందుకంటే వారు అర్ధం చేసుకోలేని మనుషులు. info
التفاسير:

external-link copy
128 : 9

لَقَدْ جَآءَكُمْ رَسُوْلٌ مِّنْ اَنْفُسِكُمْ عَزِیْزٌ عَلَیْهِ مَا عَنِتُّمْ حَرِیْصٌ عَلَیْكُمْ بِالْمُؤْمِنِیْنَ رَءُوْفٌ رَّحِیْمٌ ۟

ఓ అరబ్ వాసులారా నిశ్చయంగా మీ కోవకు చెందినవాడే మీ వద్దకు ప్రవక్తగా వచ్చాడు అతను మీలాగే అరబ్బుడు.మీకు బాధ కలిగించేవి ఆయనకు బాధ కలిగించాయి.అతను మీ సన్మార్గము విషయంలో,మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటంలో అతని కోరిక తీవ్రమైనది.మరియు అతడు ప్రత్యేకంగా విశ్వాసపరులపై అధికముగా దయచూపేవాడు,కరుణించేవాడు. info
التفاسير:

external-link copy
129 : 9

فَاِنْ تَوَلَّوْا فَقُلْ حَسْبِیَ اللّٰهُ ۖؗ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— عَلَیْهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِیْمِ ۟۠

అయితే ఒక వేళ వారు మీ నుండి విముఖత చూపి మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించకపోతే ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : నాకు ఆ అల్లాహ్ చాలు ఎ అల్లాహ్ తప్ప సత్యఆరాధ్య దైవము లేడో. ఆయన ఒక్కడి పైనే నేను నమ్మకమును కలిగి ఉన్నాను.పరిశుద్ధుడైన ఆయన సర్వోత్తమ సింహాసనానికి ప్రభువు. info
التفاسير:
Beneficios de los versículos de esta página:
• وجوب ابتداء القتال بالأقرب من الكفار إذا اتسعت رقعة الإسلام، ودعت إليه حاجة.
ఇస్లాం యొక్క పరిధి విస్తరించి,దానికి అవసరమైతే దగ్గర ఉన్న అవిశ్వాసపరులతో పోరాడటం ప్రారంభించటం విధి. info

• بيان حال المنافقين حين نزول القرآن عليهم وهي الترقُّب والاضطراب.
ఖుర్ఆన్ అవతరణ సమయంలో కపటవిశ్వాసుల పరిస్థితి ప్రకటన అవి ఎదురుచూపులు,అయోమయ పరిస్థితులు. info

• بيان رحمة النبي صلى الله عليه وسلم بالمؤمنين وحرصه عليهم.
విశ్వాసపరులపై దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యము మరియు విశ్వాసులకు దాని ఆశ ప్రకటన. info

• في الآيات دليل على أن الإيمان يزيد وينقص، وأنه ينبغي للمؤمن أن يتفقد إيمانه ويتعاهده فيجدده وينميه؛ ليكون دائمًا في صعود.
విశ్వాసము పెరుగుతూ,తరుగుతూ ఉంటుందన్న దానిపై ఆధారం ఆయతుల్లో ఉన్నది.ఒక విశ్వాసపరుని కొరకు తన విశ్వాసమును పరిశీలించటం,దాన్ని పరిరక్షించటం,దాన్ని పునరుద్ధరిచటం,దాన్ని పెంపొందించటం అది ఎల్లప్పుడు పురోగతిలో ఉండటానికి ఎంతో అవసరం. info