Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abdurrahim ibn Muhammad

Page Number:close

external-link copy
26 : 76

وَمِنَ الَّیْلِ فَاسْجُدْ لَهٗ وَسَبِّحْهُ لَیْلًا طَوِیْلًا ۟

మరియు రాత్రివేళ ఆయన సన్నిధిలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉండు[1] మరియు రాత్రివేళ సుదీర్ఘ కాలం, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. info

[1] రాత్రివేళలో మ'గ్ రిబ్, 'ఇషా నమా'జ్ లు మరియు తహజ్జుద్ నమా'జ్ లు.

التفاسير:

external-link copy
27 : 76

اِنَّ هٰۤؤُلَآءِ یُحِبُّوْنَ الْعَاجِلَةَ وَیَذَرُوْنَ وَرَآءَهُمْ یَوْمًا ثَقِیْلًا ۟

నిశ్చయంగా, వీరు అనిశ్చితమైన ఈ ప్రాపంచిక జీవితం పట్ల మోహితులై వున్నారు. మరియు మున్ముందు రానున్న భారమైన దినాని విస్మరిస్తున్నారు[1]. info

[1] భారమైన దినం అంటే పునరుత్థాన దినం

التفاسير:

external-link copy
28 : 76

نَحْنُ خَلَقْنٰهُمْ وَشَدَدْنَاۤ اَسْرَهُمْ ۚ— وَاِذَا شِئْنَا بَدَّلْنَاۤ اَمْثَالَهُمْ تَبْدِیْلًا ۟

మేమే వీరిని సృష్టించినవారము మరియు వీరి శరీరాన్ని దృఢ పరిచిన వారము. మరియు మేము కోరినప్పుడు వీరికి బదులుగా వీరి వంటి వారిని తేగలము. info
التفاسير:

external-link copy
29 : 76

اِنَّ هٰذِهٖ تَذْكِرَةٌ ۚ— فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰی رَبِّهٖ سَبِیْلًا ۟

నిశ్చయంగా, ఇదొక హితోపదేశం కావున ఇష్టపడినవాడు తన ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు! info
التفاسير:

external-link copy
30 : 76

وَمَا تَشَآءُوْنَ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا ۟

మరియు అల్లాహ్ కోరకపోతే, మీరు కోరేదీ (జరగదు)! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. info
التفاسير:

external-link copy
31 : 76

یُّدْخِلُ مَنْ یَّشَآءُ فِیْ رَحْمَتِهٖ ؕ— وَالظّٰلِمِیْنَ اَعَدَّ لَهُمْ عَذَابًا اَلِیْمًا ۟۠

ఆయన తాను కోరినవారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. మరియు దుర్మార్గుల కొరకు ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. info
التفاسير: