Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

Page Number:close

external-link copy
26 : 76

وَمِنَ الَّیْلِ فَاسْجُدْ لَهٗ وَسَبِّحْهُ لَیْلًا طَوِیْلًا ۟

మరియు రాత్రి వేళ రెండు నమాజులలో అనగా మగ్రిబ్ మరియు ఇషా నమాజులలో ఆయన్ను ధ్యానించు. మరియు వాటి తరువాత తహజ్జుద్ నమాజ్ పాటించు. info
التفاسير:

external-link copy
27 : 76

اِنَّ هٰۤؤُلَآءِ یُحِبُّوْنَ الْعَاجِلَةَ وَیَذَرُوْنَ وَرَآءَهُمْ یَوْمًا ثَقِیْلًا ۟

నిశ్చయంగా అవిశ్వాసులు ఈ తాత్కాలిక ఇహలోక జీవితాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు. అందులో ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే దాని వెనుక వచ్చే అంతిమదినం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు - ఆ అంతిమదినం ఎంతో భారమైన దినం. ఎందుకంటే అందులో దిగ్భ్రాంతికి గురి చేసే తీవ్రమైన పరిస్థితులు మరియు పరీక్షలు ఉన్నాయి. info
التفاسير:

external-link copy
28 : 76

نَحْنُ خَلَقْنٰهُمْ وَشَدَدْنَاۤ اَسْرَهُمْ ۚ— وَاِذَا شِئْنَا بَدَّلْنَاۤ اَمْثَالَهُمْ تَبْدِیْلًا ۟

మేము వారిని సృష్టించాము. బలమైన కీళ్ళు, అవయవాలు మరియు ఇతర శరీర భాగాలతో వారిని బలోపేతం చేశాము. ఒకవేళ మేము తలుచుకుంటే వారిని నాశనం చేసి, వారికి బదులుగా అలాంటి బలమైన వారిని సృష్టించగలము. info
التفاسير:

external-link copy
29 : 76

اِنَّ هٰذِهٖ تَذْكِرَةٌ ۚ— فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰی رَبِّهٖ سَبِیْلًا ۟

ఎవరైతే తన ప్రభువు సంతృప్తి చెందే మార్గాన్ని అనుసరించాలని కోరుకుంటున్నారో, అలాంటి వారి కొరకు ఈ సూర ఒక ఉపదేశం మరియు జ్ఞాపిక. కాబట్టి అలాంటి వారు దానిని పొందగలరు. info
التفاسير:

external-link copy
30 : 76

وَمَا تَشَآءُوْنَ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا ۟

అల్లాహ్ ను సంతృప్తి పరిచే మార్గాన్ని అనుసరించాలని కోరుకునే వారిలో అల్లాహ్ కోరినవారు తప్ప, మరెవ్వరూ దానిని అనుసరించలేరు. ప్రతి ఆజ్ఞ ఆయన అధీనంలోనే ఉంది. తన దాసులలో ఎవరు సన్మార్గంలో కొనసాగుతారో మరియు ఎవరు కొనసాగరో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆయన సృష్టించడంలో, శక్తి సామర్ధ్యాలలో మరియు శాసించడంలో మహావివేకవంతుడు. info
التفاسير:

external-link copy
31 : 76

یُّدْخِلُ مَنْ یَّشَآءُ فِیْ رَحْمَتِهٖ ؕ— وَالظّٰلِمِیْنَ اَعَدَّ لَهُمْ عَذَابًا اَلِیْمًا ۟۠

తన దాసులలో నుండి, ఆయన తన ఇష్టానుసారం తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. వారికి దైవవిశ్వాసం (ఈమాన్) మరియు పుణ్యకార్యాల జ్ఞానం ప్రసాదిస్తాడు. మరియు స్వయంగా అవిశ్వాసంలో మరియు పాపాలలో మునిగి పోవడం వలన సత్యతిరస్కారుల కొరకు ఆయన పరలోకంలో బాధాకరమైన శిక్షను తయారు చేశాడు. అదే నరకాగ్ని శిక్ష. info
التفاسير:
Benefits of the verses in this page:
• خطر التعلق بالدنيا ونسيان الآخرة.
లోకముతో సంబంధము ఏర్పరచటం మరియు పరలోకమును మరచిపోవటం యొక్క ప్రమదము. info

• مشيئة العبد تابعة لمشيئة الله.
దాసుని ఇచ్ఛ దైవ ఇచ్ఛను అనుసరిస్తుంది. info

• إهلاك الأمم المكذبة سُنَّة إلهية.
తిరస్కారులను తుదిముట్టించటం దైవ సంప్రదాయం. info