Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
40 : 8

وَاِنْ تَوَلَّوْا فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَوْلٰىكُمْ ؕ— نِعْمَ الْمَوْلٰی وَنِعْمَ النَّصِیْرُ ۟

ఒక వేళ అవిశ్వాసము,అల్లాహ్ మార్గము నుండి ఆపటమును విడనాడటం గురించి వారికి ఆదేశించబడిన దాని నుండి వారు మరలిపోతే ఓ విశ్వాసపరులారా అల్లాహ్ వారిపై మీకు సహాయమును చేస్తాడని (విజయమును కలిగిస్తాడని) మీరు నమ్మకమును కలిగి ఉండండి.ఆయనతో స్నేహం చేసేవాడి కొరకు ఆయన ఎంతో గొప్ప సంరక్షకుడు,ఆయనకి సహాయపడే వాడికి ఆయన ఎంతో గొప్ప సహాయకుడు.ఎవరినైతే ఆయన సంరక్షిస్తాడో అతడు సాఫల్యం చెందుతాడు.మరియు ఆయన ఎవరికైతే సహాయం చేస్తాడో అతడు విజయమును పొందుతాడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• الصد عن المسجد الحرام جريمة عظيمة يستحق فاعلوه عذاب الدنيا قبل عذاب الآخرة.
మస్జిదుల్ హరామ్ నుండి ఆపటం మహా పాపము.దాని చర్యకు పాల్పడే వాడు పరలోక శిక్ష కన్నా ముందు ఇహలోక శిక్షకు అర్హుడవుతాడు. info

• عمارة المسجد الحرام وولايته شرف لا يستحقه إلّا أولياء الله المتقون.
మస్జిదుల్ హరామ్ సంరక్షణ,కార్య నిర్వహణ బాధ్యత గౌరవోన్నతమైనది. దైవ భీతి కలిగిన అల్లాహ్ స్నేహితులు మాత్రమే దానికి హక్కుదారులవుతారు info

• في الآيات إنذار للكافرين بأنهم لا يحصلون من إنفاقهم أموالهم في الباطل على طائل، وسوف تصيبهم الحسرة وشدة الندامة.
ఆయతుల్లో అవిశ్వాసపరులకు హెచ్చరిక ఉన్నది.ఎందుకంటే వారు తమ సొమ్మును అసత్యములో అర్ధం లేకుండా ఖర్చు చేసి ఏమి పొందలేరు. వారికి తొందరలోనే విచారము,తీవ్రమైన అవమానము కలుగుతుంది. info

• دعوة الله تعالى للكافرين للتوبة والإيمان دعوة مفتوحة لهم على الرغم من استمرار عنادهم.
అవిశ్వాసపరులకు పశ్చాత్తాప్పడటం కొరకు,విశ్వాసమును కనబరచడం కొరకు అల్లాహ్ పిలుపు సత్యము నుండి వారు వ్యతిరేకతలో ఉన్నప్పటికి వారికి బహిరంగంగా పిలుపునివ్వటం జరిగింది. info

• من كان الله مولاه وناصره فلا خوف عليه، ومن كان الله عدوًّا له فلا عِزَّ له.
అల్లాహ్ ఎవరికి సంరక్షకుడై ఉంటాడో,ఎవరికి సహాయకుడై ఉంటాడో అతనిపై ఎటువంటి భయం ఉండదు.మరియు అల్లాహ్ ఎవరికి శతృవైపోతాడో అతనికి ఎటువంటి గౌరవం,ఆధిక్యత ఉండదు. info