Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
95 : 6

اِنَّ اللّٰهَ فَالِقُ الْحَبِّ وَالنَّوٰی ؕ— یُخْرِجُ الْحَیَّ مِنَ الْمَیِّتِ وَمُخْرِجُ الْمَیِّتِ مِنَ الْحَیِّ ؕ— ذٰلِكُمُ اللّٰهُ فَاَنّٰی تُؤْفَكُوْنَ ۟

నిశ్చయంగా అల్లాహ్ ఒక్కడే విత్తనములను చీల్చి దాని ద్వారా పంటలను తీస్తున్నాడు. మరియు అతడు టెంకను చీల్చి దాని ద్వారా ఖర్జూరపు చెట్లను తీస్తున్నాడు,నిర్జీవం నుండి జీవమును తీస్తున్నాడు అప్పుడే మానవుడిని,జంతువులన్నింటిని వీర్య బిందువు నుండి తీస్తున్నాడు. మరియు జీవము నుండి నిర్జీవమును తీస్తున్నాడు అప్పుడే మనిషి నుండి వీర్య బిందువును,కోడి నుండి గ్రుడ్డును తీస్తున్నాడు. ఇదంతా మిమ్మల్ని సృష్టించిన ఆ అల్లాహ్ చేస్తున్నాడు. అయితే ఓ బహు దైవారాదుకులారా మీరు ఆయన అద్భుతమైన సృష్టిని చూసి కూడా సత్యము నుండి ఎలా మరలిపోతున్నారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• الاستدلال ببرهان الخلق والرزق (تخليق النبات ونموه وتحول شكله وحجمه ونزول المطر) وببرهان الحركة (حركة الأفلاك وانتظام سيرها وانضباطها)؛ وكلاهما ظاهر مشاهَد - على انفراد الله سبحانه وتعالى بالربوبية واستحقاق الألوهية.
సృష్టి మరియు ఆహారోపాధి యొక్క ఆధారము ద్వారా (మొక్కలను సృష్టించటం,వాటి పెరుగుదల,వాటి రూపు రేఖలు మారటం మరియు వర్షం కురవటం) మరియు చలనము యొక్క ఆధారము ద్వారా (సౌర వ్యవస్థ చలనము,వాటి చలనంలో క్రమశిక్షణ,వాటి క్రమబద్దత) నిరూపణ. ఆ రెండు రుబూబియ్యత్ లో అల్లాహ్ ఒక్కడే అన్న దానికి,అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు హక్కుదారుడు అనటానికి ప్రత్యక్ష సాక్ష్యం. info

• بيان ضلال وسخف عقول المشركين في عبادتهم للجن.
ముష్రికులు జిన్నుల కొరకు తమ ఆరాధన విషయంలో వారి బుధ్ధి హీనత,మార్గభ్రష్టత వివరణ. info