[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'కాలం, అనేది మానవుని జ్ఞానపరిధికి మించినది, కాని దానిని అల్లాహ్ (సు.తా.) సృష్టించాడు.'
[2] ప్రతి వస్తువు చివరకు అల్లాహ్ (సు.తా.) వద్దకు మాత్రమే చేరుతుంది. ఎందుకంటే ఆయన (సు.తా.) ప్రతిదానికి మూలం. ఆయన ప్రతిదానికి - మరే ఇతర దానికంటే - తన జ్ఞానపరంగా సమీపంలో ఉన్నాడు.
అల్-అవ్వలు: The First, ప్రథముడు, మొట్ట మొదట వాడు, ఆద్యుడు, సర్వసృష్టిరాసుల సృష్టికి పూర్వమే ఉన్నవాడు.
అల్-ఆఖరు: The Last, The End. అంతం, కడపటి, చివరికి మిగిలే వాడు, సర్వసృష్టిరాసుల వినాశం తరువాత కూడా ఉండేవాడు.
అజ్-'జాహిరు: The Ascendant or Predominant, over all things, The Outward. ప్రత్యక్షుడు, గోచరుడు, బాహ్యం.
అల్-బాతిను: He who knows the secret and hidden things. He who is veiled from the eyes and imaginations of created beings. పరోక్షకుడు, అగోచరుడు, దృష్టికి గోచరించని, గోప్యమైన, మరగైనవాడు. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
[1] చూడండి, 7:54, 10:3, 32:4 మొదలైన వాటిలో ఈ వాక్యం ఉంది.
[2] చూడండి, 34:2.
[1] అంటే కొన్ని దినాలు రాత్రి పెద్దది పగలు చిన్నదిగా ఉంటాయి, మరికొన్ని దినాలు పగలు పెద్దది మరియు రాత్రి చిన్నదిగా ఉంటాయి.
[1] మానవుడు: 'నా సొమ్ము, నా సొమ్ము' అంటాడు. వాస్తవానికి, 1) నీవు తిని త్రాగి ఖర్చు చేసింది, 2) నీవు తొడిగి చించింది మరియు 3) నీవు అల్లాహ్ (సు.తా.) మార్గంలో ఖర్చు చేసింది మాత్రమే నీ సొమ్ము. వీటిని విడిచి మిగతాదంతా ఇతరులదే. (సహీహ్ ముస్లిం; ముస్నద్ అహ్మద్, 4/24)
[1] చూడండి, 7:172 అల్లాహ్ (సు.తా.) తన దాసుల చేత ఈ ప్రమాణం చేయించాడు.
[1] చూడండి, 15:23.
[2] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "మీరు నా అనుచరు (ర'ది.'అన్హుమ్)లను ఎవ్వరినీ నిందించకండి. ఎవరిచేతిలో నా ప్రాణముందో ఆయన (సు.తా.) ప్రమాణం - మీలో ఎవడైనా ఉ హుద్ పర్వతమంత బంగారాన్ని అల్లాహ్ (సు.తా.) మార్గంలో ఖర్చు చేసినా, అది నా సహచరుడు ('స'హబి) ఖర్చు చేసిన ఒక్క 'ముద్' లేక సగం 'ముద్'తో సమానం కాజాలదు." ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం).
[1] ఇటువంటి వాక్యం కోసం చూడండి, 2:245 అల్లాహ్ (సు.తా.) కు మంచి అప్పు ఇవ్వడం అంటే అల్లాహ్ (సు.తా.) మార్గంలో ఖర్చు చేయటం లేక దానం చేయటం. మానవుడు అల్లాహ్ (సు.తా.) మార్గంలో ఖర్చు చేసేది, అతనికి అల్లాహ్ (సు.తా.) అనుగ్రహించి ప్రసాదించినవే! అయినా అల్లాహ్ (సు.తా.) దానిని అప్పుగా పేర్కొనటం కేవలం ఆయన అనుగ్రహం మరియు కనికరం. అల్లాహ్ (సు.తా.) దానికి అదే విధంగా ప్రతిఫలమొసంగుతాడు, ఏ విధంగానైతే అప్పు తీర్చడం విధిగా చేయబడిందో!
[1] ఈ విషయం పుల్ సిరాత్ పై జరుగుతుంది. ఈ జ్యోతి వారి సత్కార్యాల ఫలితం. దానివల్ల వారు సులభంగా స్వర్గపు త్రోవను ముగించుకుంటారు. ఇబ్నె-కసీ'ర్ లో మరియు ఇబ్నె-జరీర్ లో 'వ బి అయ్ మానిహిమ్' ను ఇలా బోధించారు: 'వారి కుడిచేతులలో వారి కర్మ పత్రాలుంటాయి.'
[2] ఈ పలుకులు వారి స్వాగతం కొరకు వేచి ఉండే దైవదూతలు పలుకుతారు.
[1] చూడండి, 29:11.
[2] కపటవిశ్వాసులైన స్త్రీపురుషులు కొంతదూరం విశ్వాసుల వెలుగులో నడిచిన తరువాత, అల్లాహ్ (సు.తా.) వారిపై చీకటిని విధిస్తాడు. అప్పుడు వారు అలా పలుకుతారు.
[3] అంటే స్వర్గం.
[4] అంటే నరకం.
[1] చూడండి, 31:33.
[1] మౌలా: కార్యకర్త, యజమాని, సంరక్షకుడు, కర్తవ్యాన్ని నిర్వహించేవాడు స్నేహితుడు, సహచరుడు, ఎల్లప్పుడు తోడుగా ఉండేవాడు. ఇక్కడ నరకపు కర్తవ్యం శిక్ష విధించటమే కదా!.
[1] చూడండి, 5:13.
[1] ఒకదానికి పదిరెట్లు, ఐదువందల రెట్లు లేక అంతకంటే అధికంగా కూడా ఇస్తాడు. ఈ ఎక్కువరెట్ల పుణ్యం వారి మాలిన్యరహితం, ఆవశ్యకత మరియు ఖర్చు చేసిన చోటు మరియు కాలాన్ని బట్టి ఉంటాయి. ఏ విధంగానైతే ఇంతకు ముందు పేర్కొనబడిందో ఫ'త్హ్ మక్కాకు మొదట ఖర్చు చేసిన వారికి, దాని తరువాత ఖర్చుచేసిన వారికంటే ఎక్కువ పుణ్యముందని.
[1] చూచూడండి, 38:27 చూడండి 23:115.
[2] అల్-కుఫ్ఫారు: అంటే ఇక్కడ రైతు అనే అర్థంలో వాడబడింది. అంటే దాచేవాడు, రైతు భూమిలో విత్తనాలను దాచుతాడు. అదేవిధంగా సత్యతిరస్కారుల హృదయాలలో అల్లాహ్ (సు.తా.) మరియు అంతిమదినపు తిరస్కారం దాగి ఉంటుంది.
[1] అల్లాహ్ (సు.తా.)కు జరిగిందీ, జరగబోయేదీ అన్ని విషయాల జ్ఞానముంది. కాబట్టి ఆయన సృష్టిని ఆరంభించకముందే అంతా ఒక గ్రంథంలో వ్రాసిపెట్టాడు. అదే ఖద్ర్ / తఖ్దీర్. (స.ముస్లిం)
[1] మూమిన్ బాధ కలిగినప్పుడు సహనం వహిస్తాడు మరియు సంతోషం కలిగినప్పుడు అల్లాహ్ (సు.తా.) కు కృతజ్ఞుడవుతాడు. ఎందుకంటే అతను అది తన శ్రమ కాదు అల్లాహ్ (సు.తా.) యొక్క అనుగ్రహమని నమ్ముతాడు.
[1] అంటే అల్లాహ్ (సు.తా.) మార్గంలో ఖర్చు చేయటంలో లోభత్వం. చూడండి, 4:36-37.
[1] మీ'జాన్: అంటే త్రాసు - ఇక్కడ న్యాయం అని అర్థం.
[2] ఇనుము వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది భూమిలో విస్తారంగా దొరుకుతుంది.
[1] కఠోరమైన సన్యాసాన్ని వారే (క్రైస్తవులే) తమపై తాము విధించుకున్నారు. వారు ప్రాపంచిక జీవితానికి విలువ ఇవ్వలేదు. దీనిని ఖుర్ఆన్ ఖండిస్తుంది. చూడండి, 2:143. రఅ'ఫతన్ - అంటే జాలి, కనికరం, దయ. రుహ్ బానియ్యహ్ - అంటే త్యాగం, విడిచిపెట్టడం. అంటే ప్రాపంచిక విషయాలను త్యజించటం. అంటే సన్యాసత్వం స్వీకరించటం. ఇది వారే స్వయంగా కల్పించుకున్నారు. అల్లాహ్ (సు.తా.) దీనిని విధించలేదు. వారు అల్లాహ్ (సు.తా.) ను సంతోషపరచాలని దీనిని అవలంబించారు. కాని అల్లాహ్ (సు.తా.) తాను చూపిన మార్గం పై నడిచే వారితోనే సంతోషపడతాడు. దానిలో క్రొత్త విషయాలను పుట్టించి వాటిని అవలంబించే వారితో కాదు.