Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

Page Number:close

external-link copy
41 : 9

اِنْفِرُوْا خِفَافًا وَّثِقَالًا وَّجَاهِدُوْا بِاَمْوَالِكُمْ وَاَنْفُسِكُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ ؕ— ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟

ఓ విశ్వాసపరులారా మీరు క్లిష్టమైన పరిస్థితుల్లో,సానుకూలమైన పరిస్థితుల్లో యవ్వనంలో,వృద్ధాప్యంలో అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం కొరకు బయలుదేరండి.మరియు మీరు మీ సంపదల ద్వారా,మీ ప్రాణాల ద్వారా పోరాడండి.నిశ్చయంగా ఆ బయలుదేరటం,సంపదలు,ప్రాణాల ద్వారా పోరాడటము యుద్ధం కొరకు బయలుదేరకుండా కూర్చోవటం,సంపదలు,ప్రాణాల భద్రతతో కొలువు తీరటం కన్న ఇహలోక జీవితంలో,పరలోక జీవితంలో చాలా ప్రయోజకరమైనది. ఒక వేళ మీరు దాన్ని తెలుసుకుంటే దానిపై ఆత్యాశ చూపండి. info
التفاسير:

external-link copy
42 : 9

لَوْ كَانَ عَرَضًا قَرِیْبًا وَّسَفَرًا قَاصِدًا لَّاتَّبَعُوْكَ وَلٰكِنْ بَعُدَتْ عَلَیْهِمُ الشُّقَّةُ ؕ— وَسَیَحْلِفُوْنَ بِاللّٰهِ لَوِ اسْتَطَعْنَا لَخَرَجْنَا مَعَكُمْ ۚ— یُهْلِكُوْنَ اَنْفُسَهُمْ ۚ— وَاللّٰهُ یَعْلَمُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟۠

ఓ ప్రవక్తా యుద్ధం నుండి వెనుక ఉండే విషయంలో మీతో అనుమతి కోరిన కపటులను మీరు దేని వైపునైతే పిలుస్తున్నారో ఒక వేళ అది సులభంగా లభించే యుద్ధ ప్రాప్తి అయితే,ఎటువంటి కష్టములేని ప్రాయాణము అయితే వారు తప్పకుండా మిమ్మల్ని అనుసరించేవారు.కాని శతృవుల వైపు చేదించటానికి మీరు వారిని పిలిచిన ప్రయాణం దూరం అయిపోయింది.అయితే వారు వెనుక ఉండిపోయారు.వెనుక ఉండటం విషయంలో అనుమతి పొందిన ఈ కపటులందరు మీరు వారి వద్దకు వెళ్ళినప్పుడు ఇలా పలుకుతూ అల్లాహ్ పై ప్రమాణం చేస్తారు : ఒక వేళ మేము మీతోపాటు యుద్ధమునకు బయలుదేరే శక్తిని కలిగి ఉంటే తప్పకుండా మేము బయలుదేరే వాళ్ళము.వారి యుద్ధము నుండి వెనుక ఉండిపోవటం వలన,వారి ఈ అబద్దపు ప్రమాణాల వలన తమ ప్రాణములను అలాహ్ శిక్షకు సమర్పించుకుని స్వయాన నాశనమైపోయారు.మరియు వారు తమ వాదనల్లో,తమ ఈ ప్రమాణాల్లో అసత్యులని అల్లాహ్ కు తెలుసు. info
التفاسير:

external-link copy
43 : 9

عَفَا اللّٰهُ عَنْكَ ۚ— لِمَ اَذِنْتَ لَهُمْ حَتّٰی یَتَبَیَّنَ لَكَ الَّذِیْنَ صَدَقُوْا وَتَعْلَمَ الْكٰذِبِیْنَ ۟

ఓ ప్రవక్తా యుద్ధంలో వెనుక ఉండటం విషయంలో మీరు వారికి అనుమతి ఇవ్వటంలో మీ ప్రయత్నము చేసిన విషయంలో అల్లాహ్ మిమ్మల్ని మన్నించుగాక.వారు ప్రవేశపెట్టిన తమ సాకుల్లో సత్యవంతులో,అందులో అసత్యవంతులో అని మీకు స్పష్టం అవ్వక ముందే వారికి మీరు ఎందుకు అనుమతినిచ్చారు ?.అటువంటప్పుడు మీరు వారిలో అసత్యవంతులకు కాకుండా సత్యవంతులకు అనుమతినిచ్చేవారు. info
التفاسير:

external-link copy
44 : 9

لَا یَسْتَاْذِنُكَ الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ اَنْ یُّجَاهِدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالْمُتَّقِیْنَ ۟

ఓ ప్రవక్తా తమ సంపదల ద్వారా,తమ ప్రాణముల ద్వారా అల్లాహ్ మార్గములో పోరాడటం నుండి వెనుక ఉండే విషయంలో మీతో అనుమతిని కోరటం అల్లాహ్ పై,ప్రళయ దినముపై సత్యవిశ్వాసమును కనబరిచే విశ్వాసపరులకు తగదు. కాని మీరు వారిని యుద్ధం కొరకు ఎప్పుడు బయలుదేరమని అడిగితే అప్పుడు బయలుదేరటం,తమ సంపదల ద్వారా,తమ ప్రాణాల ద్వారా పోరాడటం వారికి వర్తిస్తుంది. మీతో పాటు బయలుదేరటం నుండి వారిని ఆపే కారణాలు ఉంటే తప్ప మీతో అనుమతి అడగని దైవభీతి గల తన దాసుల గురించి అల్లాహ్ కి బాగా తెలుసు. info
التفاسير:

external-link copy
45 : 9

اِنَّمَا یَسْتَاْذِنُكَ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَارْتَابَتْ قُلُوْبُهُمْ فَهُمْ فِیْ رَیْبِهِمْ یَتَرَدَّدُوْنَ ۟

ఓ ప్రవక్తా నిశ్చయంగా అల్లాహ్ మార్గములో పోరాటము నుండి వెనుక ఉండే విషయంలో మీతో అనుమతి కోరే వారు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచని,ప్రళయ దినముపై విశ్వాసమును కనబరచని కపటులు. అల్లాహ్ ధర్మం విషయంలో వారి మనస్సులకి సందేహము కలిగింది. వారు సత్యం వైపునకు మార్గం పొందకుండా తమ సందేహములో గందరగోళంగా ఊగిసలాడుతున్నారు. info
التفاسير:

external-link copy
46 : 9

وَلَوْ اَرَادُوا الْخُرُوْجَ لَاَعَدُّوْا لَهٗ عُدَّةً وَّلٰكِنْ كَرِهَ اللّٰهُ انْۢبِعَاثَهُمْ فَثَبَّطَهُمْ وَقِیْلَ اقْعُدُوْا مَعَ الْقٰعِدِیْنَ ۟

ఒక వేళ అల్లాహ్ మార్గములో యుద్ధము కొరకు మీతో పాటు బయలుదేరటమును వారు కోరుకుంటున్నారన్న వాదనలో వారు సత్యవంతులైతే దాని కొరకు వారు యుద్ధ సామగ్రిని తయారు చేసుకొని సిద్ధం అయ్యేవారు.కాని అల్లాహ్ మీతో పాటు వారి బయలుదేరటమును ఇష్టపడలేదు.అయితే వారికి బయలుదేరటం బరువైనది చివరికి వారు తమ ఇళ్ళలోనే కూర్చోవటమును ప్రాధాన్యతనిచ్చారు. info
التفاسير:

external-link copy
47 : 9

لَوْ خَرَجُوْا فِیْكُمْ مَّا زَادُوْكُمْ اِلَّا خَبَالًا وَّلَاۡاَوْضَعُوْا خِلٰلَكُمْ یَبْغُوْنَكُمُ الْفِتْنَةَ ۚ— وَفِیْكُمْ سَمّٰعُوْنَ لَهُمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالظّٰلِمِیْنَ ۟

ఈ కపటులందరు మీతో పాటు బయలుదేరకుండా ఉండటంలోనే మేలు ఉన్నది.ఒక వేళ వారు మీతో పాటు బయలుదేరి ఉంటే వారు నిస్సహాయ స్థిలిలో వదిలివేయటం,సందేహాలను కలిగించటం లాంటి కార్యాలను చేసి మీలో కల్లోలాలను అధికం చేస్తారు.మిమ్మల్ని చెల్లాచెదురు చేయటం కొరకు మీ పంక్తుల్లో చాడీలను వేగవంతంగా వ్యాపింపజేస్తారు.ఓ విశ్వాసపరులారా మీలో వారి అబద్దపు ప్రచారాలను విని వాటిని అంగీకరించి వ్యాపింపజేసేవారు ఉన్నారు.తద్వారా మీ మధ్య విభేదాలు తలెత్తుతాయి.మరియు విశ్వాసపరుల మధ్య కుట్రలను,సందేహాలను కలిగించే కపటుల్లోంచి దుర్మార్గుల గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. info
التفاسير:
Benefits of the verses in this page:
• وجوب الجهاد بالنفس والمال كلما دعت الحاجة.
ఎప్పుడైన అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రాణము,సంపద ద్వారా పోరాడటం అనివార్యము. info

• الأيمان الكاذبة توجب الهلاك.
అసత్యపు ప్రమాణాలు వినాశనమును అనివార్యము చేస్తాయి. info

• وجوب الاحتراز من العجلة، ووجوب التثبت والتأني، وترك الاغترار بظواهر الأمور، والمبالغة في التفحص والتريث.
తొందరపాటు నుండి జాగ్రత్తపడటం తప్పనిసరి,స్థిరత్వమును,నిధానమును వహించటం,విషయాల బాహ్యాల వలన మోసపోవటమును మరియు అతిగా పరిశీలించటం,వేచి ఉండటమును వదిలివేయటం అనివార్యము. info

• من عناية الله بالمؤمنين تثبيطه المنافقين ومنعهم من الخروج مع عباده المؤمنين، رحمة بالمؤمنين ولطفًا من أن يداخلهم من لا ينفعهم بل يضرهم.
అల్లాహ్ కపటులను అదుపులో ఉంచటం,వారిని తన దాసుల్లోంచి విశ్వాసపరులైన వారితో పాటు బయలుదేరటం నుండి ఆపటం విశ్వాసపరులపై అల్లాహ్ అనుగ్రహము.వారికి లాభంచేయక నష్టం కలిగించే వారి రహస్యాలను తెలపటం విశ్వాసపరులపై కారుణ్యము,దయ. info