Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abdurrahim ibn Muhammad

external-link copy
57 : 17

اُولٰٓىِٕكَ الَّذِیْنَ یَدْعُوْنَ یَبْتَغُوْنَ اِلٰی رَبِّهِمُ الْوَسِیْلَةَ اَیُّهُمْ اَقْرَبُ وَیَرْجُوْنَ رَحْمَتَهٗ وَیَخَافُوْنَ عَذَابَهٗ ؕ— اِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُوْرًا ۟

వారు, ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు.[1] నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడ వలసిందే! info

[1] వారు ఆ దైవాలు: అంటే, యూదులూ మరియు క్రైస్తవులు, దేవుళ్ళని భావించే 'ఉ'జైర్ ('అ.స.) లేక 'ఈసా ('అ.స.) గానీ ; లేక ముష్రికులు ఆరాధించే జిన్నాతులు గానీ, దైవదూతలు గానీ, కల్పిత దైవాలు గానీ, విగ్రహాలు గానీ లేక పుణ్యవంతులైన ముస్లింలు గానీ, లేక ఇతర వలీలు గానీ కావచ్చు. వీరంతా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందే మార్గాన్ని వెతుకుతున్నారు. అలాంటప్పుడు వారు ఇతరులకు ఏ విధంగా సహాయపడగలరు. వీరిని ఆరాధించటం మరియు వీరి సహాయం కోరటం షిర్క్. అల్లాహ్ (సు.తా.) షిర్క్ ను ఎన్నడూ క్షమించడు.

التفاسير: