Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abdurrahim ibn Muhammad

ఇబ్రాహీమ్

external-link copy
1 : 14

الٓرٰ ۫— كِتٰبٌ اَنْزَلْنٰهُ اِلَیْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ۙ۬— بِاِذْنِ رَبِّهِمْ اِلٰی صِرَاطِ الْعَزِیْزِ الْحَمِیْدِ ۟ۙ

అలిఫ్ - లామ్ - రా[1]. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీనిని మేము, ప్రజలను - వారి ప్రభువు అనుమతితో - అంధకారాల నుండి వెలుతురులోకి,[2] సర్వశక్తిమంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) మార్గం వైపునకు తీసుకు రావటానికి, (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాము. info

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
'[2] చూడండి 57:9 మరియు 2:257.

التفاسير:

external-link copy
2 : 14

اللّٰهِ الَّذِیْ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَوَیْلٌ لِّلْكٰفِرِیْنَ مِنْ عَذَابٍ شَدِیْدِ ۟ۙ

ఆయనే అల్లాహ్! ఆకాసాలలో ఉన్నదీ మరియు భూమిలో ఉన్నదీ సర్వమూ ఆయనకే చెందుతుంది! మరియు సత్యతిరస్కారులకు కఠిన శిక్ష వల్ల తీవ్రమైన దుఃఖం (వ్యధ) కలుగుతుంది. info
التفاسير:

external-link copy
3 : 14

١لَّذِیْنَ یَسْتَحِبُّوْنَ الْحَیٰوةَ الدُّنْیَا عَلَی الْاٰخِرَةِ وَیَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ وَیَبْغُوْنَهَا عِوَجًا ؕ— اُولٰٓىِٕكَ فِیْ ضَلٰلٍۢ بَعِیْدٍ ۟

ఎవరైతే పరలోక జీవితం కంటే, ఇహలోక జీవితానికి అధిక ప్రాధాన్యతనిచ్చి, (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి ఆటంక పరుస్తూ, దానిని వక్రమైనదిగా చూపగోరుతారో! అలాంటి వారే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయిన వారు. info
التفاسير:

external-link copy
4 : 14

وَمَاۤ اَرْسَلْنَا مِنْ رَّسُوْلٍ اِلَّا بِلِسَانِ قَوْمِهٖ لِیُبَیِّنَ لَهُمْ ؕ— فَیُضِلُّ اللّٰهُ مَنْ یَّشَآءُ وَیَهْدِیْ مَنْ یَّشَآءُ ؕ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

మరియు మేము ప్రతి ప్రవక్తను అతని జాతివారి భాషతోనే పంపాము; అతను వారికి స్పష్టంగా బోధించటానికి, మరియు అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు.[1] మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. info

[1] ఎవడు మార్గభ్రష్టుడవుతాడో మరియు ఎవడు సన్మార్గంపై ఉంటాడో అల్లాహ్ (సు.తా.)కు తెలుసు. కాబట్టి ఆయన వారిని వారి పరిస్థితులలో వదలుతాడు. అల్లాహ్ (సు.తా.) బలవంతంగా ఎవరినీ కూడా మార్గభ్రష్టులుగా గానీ, సన్మార్గులుగా గానీ చేయడు. ఇంకా చూడండి, 16:93.

التفاسير:

external-link copy
5 : 14

وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰی بِاٰیٰتِنَاۤ اَنْ اَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ۙ۬— وَذَكِّرْهُمْ بِاَیّٰىمِ اللّٰهِ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ ۟

మరియు వాస్తవానికి మేము మూసాను, మా సూచనలతో (ఆయాత్ లతో) పంపి: "నీ జాతి వారిని అంధకారాల నుండి వెలుతురు వైపునకు తెచ్చి, వారికి అల్లాహ్ దినాలను[1] జ్ఞాపకం చేయించు." అని అన్నాము. నిశ్చయంగా, ఇందులో సహనశీలురకు, కృతజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి.[2] info

[1] అయ్యామిల్లాహ్: అంటే ఇస్రాయీ'ల్ సంతతివారిపై అల్లాహుతా'ఆలా చేసిన అనుగ్రహాలు మరియు వారిపై పడ్డ శిక్షలు. [2] సహనం వహించి కృతజ్ఞతలు తెలిపే వారికి చాలా లాభాలుంటాయి. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'అల్లాహ్ (సు.తా.) తన దాసుని కొరకు ఎట్టి పరిస్థితిని ఏర్పరిచినా అది అతని మేలుకే! అతనికి కష్టాలు కలిగిస్తే, వాటిని అతడు సహించితే అతని మేలుకే! లేక అతనికి సుఖసంతోషాలు ప్రసాదిస్తే అతడు దానికి తన ప్రభువుకు కృతజ్ఞతలు చూపాలి.' ('స'హీ'హ్ ముస్లిం).

التفاسير: