[1] ష'ఆయి'రల్లాహ్: అల్లాహ్ చిహ్నాలు. అంటే పవిత్రమైనవని సూచించిన నిదర్శనాలు, సంకేతాలు, ప్రత్యేక ధర్మవిధులను నిర్వహించటానికి చూపబడిన స్థానాలు. ఉదా: క'అబహ్, 'సఫా-మర్వాలు, మరియు ధర్మ ఆచారాలు, 'తవాఫ్, స'యీ మొదలైనవి. [2] నిషిద్ధ మాసాలు : రజబ్, జు'ల్ - ఖాయిదహ్, జు'ల్-'హిజ్జహ్ మరియు ము'హర్రమ్ ('అరబ్బీ 7, 11, 12 మరియు 1వ నెలలు) ఈ మాసాలలో యుద్ధం చేయటం నిషిద్ధం. [3] 1) హద్ యున్ : అంటే 'హాజీ, 'హజ్ కొరకు, 'హరంలో బలి (ఖుర్బానీ) చేయటానికి తెచ్చే పశువు. 2) ఖలాయి దతున్': 'హరమ్ కు తీసుకుని పోవుటకు నిశ్చయించి, వాటి మెడలలో పట్టీలు వేసిన పశువు. 3) ఫిద్ యతున్ : ధర్మ ఆచారంలో అయిన తప్పులకు పరిహారంగా ఇచ్చే బలి (ఖుర్బానీ). దీని మాంసం పూర్తిగా పేదవారిలో పంచాలి.